• November 25, 2021

Guppedantha Manasu : గుప్పెడంత సీరియల్ నేటి ఎపిసోడ్.. మిర్చీ బజ్జీ పురాణం.. జాలీగా వసు, రిషి

Guppedantha Manasu : గుప్పెడంత సీరియల్ నేటి ఎపిసోడ్.. మిర్చీ బజ్జీ పురాణం.. జాలీగా వసు, రిషి

    Guppedantha Manasu గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పుడు జాలీగా సాగుతోంది. రిషికి ఎలాంటి అనుమానాలు లేవు. వసుతో రిషి మునుపటిలానే ఉంటున్నాడు. దీంతో వసు ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. గురువారం నాటి ఎపిసోడ్ మొత్తం కూడా మిర్చీ బజ్జిల చుట్టే తిరిగింది. స్ట్రీట్ ఫుడ్, మిర్చీ బజ్జీలంటే వసుకు ఎంత ఇష్టమో రిషికి తెలిసింది. చివరకు రిషి చేత కూడా వాటిని తినిపించింది. గురువారం నాడు అంటే Guppedantha Manasu 304 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    మిర్చీ బజ్జీల వాసన వస్తోందని కారును ఆపమంటుంది. ఇంటికెళ్లి వదిన చేత చేయించుకుని తిందామని రిషి అంటాడు. అలా తింటే మజా ఉండదు. ఇక్కడే తినాలి అంటూ.. మిర్చీ బజ్జీలపై తనకున్న ఇష్టాన్ని వసు చెబుతుంది. నా దగ్గర ఆస్తులేమీ లేవు కానీ.. మిర్చి బజ్జీల కోసం ఆస్తులు అయినా రాసిస్తాను అని వసు రెచ్చిపోతుంది. అయితే మిర్చీ బజ్జీలు తినాలంటే మాత్రం ఓ కండీషన్ పెడతాడు రిషి.

    ఎలాంటి కండీషన్లకైనా ఒప్పుకుంటాను.. మిర్చీ బజ్జీల కోసం ఎలాంటి కండీషన్లకైనా సరే అంట రిషితో వసు చెబుతుంది. అప్పుడు చేసినట్టుగా,చెప్పినట్టుగా మొక్కజొన్నలు కాల్చిననట్టు మిర్చీ బజ్జీలు వేయకూడదు, వాటి పుట్టుపూర్వొత్తరాలు చెప్పొద్దు అని నాటి సంగతులను గుర్తు చేస్తాడు రిషి.. అప్పుడెప్పుడో తిన్న మొక్కజొన్న పొత్తులు గుర్తున్నాయంటే వాటిని గొప్పగా కాల్చాను అన్నట్టే కదా? అంటే మొక్కజొన్న పొత్తులు, నా గొప్పదనం గుర్తుందనే కదా? అని వసు ఇంకో లాజిక్ తీస్తుంది.

    సరే పదా వెళ్దామని రిషి అంటాడు. ఇక మిర్చీ బజ్జీ బండి దగ్గర వసు కాస్త ఓవర్ చేస్తుంది. అలా కాల్చు ఇలా కాల్చు అంటూ బొమ్మరిల్లు హాసిని టైపులో ఎక్కువ చేసింది. ఇక రిషి అలా రోడ్డు మీద తినలేక కారులోకి వెళ్లి తిందామా? అని అడుగుతాడు. మిర్చీ బజ్జీలను మిర్చి బండి వద్దే తినాలని అంటుంది.. అప్పుడే ఫీల్ ఉంటుంది.. మీరు ఏం చెబితే అది వింటాను కానీ.. మిర్చీ బజ్జీల విషయంలో మాత్రం నేను చెప్పిందే వినాలని వసు అంటుంది.

