- November 17, 2021
Guppedantha Manasu Episode 297 : మనసులో మాట అడిగేశాడు.. బద్దలైన రిషి.. వసు షాక్

గుప్పెడంత మనసు సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్‌లో అదిరిపోయే సీన్‌లు జరిగాయి. ఇన్నాళ్లు ముసుగులో గుద్దులాటగా ఉన్న విషయాన్ని ఎట్టకేలకు చెప్పేశాడు. ఇన్నాళ్లు రిషి పడుతున్న బాధను, మానసిక సంఘర్షణను బద్దలు కొట్టి చెప్పేశాడు. శిరీష్‌ని పెళ్లి చేసుకుంటున్నాను అని నాతో ఒక్క మాట అయినా చెప్పావా? అంటూ వసుని నిలదీస్తాడు. అలా దెబ్బకు వసు షాక్ అవుతుంది. కళ్లు తిరిగి కిందపడిపోతోంది. బుధవారం అంటే 297వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
నడి రోడ్డు మీద వసు, రిషి వర్షంలో తడుస్తూ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. మీరు మారిపోయారు సర్.. ఎంత కోపం వచ్చినా మరిచిపోయే వారు.. ఆ రిషి సర్ కాదు.. యూత్ ఐకాన్ పోటీలకు రానన్నారు. కానీ వచ్చారు.. ఆ రిషి సర్ కాదు..నాకు జ్వరం వస్తే మేడం మీద అరిచారట..హాస్పిటల్‌కు తీసుకెళ్దామని అన్నారట.. ఆ రిషి సర్ కాదు.. అంటూ పాత విషయాలన్ని వసు బయటకు తీసింది. ఓహో బాగా మాట్లాడుతున్నావ్.. నువ్ మారలేదా?. అంటూ రిషి స్టార్ట్ చేశాడు.
కాలేజ్‌కు వచ్చినప్పుడున్న వసుధారవి కాదు.. చదువే లోకంగా బతికే వసుధారవి కాదు నువ్.. ప్రతీ ఒక్కరి బాధ నీది అని బాధ పడే వసువి కాదు.. సారి అని చెప్పే ఆ వసువి కాదు.. థ్యాంక్స్ రిసీవ్ చేసుకోలేదు..అని కాలేజ్ బిల్డింగ్ మీదకు ఎక్కిన వసువి కాదు.. రిషి సర్ మీ ఇంటెలిజెన్స్, ప్రిన్స్ అని చెప్పే రిషి సర్ కనిపించడం లేదా? నీకు.. చిన్నప్పటివి అన్నీ చెప్పే వసువి కాదు.. నువ్ మారిపోయి నన్ను మారిపోయానంటున్నావా? నువ్వే మారిపోయావ్.. అని రిషి అంటాడు.
నేను మారలేదు సర్.. నన్ను దూరం పెడుతూ మీరే మారిపోయారు అని వసు అంటుంది.. మనసులోని అన్నింటిని చెప్పే నువ్ మారావ్ అని రిషి అంటాడు.. నేను మారలేదు సర్ అని వసు.. నేను మారలేదు అని రిషి ఇలా వాగ్వాదానికి దిగుతారు. చివరకు రిషి బరస్ట్ అవుతాడు.. మారకపోతే శిరీష్‌తో నీ పెళ్లి అని నాకు ఎందుకు చెప్పలేదు..అని రిషి అడగడంతో వసు షాక్ అవుతుంది. ఏమన్నారు.. సర్.. శిరీష్‌తో నాకు పెళ్లేంటి పెళ్లి సర్.. అని అంటుంది. ఎంగేజ్మెంట్ చేసుకున్నావ్.. చేతికి రింగు.. పెళ్లికి లీవ్ కావాలని అడిగి వెళ్తున్నావ్. అన్నీ చెబుతావ్ కదా? శిరీష్‌తో పెళ్లి చేసుకుంటున్న విషయం నాకు చెప్పావా?.. . నాకు చెప్పలేదు కదా? అందుకే నీ మీద నాకు కోపం.. ఒక్క మాట అయినా చెప్పొచ్చు కదా? అందుకే నీ మీద నాకు కోపం.. అని రిషి తన మనసులోని బాధంతా చెప్పేశాడు.
