• November 27, 2021

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. అర్దరాత్రి రిషి వసు ఆటలు

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. అర్దరాత్రి రిషి వసు ఆటలు

    Guppedantha Manasu గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ అంటే శుక్రవారం నాడు అంటే 306వ ఎపిసోడ్‌లో తల్లీకొడుకుల బంధం ఎక్కువగా కనిపిస్తుంది. రిషి ఏంటి జగతి మేడం కారులో రావడం ఏంటి? అని మహేంద్ర, వసులు ఆశ్చర్యపోతోంటారు. మహేంద్ర ఆశ్చర్యంలో ఉండగా.. జగతి మాత్రం ఫుల్ ఖుషీగా ఉంటుంది. ఇక వసుకి కూడా ఓ సర్ ప్రైజ్ వచ్చేసింది. అలామొత్తానికి ఎపిసోడ్ ఫుల్ ఖుషీగా సాగింది. ఎపిసోడ్ ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం.

    వసు భవిష్యత్తును డిసైడ్ చేసేందుకు నేను ఎవరి. లక్ష్యంలో ఏదైనా సాయం చేస్తాను. అంతకు మించి ఏముంటుంది సర్.. అని కారులో వెళ్తుండగా జగతి రిషి మాట్లాడుకోవడంతో శుక్రవారం నాడు ఎపిసోడ్ ముగుస్తుంది. నాకు వసు కావాలి మేడంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. దానికి క్లారిటీగా శనివారం నాటి ఎపిసోడ్‌లో రిషి కంటిన్యూ చేస్తాడు.

    నాకు వసుధార కావాలి మేడం అని రిషి అడగడంతో.. జగతి షాక్ అవుతుంది. నా ఉద్దేశ్యం.. తనొక ప్రత్యేకమైన స్టూడెంట్.. అలాంటి వాళ్లు అరుదుగా దొరుకుతారు.. తను మన కాలేజ్‌లో చదివి వెళ్లిపోవడం.. నాకు నచ్చడం లేదు.. మన కాలేజ్‌లోనే ఉండాలి.. స్టాఫ్‌గా ఉండమని ఒప్పించండి.. అని రిషి అంటాడు. ఈ విషయం అడగగలను.. ఒప్పించలేను కదా? అని జగతి మేడం అంటుంది.

    డీబీఎస్టీ ఫ్యాకల్టీ హెడ్డుగా మీకు ఇస్తున్న బాధ్యత మీరు చేయండి అని జగతికి ఆర్డర్ వేస్తాడు రిషి.. తనను మీరు ఒప్పించలేరా? అని రివర్స్‌లో జగతి ప్రశ్నిస్తుంది. మీకు పని అప్పగించాను మీరు చేయండి. తనకు ఎన్ని ప్రణాళికలున్నా కూడా.. కాలేజ్‌లో పని చేస్తూ చూసుకోమనండి.. అని రిషి అంటాడు. నాకు నీ మనసు ఎప్పుడో అర్థమైంది రిషి.. కానీ నీకే అర్థం కాలేదు.. అంటూ జగతి లోలోపల అనుకుంటుంది.

    అలా ఈ సీన్ అక్కడ కట్ చేస్తే.. వసు, మహేంద్రల మీద ఓపెన్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పనిని వదిలేయొద్దు రిషి, జగతిని కలపాలి అని వసుతో మహేంద్ర అంటాడు.. ఒకప్పుడు నమ్మకం ఉండేది.. కానీ ఇప్పుడు కుదరడం లేదు.. గురు దక్షిణ ఇవ్వలేనేమో సర్ అని వసు అంటుంది.. శిరీష్ విషయంలో అలా అన్నాడని బాధపడుతున్నావా? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేశావ్.. నీ ప్రయత్నలోపమేమీ లేదు.. చెయ్యనని మాత్రం అనొద్దు.. శిరీష్ విషయంలో.. అపార్థం చేసుకున్నాడు బాధపెట్టాడు.. నా వైపు నుంచి సారీ.. అని మహేంద్ర అంటాడు..

    మీరు సారి ఎందుకు చెబుతారు సార్.. రిషి సర్ మనసు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఒక్కోసారి ఆయనకే తన మనసేంటో క్లారిటీ ఉండదు.. ఉన్నా కూడా అలా నటిస్తాడా? అన్నది కూడా అర్థం కాదని వసు అంటుంది. రిషి ఆలోచనలను.. నాకు, జగతి కంటేనువ్వే ఎక్కువ అంచనా వేయగలవు.. కాస్త ఓపిక పడితే.. గురు దక్షిణ చెల్లించడం పెద్ద విషయం ఏమీ కాదు.. అని ఇలా వసు, మహేంద్రలు మాట్లాడుకునే సమయంలో జగతి మేడం కారు హార్న్ సౌండ్ వినిపిస్తుంది.

