• November 22, 2021

Guppedantha Manasu Episode 301 : ఇంట్లో ఏకాంతంగా రిషి, వసు.. నువ్వే ఓ గెస్ట్‌వి అంటూ పరువుతీసిన జగతి

Guppedantha Manasu Episode 301 : ఇంట్లో ఏకాంతంగా రిషి, వసు.. నువ్వే ఓ గెస్ట్‌వి అంటూ పరువుతీసిన జగతి

    గుప్పెడంత మనసు గత వారం అంతా ఓ గందరగోళంతో జరిగింది. శిరీష్ వసులు పెళ్లి చేసుకుంటున్నారనే భ్రమలో రిషి ఉన్నాడు. కానీ అవి తొలగిపోయాయి. వసు పెళ్లి చేసుకోవడం లేదని రిషికి అర్థమైంది. దీంతో మునుపటి రిషిలా మారిపోయాడు. వసుతో చాలా బాగుంటాడు. అయితే శనివారం నాటి ఎపిసోడ్‌లో వసు దగ్గరకు రిషి వచ్చాడు. అదే సమయంలో ధరణి ఫోన్ నుంచి దేవయాణి ఫోన్ చేస్తుంటుంది. అక్కడితో గత వారం ముగిసింది. సోమవారం నాడు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    వంటగదిలో రిషి, వసులుంటారు. ఎగ్జామ్స్‌లో కొన్ని లెక్కలు ప్రతీసారి వస్తూనే ఉంటాయ్.. వాటిని ఎక్కువగా చూడాలి.. క్లాసుల అందరికీ ఆ లిస్ట్ ఇద్దామని వసుతో రిషి అంటాడు.. అదే సమయంలో వదిన ధరణి నుంచి ఫోన్ వస్తుంది. హలో వదిన చెప్పండి అని రిషి అంటాడు.. నాన్న రిషి నేను పెద్దమ్మని మాట్లాడుతున్నాను అని దేవయాణి అంటే.. ఏంటి పెద్దమ్మ వదిన ఫోన్ చేశారు అని రిషి అంటాడు.. నా ఫోన్‌లో ఛార్జింగ్ లేదు.. ఎక్కడున్నావ్ నాన్న.. హెల్ద్ జాగ్రత్త.. వేళకు తినడం లేదు.. పొద్దున్నే వెళ్లిపోయావ్.. ఏంటి పని.. ఎక్కడున్నావ్.. అని దేవయాణి అడుగుతుంది.

    సర్ కాఫీనా? టీనా?.. అని గట్టిగా అరవడంతో.. రిషి ఎవరు నాన్న.. ఎవరిదో ఏదో వాయిస్ వినిపించింది.. అని దేవయాణి అంటుంది. పెద్దమ్మ నేను మళ్లీ కాల్ చేస్తాను.. అని పెట్టేస్తాడు రిషి. ఎవరిదా గొంతు.. అని దేవయాణి అనుకుంటూ ఉంటే.. కాలేజ్‌లో ఎవరిదో అయి ఉంటుంది.. అని ధరిణి డైవర్ట్ చేసేందుకు ట్రై చేస్తుంది. కాలేజ్ అయితే.. కాఫీ అని ఎందుకు అంటారు..అని దేవయాణి రివర్స్‌లో ప్రశ్నిస్తుంది.

    కాఫీ టీ అని అరుస్తావ్ ఏంటి.. నేను ఏమైనా మీ రెస్టారెంట్‌కు వచ్చానా? నాకు బాగా ఆకలి వేస్తుంది?అని రిషి అడుడుతాడు. చెప్పరేంటి సర్.. క్షణాల్లో మీకు రుచికరమైన అద్భుతమైన వంటలు రుచిచూపిస్తాను..అని వసు అంటుంది. ఆర్డర్ ఇస్తావా? ఏంటి? క్షణాల్లో అన్నావ్ కదా? అందుకే అలా అనిపించింది.. అని రిషి కౌంటర్ వేస్తాడు. ఏం వంటలు అంటే ఇష్టం..అని వసు అంటే ఏం చేసినా ఓకే త్వరగా చేయ్..ఆకలి బాగా వేస్తోందని రిషి అంటాడు.