సర్.. మేం పెళ్లి చేసుకుంటాన్నామని ఎవరు చెప్పారు సర్.. శిరీష్ వేరే అమ్మయిని ప్రేమించాడు.. ఆ అమ్మయితోనే ఎంగేజ్మెంట్ జరిగింది.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు.. వాళ్లింట్లో ఏదో ప్రాబ్లం.. ట్రాన్స్‌ఫర్ అయ్యేలా ఉంది.. ఈలోగా పెళ్లి చేసుకోవాలని మహేంద్ర సర్ హెల్ప్ అడిగాడు.. నేను శిరీష్‌ను పెళ్లి చేసుకుంటున్నాను అని అలా ఎలా అనుకున్నారు సర్.. అంతా మీరే ఊహించుకుంటారా? సర్. ఏంటి సర్.. అంటూ అని వసు కళ్లు తిరిగి కిందపడబోయింది.
ఇంతలో రిషి పట్టుకుని.. ఎత్తుకుని జగతి మేడం ఇంటికి తీసుకెళ్తాడు. అలా వసుని చూసి జగతి, మహేంద్రలు షాక్ అవుతారు. ఏమైంది అంటే రిషి సమాధానం చెప్పాడు. వసు వర్షంలో తడిసిందని అంటాడు. వసును జాగ్రత్తగా చూసుకోండని చెబుతాడు. మనం తరువాత మాట్లాడదం అంటూ తండ్రిని కోపంగా చూసి వెళ్లిపోతాడు రిషి. ఏం చెప్పకుండా అలా వెళ్లిపోవడంతో మహేంద్రకు కోపం వస్తుంది. తను చెప్పిందో తప్పా.. మనది వినడు.. ఏంటి జగతి.. ఇదంతా.. ఏమైనా అంటే నీకు కోపం వస్తుంది.. వాడికి కోపం వస్తుంది.. అని మహేంద్ర అంటాడు. రిషి చెప్పాడు కదా? వసుకు ఏం కాదు.. కాసేపు ఉండు అప్పుడే వెళ్లకు.. అని జగతి అంటుందది. వీళ్లిద్దరికి ఏమైంది.. రిషి ఎందుకు మాట్లాడటం లేదు.. అని మహేంద్ర అనుకుంటాడు.
ఇక ఇంట్లో దేవయాణి చిందులు తొక్కుతుంది. ధరణి మీద అరుస్తుంది. ఇంట్లో ఏం జరుగుతోంది.. ఎవరు వస్తున్నారు. ఎప్పుడు వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారు అనే విషయాలేవీ తెలియడం లేదు అదే. ఇలా రిషి ఉన్నపలాన వెళ్లిపోయాడు.. ఎక్కడికి వెళ్లాడు..అడిగితే నువ్ చెప్పవు.. తెలియదు.. అడగలేదు అత్తయ్య అని అంటావ్.. నా పాటికి నేను అరిచేస్తున్నా నువ్ ఒక్క మాట మాట్లాడటం లేదు.. అని దేవయాణి అరుస్తుంది. మీరు ఎప్పుడూ ఇంతేనా అత్తయ్య.. అందరి మధ్యలో చిచ్చులు పెట్టాలని చూస్తారా? అని ధరణి తన మనసులో తాను అనుకుంది. కారు చప్పుడు అయింది.. అని ధరణి అనడంతో.. కారు చప్పుడు అయింది.. కాకి అరిచింది.. నాకు కూడా వినిపిస్తుంది..ఇలాంటివి మాత్రం చెబుతావ్.. అని దేవయాణి విసుక్కుంది. ఏమైంది నాన్న ఇలా తడిచిపోయావ్.. ఎందుకు ఇలా తడిచావ్.. ఏమైంది.. అంటూ వర్షంలో తడిసిన రిషిమీ దొంగ ప్రేమను చూపించింది దేవయాణి. టవల్ తీసుకురా.. అని ఒక్కసారి చెబితే అర్థం కాదా? అని ధరణి మీద దేవయాణి ఫైర్ అవుతుంది.. నా గదికెళ్లి ఫ్రెష్ అప్ అయివస్తాను..అని పెద్దమ్మను పట్టించుకోకుండా రిషి వెళ్లిపోతాడు. నన్ను అస్సలు లెక్కచేయడం లేదు.. కారులో వెళ్లిన రిషి.. తడిచి రావడం ఏంటి? మారిపోయాడా? నా చేతుల్లోంచి జారిపోతోన్నాడా? అని కంగారు పడుతుంది దేవయాణి.