    ఏంటి జగతి మేడం వచ్చారు.. కారులోంచి రిషి దిగుతున్నారేంటి? జగతి మేడం, రిషి ఒకే కారులో రావడం ఏంటి? అని మహేంద్ర, వసు ఇద్దరూ షాక్ అవుతారు. వసుధార మనం ఏం చూస్తున్నామని మహేంద్ర అంటే.. నాకూ అదే అర్థం కావడం లేదు సర్ అని వసు అంటుంది.. రిషి సర్, జగతి మేడం ఒకే కారులో.. అది రిషి సర్ డ్రైవ్ చేస్తూ అని వసు షాక్‌లోనే ఉంటుంది.

    జగతి మేడం అంటూ మహేంద్ర పలకరిస్తాడు. మేడంతో పాటు నేను కూడా వచ్చాను.. నన్ను కూడా పలకరించొచ్చు.. అని రిషి కౌంటర్ వేస్తాడు. అదే నాకు అర్థం కావడం లేదు అని మహేంద్ర అంటాడు.. అర్థం కాకపోవడం ఏంటి.. నా కారు పెదనాన్న తీసుకెళ్తే.. నేను మేడం కారులో వచ్చాను. మేడంకు ఇబ్బంది అనిపిస్తే నేను కారు డ్రైవ్ చేశాను. ఏంటి మేడం అంతే కదా? అని జగతిని రిషి దబాయిస్తాడు.

    అమ్మ రిషి.. నా చేతిలోంచి స్టీరింగ్ తీసుకుని.. నా చేతే అబద్దం చెప్పిస్తావా? అంటూ లోలోపల జగతి మురిసిపోతుంది.. నీతో ఒక విషయం మాట్లాడాలని మేడం గారిని రమ్మన్నాను.. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లీడర్‌గా నిన్ను అపాయింట్ చేస్తున్నాను.. ఇది మేడం గారి ముందే ఇవ్వాలని అనుకున్నాను..అని రిషి చెబుతాడు. మరి వికాస్ అని వసు అడిగితే.. మేడం గారి దగ్గర వర్క్ చేసుకుంటాడు.. మనిద్దరం.. ప్రాజెక్ట్ వర్క్ చూసుకుందాం.. ఇంతకు ముందు నువ్ కేవలం అసిస్టెంట్ మాత్రమే కానీ ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చాను.. సాలరీ, బాధ్యతలు అన్నీ పెరుగుతాయి.. హాలీడేలో మనం ఆ పనులను చేయాల్సి ఉంటుంది.. అని రిషి క్లారిటీ ఇస్తాడు.

    మేడం మీరు క్లియర్ కదా? అని చివర్లో జగతికి ఝలక్ ఇస్తాడు.. నాకేం చెప్పావ్.. క్లియర్ అవ్వడానికి అని లోలోపల అనుకుంటూ.. ఓకే సర్ ఓకే.. అని జగతి అంటుంది. డాడీ వెళ్దామా?. థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్.. నేను నీకు ఇచ్చానా? నువ్ నాకు ఇచ్చావా?.. అని లోలోపల జగతి అనుకుంటుంది. కాఫీ తాగి వెళ్లండని వసు అంటే.. వచ్చిన పని అయిందని రిషఇ అంటాడు.

    వసు.. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను రిషి ఒకే కారులో వచ్చామంటే నాకు చాలా ఆనందంగా ఉంది.. పక్కన కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేశాడు. మధ్యలో రిషి చేశాడు.. నాకు చాలా ఆనందంగా ఉంది.. ఆ కారులో నేను ఎప్పుడు వెళ్తానో.. ముగ్గురం కలిసి నవ్వుకుంటూ వెళ్లే రోజు వస్తుందా? అని జగతి సంబరపడిపోతుంది. ఇక మహేంద్ర మాటలను వసు గుర్తుకు చేసుకుంటుంది. గురు దక్షిణ విషయాన్ని తలుచుకుంటుంది. నాది అత్యాశనా?.. ఎక్కువ ఆలోచిస్తున్నానా? చాలా హ్యాపీగా ఉంది.. ఇంటికి వెళ్దాం పద.. అని వసుతో జగతి అంటుంది. రెస్టారెంట్‌కు వెళ్లాలి మేడం.. నేను తరువాత వస్తాను..మీరు వెళ్లండని జగతితో వసు అంటుంది.

