- November 23, 2021
Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. మళ్లీ పట్టాలెక్కిన రిషి వసు ట్రాక్.. జగతి అలా మహేంద్ర ఇలా

గుప్పెడంత మనసు సీరియల్లో ఓ చిక్కు ముడి వీడింది. గత కొన్ని రోజులుగా అదే పాయింట్ మీద తిప్పితిప్పి నడిపించారు. శిరీష్ వసు పెళ్లి అనే భ్రమలో రిషి బతికాడు. ఆ భ్రమలోనే ఉంటూ తనను తాను బాధపెట్టుకుంటూ వసును బాధపెడుతూ వచ్చాడు. మొత్తానికి ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు దూరం తగ్గింది. వసు మీద రిషికి ఇంకాస్త ప్రేమ పెరిగినట్టు కనిపిస్తోంది. అందుకే తనకు ఇష్టలేని జగతి మేడం ఇంటికి వెళ్లి మరీ భోజనం చేసి వచ్చాడు. ఇదే విషయాన్ని రిషి తరువాత మథనం చేసుకున్నాడు
గుప్పెడంత మనసు సీరియల్లో నేటి ఎపిసోడ్ అంటే మంగళ వారంలో ఏం జరుగుతుందో ఓ సారి చూద్దాం. మహేంద్ర, జగతిలు కార్లో వెళ్తుంటారు. కొడుకు మీద ప్రేమను జగతి చూపిస్తుంది. రిషి చిన్న పిల్లాడేం కాదు. ఎక్కడికి వెళ్లాడు..ఏం చేస్తున్నాడు అని ఎందుకు ఆలోచిస్తారు. ఆరా తీస్తారు అన్నట్టుగా మహేంద్రకు చురకలు అంటించింది జగతి. ప్రేమతో ఆరా తీస్తున్నాను అని అనుకోవచ్చు కదా? అని మహేంద్ర అంటే.. నువ్ ఏ రకంగా ఆలోచిస్తావో నాకు తెలీదా? అని కౌంటర్ వేస్తుంది జగతి. టాపిక్ డైవర్ట్ చేసే పనిలో భాగంగా.. కాఫీ తాగుదామా అని అంటాడు. ఇంట్లో వసు ఒంటరిగా ఉంటుంది వెళ్దాం. అక్కడ ఎలాగూ కాఫీ అడుగుతావ్ కదా? అని జగతి అంటుంది.
ఇక ఇంట్లో రిషి, వసులు మాట్లాడుకుంటూ ఉంటారు. మంచి భోజనం పెట్టినందుకు థ్యాంక్స్ అని రిషి అంటాడు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి.. జగతి మేడం ఇంట్లో మీరు తిన్నారు అని గుర్తు చేస్తుంది వసు. దీంతో ఆలోచనల్లో పడ్డాడు రిషి. అవును కదా? నేను ఇక్కడ ఎందుకు తిన్నాను అంటూ వెళ్లిపోతాడు రిషి. ఐస్ క్రీం తిని వెళ్లమని అన్నా కూడా వినిపించుకోడు. అలా ఎందుకు కోపం వచ్చిందో.. ఎందుకు వెళ్లిపోయాడో అని రిషి గురించి వసు అనుకుంటుంది.
ఇక రిషి ఆలోచనల్లో పడతాడు. అవును కదా? నేను ఏంటి జగతి మేడం ఇంటికి వెళ్లి.. ఆకలి అంటూ.. భోజనం తినడం, వసు కోసం వెళ్తే ఇంత చేయాలి? ఆకలి వేస్తే అంత మరిచిపోయానా? అని ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు వేసుకుంటాడు రిషి. ఇక ఇంట్లో జగతి, మహేంద్ర, వసులు ఉంటారు. నాకు ఓ కాఫీ పెట్టు అని మహేంద్ర అంటాడు. కాఫీ పెట్టేందుకు వెళ్తున్న సమయంలోనే డైనింగ్ టేబుల్ మీద రెండు ప్లేట్లు కనిపిస్తాయ్.ద దీంతో అదేంటి? అని వసుని మందలిస్తుంది జగతి.