    వేడి వేడి ఉన్నా కూడా వసు తింటుంది. అంత వేడిగా ఉంటే.. కాలుతూ ఉంటే ఎందుకు తినడం అని రిషి అంటాడు. అలా కాలుతుండగా తింటేనే మజా ఉంటుంది.. తినండి తినండి.. అని వసు ఓవర్ చేస్తుంది. మన రిషికి మిర్చీ బజ్జీలోంచి మిర్చీని తినకుండా పైపైన తింటాడు. అలా తింటే మిర్చీ బజ్జీ మిమ్మల్ని క్షమించదు అని వసు అంటుంది. మరి కారంగా ఉంటుంది కదా? అని రిషి అంటాడు..

    దీంట్లో అవసరం మేరకే కారం ఉంటుంది.. గింజలు తీసేస్తారు.. అన్నీ వేసి మిర్చీని అందంగా ముస్తాబు చేస్తారు.. అని మిర్చీ పుట్టిపూర్వొత్తరాలు చెప్పడం ప్రారంభించింది వసు. ఇందాకే చెప్పాను.. పుట్టుపూర్వొత్తరాలు, జన్మ ఇతివృత్తాన్ని చెప్పొద్దని అన్నాను కదా? అని రిషి అంటాడు. నేను క్లాసులో పాఠాలు చెబుతి.. ఇక్కడ నువ్ రుచుల గురించి చెబుతున్నావా? చెల్లుకు చెల్లు అని అంటావా? అని రిషి అడుగుతాడు.. కొన్ని ఎప్పటికీ చెల్లిపోకుండా ఉంటేనే బాగుంటుంది సర్ అని వసు లోలోపల అనుకుంటుంది.

    ఏంటి ఏమన్నావ్ అని రిషి అడిగితే.. ఏం లేదు సర్ అని అంటుంది వసు. నేను బిల్ కట్టమంటారా? సర్ అని వసు అంటే.. ఏంటి హుషారుగా ఉన్నావ్ మిర్చి బజ్జీలకు కాదు.. పెద్ద రెస్టారెంట్‌కు వెళ్దాం.. అప్పుడు బిల్ కట్టేద్దువులే.. అని రిషి అంటాడు. ఎలా ఉన్నాయ్ సర్.. మిర్చీ బజ్జీలు అని వసు అడిగితే.. బాగానే ఉన్నాయ్ అని రిషి సమాధానం చెబుతాడు..

    ఇప్పుడు ఇంకొక కండీషన్.. మిర్చీ బజ్జీ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం అని రిషి అంటాడు.. ఇలా టైం వేస్ట్ చేస్తే.. రేపు ఎగ్జామ్ ఎలా రాస్తావ్? అని వసుని ప్రశ్నిస్తాడు..రేపు ఏ పేపర్ అనుకుంటున్నారు.. మా ఎండీగారు చెప్పే సబ్జెక్ట్.. ఆయన ఒక్కసారి లెసన్ చెబితే చదవాల్సిన పనే లేదు.. మా ఎండీగారు బాగా చెబుతారు అని వసు అంటుంది.ఒకటి అడగనా? వసు అని రిషి అంటాడు.

    వంద అడగండి.. మిర్చీ బజ్జీ తిన్నాను కదా?.. ఎన్నైనా చెబుతాను అని వసు అంటుంది. ఇందాకే చెప్పాను కదా? మిర్చి బజ్జీల టాపిక్ తీయోద్దు అని రిషి అంటాడు. సారీ సర్.. అడగండి అని వసు అంటుంది.. ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఎలా ఉంటావ్? అని రిషి అడుగుతాడు.. అలా అలవాటు అయిపోయింది.. మధ్య తరగతి వాళ్లు.. చిన్న చిన్న సంతోషాలకే మురిసిపోతోంటారు.. డబ్బులు పెట్టి వస్తువులు కొనుక్కోగలరు కానీ సంతోషాన్ని కొనుక్కోలేం.. సమస్యలను దాటుకుని వెళ్లడమే జీవితం.. కొంచెం ఎక్కువ చెప్పానా? సర్ అని వసు అంటే.. కొంచెం ఎక్కువే.. కానీ బాగానే చెప్పావ్..అని కాంప్లిమెంట్ ఇస్తాడు.

