- November 26, 2021
Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. నాకు వసుధార కావాలి!.. రిషి మాటలకు జగతి షాక్

Guppedantha Manasu గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ అంటే శుక్రవారం నాడు మంచి సీన్ పడింది. తల్లి మనసు ఉప్పొంగిపోయే సన్నివేశం జరిగింది. Guppedantha Manasu Episode 305లో జగతి తన కొడుకు రిషిని చూసి తెగ మురిసిపోయింది. కారులో తన కొడుకుని ఎక్కించుకుని ప్రయాణించింది. జగతి ఆనందంలో తేలిపోతోంటే.. రిషి మాత్రం కాస్త ఇబ్బంది పడ్డట్టు కనిపిస్తుంది. ఎపిసోడ్ ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం.
మహేంద్ర, రిషి, రిషి పెదనాన్న అందరూ కలిసి ఎగ్జామ్స్, ఆ తరువాత చేయబోయే విధివిధానాల గురించి మాట్లాడుకున్నారు. ఎగ్జామ్స్ తరువాత ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని అంటారు. అదే సమయంలో మహేంద్రకు వసుధార నుంచి ఫోన్ వస్తుంది. దీంతో కంగారుపడిన మహేంద్ర బయటకు వచ్చి మాట్లాడతాడు. సర్ ఈ రోజు మనం కలవాలి అని వసుధార అంటుంది. ఎగ్జాట్లీ నేను కూడా అదే అనుకున్నాను.. సాయంత్రం రెస్టారెంట్‌కు రండి అని వసు అంటే.. జగతిని పిలవకు.. అని మహేంద్ర అంటాడు.
మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు మహేంద్ర.. వెనక్కి తిరిగి చూడటంతోనే రిషి ఉంటాడు. దీంతో మహేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి రిషి? అని మహేంద్ర అంటాడు.. వసుధారతో కూడా పక్కకు వచ్చి మాట్లాడాలా? అని రిషి అంటే.. అన్నయ్య ఉన్నాడు కదా? మాట్లాడితే బాగుండదు అని మహేంద్ర కవర్ చేస్తాడు.. మాట్లాడాల్సింది అని ఏదో అన్నారు.. నాకు అర్థం కాలేదు అని రిషి అంటాడు.. హమ్మయ్య వినలేదనుకుని ఏదో కాకమ్మ కబుర్లు చెప్పేస్తాడు… స్ఫూర్తి, బలం నింపాలి కదా? అని మహేంద్ర ఏదేదో చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. మీరు అడిగినా చెప్పరు.. నాకు తెలుసు.. అయినా నేను వదలుతానా? కచ్చితంగా తెలుసుకుంటాను డాడ్ అని రిషి అంటాడు.
ఇక అక్కడ సీన్ ఓపెన్ చేస్తే చివరి ఎగ్జామ్ కదా? అనే హడావిడిలో అందరూ ఉంటారు. పుష్ప, వసుల హాలీడే గురించి మాట్లాడుకుంటారు. రెస్టారెంట్‌కు వెళ్లాలని వసు అంటుంది. నువ్ మాత్రం ఏదో ఒకటి నేర్చుకో అని పుష్పకు వసు సలహా ఇస్తుంది. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాక.. ఎలా రాశావ్ పుష్ప అని వసు అంటుంది. పర్లేదు ఓ మాదిరిగా రాశాను అని పుష్ప బదులిస్తుంది. మరి నన్ను ఎలా రాశావ్ అని అడగవా? అంటూ పుష్పను వసు అడుగుతుంది. నువ్ ఎలాగూ టాపర్ బాగానే రాస్తావ్ కదా? అని అంటుంది.
ఇంతలో మహేంద్ర నుంచి వసుకు ఫోన్ వస్తుంది. రెస్టారెంట్‌కు దగ్గర్లోనే ఉన్నాను వచ్చేయ్ అని చెబుతాడు. దీంతో రిషిని కలవకుండా, చెప్పకుండానే వసు వెళ్లిపోతుంది. వసు కోసం రిషి ఎదురుచూస్తుంటాడు. వసు వెళ్లిపోయిందని తెలియడంతో ఫైర్ అవుతాడు. జగతి మేడం.. మనం వసుధార దగ్గరికి వెళ్లాలి.. రెస్టారెంట్‌కు వెళ్దాం.. మీరు మీ కారులో రండి..నేను నా కారులో వస్తాను అని అంటాడు.