చెప్పడం మరిచిపోయాను మేడం.. రిషి సర్ వచ్చారు.. ఆకలి అవుతుందని అడిగి మరీ తిన్నారు అని చెప్పడంతో జగతి ఆశ్చర్యపోతుంది. నువ్వే ఓ గెస్టువి.. నీకు ఇంకో గెస్టా? అలా వచ్చినప్పుడు నాకు చెప్పాలనే కనీసం మర్యాద తెలియదా? అంటూ వసు మీద ఫైర్ అయింది. వచ్చింది రిషి సరే కదా? మేడం అని వసు అంటుంది. అయితే ఏంటి నాకు కనీసం చెప్పాలని తెలియదా? అని కోప్పడింది. భోజనం కాబట్టి ఇంత కంటే ఏం చెప్పలేకపోతోన్నాను ఇంకోసారి నాకు చెప్పు.. ఇలాంటివి చేయోద్దు అని వసు మీద ఫైర్ అవుతుంది
అయితే ఇదంతా కోపం కాదని ఇట్టే తెలిసిపోతోంది. నా కొడుకు నా ఇంటికి వచ్చి భోజనం చేశాడా? నాకు ఆ విషయం చెప్పదా? చెబితే నేను వచ్చి కళ్లారా చూసుకునే దాన్ని కదా? అయినా నా కొడుక్కి వండిపెట్టే అదృష్టం వసుకు వచ్చింది.. వసు బాగా భయపడ్డట్టుంది.. ఏం కాదు.. అలా భయపడితేనే ఇంకోసారి చెబుతుంది. ఆ మాత్రం భయం ఉండాలి అని వసు, రిషి గురించి తలుచుకుంటుంది జగతి. మేడం ఏంటి ఇలా అన్నారు సంతోష పడుతుందని అనుకుంటే ఇలా రివర్స్ అయిందేంటి అని వసు ఆలోచనల్లో పడుతుంది.
ఇదే విషయాన్ని మహేంద్రకు కూడా చెబుతుంది. రిషి సర్ వచ్చారు.. ఆకలి అన్నారు. లంచ్ చేశారు.. కానీ మేడం మాత్రం ఇలా తిడుతోంది అని వసు చెప్పింది. రిషి వచ్చాడా? లంచ్ చేశాడా? నేను నమ్మలేకపోతోన్నాను అని మహేంద్ర ఆశ్చర్యపోతాడు. వెరీ గుడ్.. చూస్తుంటే మనకు అనుకూల పవనాలే వీస్తున్నట్టు కనిపిస్తోంది అని మహేంద్ర లోలోపల అనుకుంటాడు.
ఇక ఇంట్లో దేవయాణి తన భర్తతో చిర్రుబుర్రులాడుతుంది. పనిలో పడి తినడం లేదు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అని దేవయాణి అంటుంది. అలా భార్యాభర్తలు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే.. రిషి కూడా వస్తాడు. కాలేజ్‌లో కనిపించలేదు ఎక్కడికి వెళ్లావ్ రిషి అనడంతో.. గెస్ట్ హౌజ్‌లోనే ఉన్నాను అని అంటాడు.నేను గెస్ట్ హౌజ్‌కు వచ్చాను అని ధర్మేంద్ర భూషణ్ అంటాడు. మీరు వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉన్నానో.. మీరు ఎక్కడ ఉన్నారో కదా? పెదనాన్న అని రిషి అంటాడు. అవును అది కూడా నిజమే అని అంటాడు.