    ప్రపంచంలో ఎనిమిదో వింత కాకపోతే.. రిషి, జగతి ఒకే కారులో రావడం ఏంటో.. పుత్ర రత్నం అర్థం కాడు.. ఇక్కడ నేనే ఇలా ఉంటే..అక్కడ జగతి గాల్లో తేలిపోతోంది.. నువ్ నీ మనసులో మాట ఎప్పుడు చెబుతావ్ రా.. జగతి కారులో నువ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చావ్.. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి రా అని ఇలా పలు విధాలుగా రిషి గురించి ఆలోచిస్తుంటాడు మహేంద్ర..

    ఏంటి అలా చూస్తున్నారు.. అని రిషి అడుగుతాడు. ఎప్పుడూ ఒకేలా ఎందుకని ఇలా చూశాను.. అని కౌంటర్ వేస్తాడు మహేంద్ర. నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నారా? అని రిషి ఓపెన్ అవుతాడు. అలా ఎలా అనిపించింది అని మహేంద్ర అంటే.. మీ మొహం చూస్తేనే అర్థమవుతోంది అని రిషి అంటే.. అవునా అయితే ఓ రెండు ప్రశ్నలు ఏంటో చెప్పు అని మహేంద్ర రివర్స్ కౌంటర్ వేస్తాడు. ఏంటి నాకే పరీక్ష పెడుతున్నారా? అని రిషి అంటాడు.

    ఫ్యాకల్టీ హెడ్ మేడం కారులో ఎందుకు వచ్చాడు.. వసుకు కొత్త అపాయింట్‌మెంట్ ఎందుకు ఇచ్చాడు.. అని ఆలోచిస్తున్నారు కదా? అని రిషి అంటే.. అలా కాదు కానీ ఇంచు మించు అవే అని మహేంద్ర అంటాడు. ఇందులో నాకు వ్యక్తిగత ఆసక్తి లేదు.. అలా జరిగిపోయాయి అంతే అని రిషి కవర్ చేస్తాడు.. ఓ గుడ్.. నాకు నీ మీద అభిమానమే కానీ అనుమానం ఉండదు.. కాకపోతే అప్పుడప్పుడు అర్థం కావు.. అంతే అని మహేంద్ర అంటాడు..

    అర్థం కాకపోవడం ఏముండదు.. మీ అంచనాలు తప్పేసరికి రిషి అర్థం కాడు అని అనుకుంటారు అని రిషి తెలివిగా సమాధానం చెబుతాడు.. చాలా బాగా అర్థమైంది.. నువ్ ఎప్పుడూ అర్థం కావని అంటూ తన కొడుకు గురించి మహేంద్ర అంటాడు.. ఇళ్లు వచ్చే సిరికి దిగండి డాడీ.. అంటాడు రిషి. దిగండి ఏంటినువ్ రావా? అని అడుగుతాడు. నాకు కాలేజ్‌లో కొంచెం పని ఉంది.. అక్కడే గెస్ట్ హౌజ్‌లో ఉంటాను.. పెద్దమ్మకు చెప్పండి.. అని రిషి అంటాడు. నువ్వెంటో నాకే కాదు.. నీకే అర్థం కావు.. ఒక్కడివే వెళ్తావ్ బాధపడతావ్.. అంతేనా? అని మహేంద్ర అనుకుంటాడు.

    కాలేజ్‌లో బాస్కెట్ బాల్ ఆడుతూ.. ఏమైంది నా కాన్సన్‌ట్రేషన్.. మిస్ అయిందా.. కాలేజ్ లేకపోయినా వచ్చి ఒంటరిగా గడపడానికి కారణం ఏంటి? ఈ టైంలో వసుధార ఎందుకు గుర్తొస్తుంది. ఎందుకు అంత ప్రభావితం చేస్తోంది.. అని వసు గురించి ఆలోచిస్తాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో వసు కూడా రాత్రి కాలేజ్‌కు వస్తుంది. ఇద్దరూ కలిసి బాస్కెట్ బాల్ ఆడతారు. అక్కడే వసు కాలి పట్టీ కిందపడిపోతుంది. ఉదయాన్నే తీసుకొచ్చి ఇస్తాడు. అర్ధరాత్రి ఒంటరిగా తిరగొద్దని మీరు చెప్పరా? అంటూ జగతికి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు రిషి.

    Leave a Reply