వసు మాటలు తలుచుకుటూ రిషి ఆలోచనల్లో పడతాడు. అద్దంలో వసు ప్రతిబింబం కనిపిస్తుంది. అసలు ఏంటి సర్ ఏమనుకుంటున్నారు.. అన్నీ మీరే అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టుగా ఎదుటి వాళ్లు కూడా ఉండాలని అనుకుంటున్నారు.. ఎదుటివారి ఇష్టాలు, స్వతంత్రాలను గౌరవించాలి.. వారికి ఇష్టమున్నట్టుగా ఉండనివ్వాలి.. దాన్ని మనం స్వీకరించాలి.. అంచనాలు తప్పితే ఫీలవుతారు.. ఎదుటి వారు.. ఎలా ఉన్నా స్వీకరించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.. లేదంటే అంతా మీరు అనుకున్నట్టు ఉండాలంటే.. ఆ తరువాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. మనసులో ఓ మాటను తలుచుకుని,పెట్టుకుని బాధపడ్డారు అందుకే ఇలా అయిందంటూ వసు మాట్లాడినట్టుగా రిషికి అనిపిస్తుంది.ఇక మళ్లీ ధరణి టవల్‌తో లోపలకు వస్తుంది. ఏం జరిగిందో అడిగే ప్రయత్నం దేవయాణి చేస్తుంది. కానీ రిషి కాస్త చిరాకు పడతాడు. దీంతో ఇద్దరూ బయటకు వెళ్తారు.
వసుధార ఏమైంది నీకు.. ఎక్కడైంది మొదలైంది.. ఎక్కడకు వచ్చావ్.. జీవితంలో ప్రశ్నలు ఉండొచ్చు.. కానీ జీవితమే ప్రశ్న కాకూడదు.. నేను భయపడిందే జరుగుతోంది అంటూ వసు గురించి జగతి కంగారు పడుతుంది..ఆ తరువాత మహేంద్రకు ధరణి ఫోన్ చేస్తుంది. ,చిన్న మావయ్య గారు. రిషి ఇంటికి వచ్చాడు. అదోలా ఉన్నాడు.. ఏం చెప్పడం లేదు అని ధరణి అంటుంది. వాడిని అలా వదిలేయండి.. ఎవ్వరూ డిస్టర్బ్ చేయకండి.. వచ్చాక అన్నీచెబుతాను అని మహేంద్ర అంటాడు.
సర్ సర్ అంటూ నిద్రలోంచి కలవరించింది రిషి. రిషి అన్న మాటలు తలుచుకుంటూ ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచింది. ఎక్కడున్నాను అంటూ జగతి మేడంను అడిగింది. నేను వెంటనే రిషి సర్‌ని కలవాలి.. నేను సర్‌ని కలవాలి అంటూ మొండి పట్టుదలగా చేసింది. నీకు ఏమైనా మతిపోయిందా?. ఈ రాత్రి ఎక్కడికి వెళ్తావ్ అని జగతి.. ఏమైందో తెలియదు గానీ గొడవ జరిగితే రేపు మాట్లాడుకుందాం అని మహేంద్ర అంటాడు. మీతో మాకు పెద్ద తలనొప్పిగా మారింది.. బుద్దిగా పడుకో.. మనసును కాసేపు ప్రశాంతంగా ఉంచుకో..రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు.. అని వసు మీద జగతి ఫైర్ అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. రిషి మనసులోని ప్రేమ వసుకు అర్థమవుతుందా? లేదా? అన్నది చూడాలి.