నువ్ ఎక్కువగా పని చేయకు, అందరితో పని చేయించు నాన్న అంటూ రిషికి దేవయాణి చెబుతుంది. ఒత్తిడి భారం పెంచుకోకు..అని దేవయాణి అంటుంది. ఏం చెప్పాలని అనుకుంటున్నారో నాకు అర్థమైంది నేను చూసుకుంటాను పెద్దమ్మ అని రిషి వెళ్లిపోతాడు.. బయటకు నన్ను గౌరవిస్తున్నట్టు అనిపిస్తుంది..కానీ అబద్దాలు చెబుతున్నాడు. ఎక్కడి వరకు వెళ్తాడో చూద్దాం.. దీనంతటికి కారణం నువ్వే కదా? జగతి అంటూ దేవయాణి తన మనసులో అనుకుంటుంది.
ఆ తరువాత సీన్ జగతి మీద ఓపెన్ అవుతుంది. చదువుకుంటున్న వసును చూస్తూ.. మనసులో జగతి ఇలా అనుకుంటుంది. ‘నా రిషి నా ఇంటికి వచ్చి భోజనం చేశాడు.. కష్టాల్లో నేను వసుకు చేసిన సాయం..మా జీవితాల్లో ఎన్ని మలుపులు తిప్పుతోంది.. రిషిని మళ్లీ చూడలేను అని అనుకున్నాను.. కానీ రోజూ చూసుకోగలుగతున్నాను.. థ్యాంక్యూ వసు’ అని అనుకుంటుంది.. జగతిని చూసిన వసు తన మనసులో ఇలా అనుకుంటుంది. ‘సారీ మేడం.. మహేంద్ర సార్‌కు ఇచ్చిన మాట, గురుదక్షిణ ప్రకారం మిమ్మల్ని, రిషి సర్ని కలపలేకపోతోన్నాను.. ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను’ అని అనుకుంటుంది.. వసు త్వరగా నిద్రపో అని జగతి మేడం అంటుంది.. సరే మేడం అని వసు అంటుంది
ధరణితో మహేంద్ర ఇలా మాట్లాడుతాడు. మా యువరాజు మేల్కొనే ఉన్నాడా? అని మహేంద్ర అంటాడు. ఏమో మామయ్య.. నిద్రపోయి ఉండడు అని ధరణి అంటుంది. నిద్రపోతే ఏంటంట.. నిద్ర లేపేస్తా అని మహేంద్ర అంటాడు. మీరు అలా అంటారు కానీ రిషిని మీరు నిద్ర లేపుతారా? అని ధరణి అంటుంది. దాన్నే కడుపు తీపి అంటారేమో.. చాలా విషయాలు గట్టిగా చెప్పాలని అనుకుంటున్నాను.. కానీ మొహం చూసి ఆగిపోతాను.. చెప్పాలనుకున్న విషయం తప్పా.. అన్నీ చెబుతున్నాను అని మహేంద్ర అంటాడు.. రిషి చెబితే వినడు మామయ్య అని ధరణి అంటుంది.
అత్తయ్య గారు కూడా రిషి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు.. రకరకాలుగా విషం కక్కుతోంది అని జరిగిన విషయమంతా చెబుతుంది. ఫోన్ చేసి కనుక్కోవడం గురించి వివరిస్తుంది.. తల్లీ కొడుకులను విడగొట్టింది. ఏ చిన్న విషయం వచ్చినా కూడా వదిలి పెట్టడం లేదు.. ఓపిక పడుతున్నాను ధరణి.. వదిన ఏం జరగొద్దని భయపడుతుందో.. అదే జరిగే రోజు వస్తుందని అనుకుంటున్నాను అని మహేంద్ర అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక బుధవారం నాటి ఎపిసోడ్లో వసుకు రిషి గిఫ్ట్ ఇస్తాడు. ఎగ్జామ్స్ కదా? అని ఓ పెన్ ఇస్తాడు. అలా ఈ ఇద్దరిని చూస్తే ట్రాక్ మళ్లీ పట్టాలెక్కేసినట్టు కనిపిస్తోంది.