    ఇక వసుని డ్రాప్ చేస్తాడు రిషి. లోపలకు రావొచ్చు కదా? సర్ అని అడుగుతుంది. నువ్ పిలిచినా రాను అని తెలుసు.. కానీ అయినా అడుగుతావ్.. ఏంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు.. వెంటనే మూడ్ చేంజ్ అని అనుకుంటున్నావా? నేను ఒప్పుడూ ఒకేలా ఉంటాను. కానీ నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు.. నేను కొన్ని నమ్ముతాను.. వాటినే ఫాలో అవుతాను అని రిషి అంటాడు.. నీ విషయంలోనే శిరీష్‌కు నీకు పెళ్లి అని తప్పుగా అనుకున్నాను.. నీలాంటి స్టూడెంట్లపై నాకు ఎప్పుడూ వ్యాల్యూ ఉంటుంది అని రిషి లోలోపల అనుకుంటాడు..

    వసుని రిషి డ్రాప్ చేయడం జగతి చూస్తుంది. లోపలకి పిలవలేదా? అని జగతి అడుగుతుంది. మనం పిలిస్తే వస్తారా? ఆయనకు రావాలని అనిపిస్తేనే వస్తారు.. అంచనాలకు అందినట్టే అనిపిస్తారు.. కానీ అందరు అని వసు అంటుంది.. నిజమే రిషి ఎవ్వరి అంచనాలకు అందడు.. అందుకే నాకు కూడా అందనంత దూరమయ్యాడు..అని జగతి బాధపడుతుంది.

    శిరీష్ విషయంలో నిన్ను నేను ఎంత బాధపెట్టానో.. నువ్ ఎంత బాధపడ్డావో.. నీకంటే ఎక్కువ నేను బాధపడ్డాను.. అది నీకు తెలీదు. ఆ విషయం కూడా నీకు తెలిసే అవకాశం కూడా లేదు.. అని కారులో వెళ్తున్న రిషి అనుకుంటాడు. ఇక ఉదయం మహేంద్ర, ధర్మేంద్ర భూషణ్ మాట్లాడుకుంటారు. రిషి ఇంకా లేవలేదా? ధరణి అని అడుగుతారు. రాత్రి కాస్త ఆలస్యంగా పడుకున్నట్టున్నాడు.. అందుకే లేపలేదు మావయ్య గారు అని ధరణి అంటుంది. మంచి పని చేశావ్ అని ధరణిని మెచ్చుకుంటారు.

    లేట్ ఎందుకు అయిందని అడిగే వయసు కాదు.. ఎక్కడికి వెళ్లావ్ అని అడిగితే పద్దతి కాదు.. నువ్ మీ అత్తలా అడక్కమ్మ.. కొంతమందిని చూస్తే ఎదుటి వాళ్లతో ఎలా ఉండాలని తెలుస్తోంది.. ఇంకొంతమందిని చూస్తే ఎదుటి వాళ్లతో ఎలా ఉండకూడదో తెలుస్తుంది..కానీ మీ అత్తయ్యను చూస్తే.. ఎదుటి వాళ్లను ఎలా ఇబ్బంది పెట్టకూడదో నేర్చుకో అమ్మా.. ఎవరికి ఇవ్వాల్సిన స్వాతంత్ర్యం వారికి ఇవ్వాలి అని ధర్మేంద్ర అంటాడు. నిజం చెప్పారు అన్నయ్య అని మహేంద్ర అంటాడు.. ఎవరికి పెదనాన్న స్వతంత్ర్యం ఇవ్వాలి అని అంటున్నారు అంటూ రిషి ఎంట్రీ ఇస్తాడు.. నీకే నాన్న అని ధర్మేంద్ర అంటాడు. అలా మొత్తానికి ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో అందరూ ఆశ్చర్యపోయేలాంటి సీన్ జరగబోతోంది. మొదటిసారిగా తల్లీకొడుకులు కలిసి ఒకే కారులో వస్తారు. అలా జగతి, రిషిని చూసి వసు, మహేంద్రలు షాక్ అవుతారు.

    Leave a Reply