    ఆ సీన్ తరువాత.. మహేంద్ర, జగతిల మీద సీన్ ఓపెన్ అవుతుంది. ఏంటి ఇంకా రాలేదు అని రిషి గురించి మహేంద్ర అంటాడు. తక్కువ వయసులోనే ఎక్కువ బాధ్యతలు మోస్తున్నాడు.. ఇంత పెద్ద కాలేజ్‌కి ఎండీగా ఉండటం అంటే.. అది మామూలు విషయం కాదు.. ఆ బాధలు తనకే అర్థమవుతాయ్.. అని జగతి అంటాడు. తల్లి మనసు అని మహేంద్ర అంటాడు.. నువ్ కూడా తండ్రిలా ఆలోచించాలి.. తనే వస్తాడు.. పంక్చువాలిటీ, డిసిప్లేన్‌లో నా లానే ఉంటాడు అని జగతి అంటుంది.

    ఆ సమయంలోనే ధరణితో దగ్గరుండి దేవయాణి చేత జగతికి ఫోన్ చేయిస్తుంటుంది. దీంతో దేవయాణికి ఓ క్లారిటీ వచ్చింది. జగతి, రిషి ఒకే దగ్గరు లేరు అని తెలియడంతో కాస్త ఊపిరి తీసుకుంటుంది. నీ ఫోన్ ఎందుకు వాడుతున్నావ్ అనే కదా? ఆలోచిస్తున్నావ్ నీ బుర్ర వాడట్లేదు కదా?. అందుకే ఇలా.. రిషి ఎక్కడున్నాడో తెలియాలి.. అందుకే ఇలా చేశాను.. రిషికి ఫోన్ చేసినప్పుడు కాలేజ్‌కు వెళ్లలేదు.. అంటే జగతితో లేడు.. అంటే నీకు అర్థమైందా? నీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది.. నాకు ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది.. మొత్తం కాలేదు.. అని దేవయాణి తన ధోరణిలో తాను అనుకుంటూ ఉంది. ఇక ధరణి తనలో తాను మాట్లాడుకుంది. మీరు ఎప్పుడైనా నా గురించి ఆలోచించారా? మీ కొడుకు ఎక్కడున్నాడు.. ఎప్పుడొస్తాడు అనేది ఆలోచించారా.. మీరు ప్రశాంతంగా ఉండరు.. ఎదుటి వారు ప్రశాంతంగా ఉంటే చూడరు.. మీరేంటో మీ మనసేంటో.. ఎప్పటికీ అర్థం కాదు.. అని ధరణి బాధపడుతుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావ్ వెళ్లి కూరగాయలు కట్ చేస్కోపో…అని ధరిణి మీద ఫైర్ అవుతుంది దేవయాణి.

    ఆకలి అన్నారు.. ఈ పుస్తకాన్ని పక్కన పెట్టేయండి అని రిషితో వసు అంటుంది.. ఏం తింటారు సర్ అని వసు అడగడడంతో భోజనం చేస్తాను అని రిషి అంటాడు.. నన్ను బతికించారు సర్.. నాకు తెలియని ఇటాలియన్ చైనీస్ వండమని అంటారేమో అనుకున్నాను అని వసు అంటుంది. భోజనం తినాలనిపించింది.. అదే చెప్పాను.. అని రిషి అంటాడు. ఏం కావాలో చెప్పండి.. గొప్పగా కాకపోయినా పర్లేదు బాగానే చేస్తాను.. అని వసు అంటుంది.

    ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావ్ అని వసుని రిషి అడుగుతాడు. భోజనం చేస్తున్నారు కదా? అదే ఆనందం.. ఒకరికి కడుపునిండా వండిపెడితే ఆ ఆనందం వేరు.. వెళ్లి ఒక పేపర్ తెచ్చుకోమంటారా? అని మెనూ చెప్పండి అంటూ వసు అంటుంది. నేను మీ రెస్టారెంట్‌కు రాలేదు.. నా మెనూ అంత పెద్దగా ఏమీ ఉండదు అని రిషి అంటాడు. ముద్దపప్పు, నెయ్యి, పప్పుచారు.. ఆవకాయ్ అప్పడాలు.. పెరుగు ఉప్పు ఇది నా మెనూ ఇది చాలు.. అని రిషి అంటాడు.

    ఇంతేనా?.. ఏంటి సర్ మీరు.. మా గెస్ట్.. మా అతిథి.. మీరు మా ఎండీ గారు.. ఇంత సింపుల్ భోజనం.. చేస్తారా? అని వసు అంటుంది. లంచ్ అంటే డిన్నర్ పెట్టేలా ఉన్నావ్ కదా? అని రిషి సెటైర్ వేస్తాడు.. క్షణాల్లో చేసేద్దాం సర్ అని వసు అంటే.. చేసేద్దామా? నాకు వంటలు రావు.. అని రిషి అంటాడు. నాకు కాస్త హెల్ప్ చేయండి.. అంత సేపు మీతో పని చేయించాలని నాకేం ఆనందం.. వంటచేయడం మానసికంగా ఒత్తిడి లభిస్తుంది.. అని వసు అంటుంది.