కానీ రిషి కారును పెదనాన్న తీసుకెళ్తాడు. దీంతో రిషి క్యాబ్‌లో వెళ్లేందుకు సిద్దపడతాడు. కానీ జగతి మాత్రం పదే పదే తన కారులో రమ్మని అంటుంది. ఎందుకు పదే పదే అడుగుతున్నారు.. దీన్ని ఓ టాపిక్‌లా ఎందుకు చేస్తున్నారు అని రిషి అంటాడు. దీంతో రిషి వీక్ నెస్ మీద దెబ్బ కొట్టేసింది జగతి. మా ఎండీ గారు క్యాబ్‌లో వెళ్తుంటే.. నేను కారులో వెళ్లడం బాగుండదు కదా? అని అంటుంది.
ఆ డైలాగ్‌తో రిషి కాస్త తగ్గుతాడు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడను అని అంటే.. కారులో వస్తాను అని చెబుతాడు. వ్యక్తిగతాలు చేదుగతాలు.. తలుచుకోకుండా ఉండలేను.. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను.. అని జగతి మాటివ్వడంతో రిషి కారు ఎక్కుతాడు. డ్రైవ్ చేస్తాను అని రిషి అంటాడు. నేనే డ్రైవ్ చేస్తాను జగతి అంటుంది. దీంతో కారులో ఇద్దరూ ప్రయాణం చేస్తారు.
కారు డ్రైవ్ చేస్తూ రోడ్డు చూడకుండా.. రిషినే చూస్తుంటుంది జగతి. ఈ రోజు నాకు అందమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది.. రిషి నా కారులో కూర్చోబెట్టుకోవడం, నేను కారును డ్రైవ్ చేయడం.. నాకు నిజంగానే అందమైన జ్ఞాపకం.. ఈ రోజు నిజంగానే నాకు గుర్తుండిపోయే రోజు.. నా రిషిని నా కారులో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేస్తాను అని అనుకోలేదు అంటూ జగతి తనలో తాను మురిసిపోతుంది.
ఇక జగతి పదే పదే చూస్తుండటంతో రిషి ఇబ్బంది పడతాడు. అనవసరంగా కూర్చున్నానా? అని లోలోపల అనుకుంటాడు… మ్యూజిక్ పెట్టమంటారా? సర్ అని అడిగితే వద్దు మేడం అంటాడు.. పదే పదే తననే చూస్తుండటంతో మేడం ముందుకు చూసి డ్రైవింగ్ చేయండి అని జగతికి సూచిస్తాడు.. ఇది నా కారు సర్.. నేను చెప్పినట్టే వింటుంది.. అని అంటుంది. వాటర్ తాగుతారా? సర్ అని బాటిల్ తీసి ఇస్తుంది.
ఆ రోజూ తాగుతాను మేడం అని రిషి కౌంటర్ వేస్తాడు.. ఇప్పుడు తాగుతారా? అని అడుగుతున్నాను సర్ అని జగతి అంటుంది.. మేడం ప్లీజ్ కొంచెం ముందుకు చూసి డ్రైవ్ చేయండి అని మళ్లీ చెబుతాడు. సరే సర్ అని జగతి అంటుంది. ఇక జగతి వినకపోవడంతో కారు ఆపండని దిగుతాడు. నేను డ్రైవింగ్ చేస్తాను అని చెబుతాడు. దీంతో జగతి దిగుతుంది. కారును రిషి డ్రైవ్ చేస్తాడు.
వెనకాల కూర్చోమని అంటాడు రిషి. నేను వెనకాల కూర్చుని, మీరు ముందు డ్రైవింగ్ చేస్తుంటే బాగొదు సర్ అని చెప్పేసరికి ఏమీ మాట్లాడడు. అలా జగతి ముందు కూర్చుని తన కొడుకును తనివి తీరా చూసుకుంటుంది. భవిష్యత్ ఏమనుకుంటున్నారు? అని అడుగుతాడు. దీంతో జగతి వెంటనే షాక్ అవుతుంది. అదే వసుధార భవిష్యత్తు గురించి అని అంటాడు రిషి.. వసు భవిష్యతు గురించి అనుకోవడానికి నేను ఎవరినీ.. తన జీవితం తన ఇష్టం.. తన లక్ష్యసాధనలో ఏమైనా సాయం చేయగలిగితే చేస్తాను..అని జగతి అంటుంది. దీంతో వెంటనే రిషి.. నాకు వసుధార కావాలి మేడం..అని అంటాడు. ఆ మాటలకు జగతి షాక్ అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఆ మాటలను రిషి ఎలా మార్చుతాడో చూడాలి. మిషన్ ఎడ్యుకేషన్ గురించి కావాలని అంటాడేమో.