- February 8, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. అమ్మా అని పిలుస్తాడా?.. రిషి చేయగలడా?

గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 8 మంగళవారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Epiosde 368 ధారావాహికలో ఎమోషనల్ సీన్లు పడ్డాయి. జగతిని ఇంటి నుంచి పంపించేస్తాడు మహేంద్ర. ధరణి, ఫణీంద్రలు బాధపడతాడు. కానీ దేవయాణి మాత్రం ఫుల్ ఖుషీ అవుతాడు. రిషి ఎటూ తేల్చుకోలేక అలా నిల్చుండిపోతాడు.
ఇంట్లో అందరికీ ఎంత హక్కుందో.. నీకు కూడా అంతే హక్కుంది.. కాలం బాగా లేక కాలేజ్‌లో సర్, మేడం అని పిలుచుకుంటాం.. పిలుపులు మారిపోయాయ్ కానీ బంధం మారలేదు.. అని ఫణీంద్ర అంటాడు. చిన్నత్తయ్య పసుపుబొట్టు తీసుకోండి.. అని ధరణి అంటుంది. వదిన.. ఇలాంటివి పెద్దమ్మ చేతుల మీదుగా ఇస్తే బాగుంటుంది.. అని రిషి అంటాడు.
ఇదేంటి ఇలా ఇరికించాడు అని దేవయాణి అనుకుంటుంది. దేవయాణి ఇవ్వు.. అని ఫణీంద్ర అంటాడు. కానీ ఏదో అయిష్టంగా ఇస్తుంది. ఈ ఇళ్లు నీ రాక కోసం ఎదురుచూస్తుంటుంది.. నీ స్థానం ఎప్పటికీ నీదే.. ఎవరు అవునన్నా కాదన్నా బంధాలు, రక్త సంబంధాలు అబద్దం కావు కదా? అని ఫణీంద్ర అంటాడు. చాలన్నయ్య చాలా గొప్ప మాట చెప్పావ్.. జగతి.. ఆశీర్వాదం తీసుకుందాం అని కిందకు వంగుతారు
కానీ కాళ్లకు దండం పెట్టాలని చూస్తే కూడా తప్పుకుంటుంది దేవయాణి..చల్లగా ఉండండి జగతి అని ఫణీంద్ర ఆశీర్వదిస్తాడు. ఇక ఇంట్లోంచి అడుగు బయటపెట్టే సమయంలో గడపకు మొక్కుతుంది జగతి. ఎంతో బాధతో మళ్లీ వెనుదిరికి వెళ్తుంది. రిషి అలా చూస్తుండిపోతాడంతే. వెళ్లాలనే ప్రయత్నించినా కూడా రిషిని దేవయాణి ఆపుతుంది.
నా భార్యగా నువ్ అడుగుపెట్టాలి.. ఎవరో పిలిస్తేనో కాదు.. అని మహేంద్ర అంటాడు. నువ్వెందుకు వెళ్లమన్నావో నాకు అర్థమైంది.. చంద్రుడికి కలువ పూవుకి బంధం ఉంటుంది కానీ అవెప్పుడూ కలుసుకోలేవు..అని జగతి అంటుంది. నేనంటే నువ్వే.. నువ్వంటే నేనే.. నీ గౌరవమే నా గౌరవం.. నిన్ను ఎవరైనా ఒక మాటంటే నేను భరించలేను.. అందుకే ఇలా.. అని మహేంద్ర చెబుతాడు.
అలా కారులో జగతి ఇంటికి వస్తారు. డోర్ తీయమని వసుకు చెబుతంది. దీంతో వసు ముందు దిగేసి వెళ్తుంది. ఇంట్లోకి రాకుండా వెళ్తావా? మహేంద్ర.. అని అంటుంది. జగతి నా మీద కోపం వస్తుందా? అని మహేంద్ర అడుగుతాడు. నాకు ఎవరి మీదా కోపం లేదు.. ఏంటి వసు అలా చూస్తున్నావ్.. తిరిగి రానని అనుకున్నావా? వెళ్లేటప్పుడు ఈ గడప నన్ను శపించినట్టుంది.. మళ్లీ నా దగ్గరకే రావాలి అని అన్నట్టుంది.
ఆ గడపకు ఈ గడపకు.. దూరం తక్కువే అయినా వెళ్లడానికి 22 ఏళ్లు పట్టింది.. ఏంటి మహేంద్ర అలా చూస్తున్నావ్ మహేంద్ర.. అని అంటుంది జగతి. వీలైతే నన్ను క్షమించు.. నా భార్యను గౌరవం లేని చోట నేను చూడలేను.. అందుకే తప్పలేదు.. అని మహేంద్ర అంటాడు. నీ తప్పేం లేదు.. అని జగతి అంటుంది. ఇక మహేంద్ర, ఫణీంద్ర మాటలను రిషి తలుచుకుంటాడు. ఆలోచనలో పడతాడు.
వంటగదిలో ధరణి బాధపడుతుంటుంది. ఎన్నో ఏళ్లు ఎదురుచూశారు.. కోరిక తీరకుండానే వెళ్లిపోయారు అని జగతి గురించి బాధపడుతుంటుంది. ఇంతలో దేవయాణి వస్తుంది.. ఏంటో కళ్లు తుడుచుకుంటున్నావ్.. ఎందుకో ఆ ఏడుపు.. అని దేవయాణి అడుగుతుంది. కంట్లో ఏదో పడింది.. అందుకని.. అంటూ ధరణి ఏదో కవర్ వచేస్తుంది. సర్లేగానీ.. ఇంట్లో అందరికీ స్వీట్లు చేసి పెట్టు అని అంటుంది దేవయాణి అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో.. ఏంటి వదిన డల్లుగా ఉన్నావ్ అని రిషి అడిగితే.. అనుకోకుండా సంతోషం వచ్చి ఇలా వెళ్లిపోయింది అని ధరణి సమాధానం చెబుతుంది.. జగతి నా భార్యగా, రిషికి అమ్మలా ఇంట్లోకి సగర్వంగా అడుగుపెట్టాలి.. అని వసుతో మహేంద్ర చెబుతాడు. ఇంతలోరిషి అక్కడికే వస్తాడు. మరి రిషి అమ్మా అని పిలుస్తాడా? ఇంటికి తీసుకెళ్తాడా? అన్నది చూడాలి.