    ఉల్లిగడ్డలు కోస్తూ కన్నీరు పెట్టుకుంటాడు రిషి.. పచ్చి మిర్చి కోస్తారా? అని వసు అంటే చేతులు మండుతాయేమోనని రిషి అంటాడు… కారెట్ తినండి అంతలోపు నేను పని చేస్తాను అని వసు అంటుంది. కారెట్ నాకు ఇష్టమని వసు ఏదో చెప్పబోతోంది.. ఇప్పుడు అంత ఓపిక లేదు అని రిషి అంటాడు.. కుక్కర్‌లో పప్పు.. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో రైస్ పెట్టాను.. పప్పు చారు కోసం రెడీ చేస్తున్నారు.. రెండు పప్పు ఐదునిమిషాల్లో రైస్ పది నిమిషాల్లో పప్పు చారు అవుతుంది.. అని వసు అంటుంది

    వసు మాటలను గుర్తు చేసుకుంటూ రిషి గతంలోకి వెళ్తుంది.. ఏడుస్తుంది..నవ్వుతుంది.. అన్ని ఎమోషన్స్.. ఒకేలా స్వీకరిస్తుంది.. సింపుల్‌గా ఉంటుంది.. అప్పుడు వసు వల్లే కిచెన్‌లోకి అడుగుపెట్టాను.. ఇప్పుడు కూడా తన వల్లే వచ్చాను అని వసు గురించి రిషి అనుకుంటాడు.. ముందుగా అన్నం వడ్డించకూడదట.. అందుకే ముందుగా పప్పు వడ్డించాను.. కమ్మటి నెయ్యి.. ఆకాయ్.. అ్పడం.. ఘుమఘుమలాడే పప్పుచారు.. నువ్ కూడా తిను.. మీరు తినండి సర్.. మాట్లాడకుండా వచ్చి తిను.. సర్ మీరు.. ముద్దపప్పు అన్నం.. నెయ్యి, ఆవకాయ్.. ఫైనల్లీ అప్పడం..అంటూ ఒకరికొకరు వడ్డించుకుని తిన్నారు.

    కొత్త రిషి సర్ కనిపిస్తున్నారుఈ రోజు అంటూ వసు మురిసిపోతుంది.. వంటలు కూడా బాగానే చేస్తావన్నమాట అని రిషి కాంప్లిమెంట్ ఇస్తాడు.. వసు చేతికి ఉన్న ఉంగరం రిషి చూస్తాడు. ఓ చిరునవ్వు నవ్వి.. ఈ రింగ్ జగతి మేడం ఇచ్చారు..గిఫ్ట్‌గా అని వసు క్లారిటీ ఇస్తుంది.. మీరు ఎప్పటికి ఇలానే కోపం లేకుండా ఉంటే బాగుంటుంది కదా? మేడం ఇంట్లో ఇలా రిషి సర్ అడిగి మరీ తింటున్నారంటే.. ఎంత సంతోషంగా ఉంటుందో.. అని జగతి మేడం గురించి ఆలోచించింది వసు. ఏంటి అలా చూస్తున్నావ్.. తిను.. అని ఇద్దరూ భోజనం చేసేస్తారు.

    ఇక కారులో జగతి, మహేంద్రలు వస్తుంటారు. నీతో నీ కొడుకుతో మాట్లాడటం కష్టమని మహేంద్ర అంటే.. మధ్యలో రిషిని ఎందుకు అంటావ్..అని జగతి కౌంటర్ వేస్తుంది. ఇంటికి రిషి వచ్చాడు.. లంచ్ చేశారు అని తెలియడంతో జగతి ఫైర్ అవుతుంది. నువ్వే ఓ గెస్టువి.. నువ్ ఒక గెస్టుని ఇంటికి తీసుకొస్తావ్.. వంటలు చేసుకుని తింటారా? నేను ప్లేట్లు చూసి తెలుసుకోవాలా? అంటూ వసు మీద అరిచేస్తుంది జగతి మేడం. ఇంతకీ ఆమె కోపం వెనుకున్న కారణం ఏంటో మరి.

    Leave a Reply