• February 2, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసు కోసం రిషి, గౌతమ్.. ఇద్దరూ తగ్గట్లే

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసు కోసం రిషి, గౌతమ్.. ఇద్దరూ తగ్గట్లే

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 2 బుధవారం నాటి Guppedantha Manasu Epiosde 363 ధారావాహికలో పెద్దగా ట్విస్ట్‌లు ఏమీ రాలేదు. వసు చుట్టూ రిషి, గౌతమ్‌లున్నారు. జగతి చుట్టూ మహేంద్ర తిరిగాడు. ఇక జగతి, వసులను చూసి ఎప్పటిలానే దేవయాణి కడుపు మంటతో రగిలిపోయింది. గత వారం నుంచి ఇదే జరుగుతూ వస్తోంది. అలానే గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ కూడా ముందుకు సాగింది.

    రిషి చెయ్యి తాకి వసు తినే స్వీట్ కప్పు కింద పడిపోతుంది. దీంతో తన కప్పుని ఇచ్చేస్తాడు రిషి. అది చూసి గౌతమ్ కుళ్లుకుంటాడు. చీ చీ కక్కుర్తి గాడిని ముందే తినేశాను.. వేస్ట్ ఫెల్లోని మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను.. అని గౌతమ్ తెగ ఫీలవుతాడు. ఇదంతా దేవయాణి చూడలేకపోతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక మహేంద్రను జగతి లోపలకు తీసుకెళ్తుంది.

    వసుధారకి రిషి తన పాయసాన్ని షేర్ చేశాడు కదా?. నీకు అర్థమైందా? అని మహేంద్రను జగతి అడుగుతుంది. ఎంగిలి చేసిన పాయసాన్నే ఎందుకు ఇస్తాడు.. మనసులో ఉన్న వారికే కదా? అలా చేస్తారు.. అని జగతి అంటుంది. మనం కూడా ఐస్ క్రీమ్ కప్పులు షేర్ చేసుకుంటాం కదా? అని మహేంద్ర సరసాలు ఆడతాడు. నేను మాట్లాడేది ఏంటి? మీరు మాట్లాడేదేంటి? అని జగతి అంటుంది.

    రిషి మనసులో వసు ఉందని నేను అప్పుడంటే కోపం వచ్చింది..అని జగతి అంటుంది. ఇప్పుడు కూడా వస్తుంది.. ఏది ఒక పట్టాన ఒప్పుకోడు మన పుత్ర రత్నం అని రూంలో ఇలా మహేంద్ర జగతి మాట్లాడుకుంటూ ఉంటారు.. వీళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లారు అని దేవయాణి వెతుకుతూ ఉంటుందవి. కొంపదీసి ఈ రూంలో లేరు కదా? అని రూం దగ్గరకు వస్తుంది. ఆ విషయాన్ని జగతి పసిగడుతుంది.

    రూం లాక్ తీసే సమయంలో గౌతమ్ వచ్చి ఆపుతాడు. పెదనాన్న పిలుస్తున్నాడని చెబితే అటు వెళ్లిపోతుంది. ఇక ముగ్గులు వేయడంలో జగతి, ధరణి నిమగ్నమవుతారు. వాటిని ఫోటోలు తీస్తూ గౌతమ్ బిజీగా ఉంటాడు. రిషి, వసులు కాస్త దూరంలో ఉండి ఇదంతా చూస్తుంటారు. ఇక్కడ ఎల్లో వేస్తే బాగుంటుందేమో.. జగతి మేడం.. అని మహేంద్ర అంటాడు.

    ఎక్కడ ఏం వేస్తే బాగుంటుందో నాకు తెలుసు మహేంద్ర సర్.. అని జగతి అంటుది. ఇక మాటల్లో మాటగా.. చిన్నత్తయ్య ముగ్గులు చాలా బాగా వేశారు అని ధరణి అంటుంది. ఏంటి వదిన.. చిన్నత్తయ్య అన్నారేంటి.. అని గౌతమ్‌కు అనుమానం వస్తుంది. దీంతో రిషి కంగారు పడతాడు. దేవయాణి గారిని అక్కా అని పిలుస్తాను కదా? ఆమె పెద్దత్తయ్య.. నేను చిన్నత్తయ్యను అవుతాను కదా?.. అని జగతి కవర్ చేస్తుంది.

    ముగ్గు చాలా బాగుంది.. పేరు బాగా రాశారు.. అని గౌతమ్ పొగుడుతాడు. వసు ధార రా ఫోటో తీస్తాను.. నువ్వు రారా.. ఫోటో తీస్తాను అని గౌతమ్ అంటాడు.. కాలికి దెబ్బ తగిలింది రాదు.. ముగ్గు ముందు నువ్వే కూర్చుని ఫోటో దిగురా అని కౌంటర్ వేస్తాడు రిషి. అలా రిషి లోపలకి వెళ్లడంతో జగతి, మహేంద్రలు సెల్ఫీ దిగుతారు. అది చూసి ధరణి కూడా జాయిన్ అవుతుంది. ఇక ఆ తరువాత గౌతమ్ కూడా జాయిన్ అవుతాడు.

    మరో వైపు వసు కోసం రిషి టాబెట్లు తీసుకొస్తాడు. వసు వేసుకుంటుంది. ఆ తరువాత గౌతమ్ వస్తాడు. టైం అయింది టాబెట్లు వేసుకో వసు అని అంటాడు.. సర్ ఇచ్చారు వేసకున్నాను అని వసు చెబుతుంది.. అమ్మ రిషిగా నాకు పోటీగా తయారయ్యాడా అని గౌతమ్ అనుకుంటాడు.. ఇక జగతి, ధరణి, దేవయాణి ముగ్గు చుట్టూ డ్యాన్స్ వేస్తారు. ఇక మధ్యలోనే దేవయాణి వచ్చేస్తుంది.

    నాకు ఒళ్లు మండుతోంది.. మీ బలవంతం మీదే వెళ్లాను.. అని దేవయాణి తన భర్త ఫణీంద్రతో అంటుంది. పండుగ రోజు కదా? ఈ పంతాలు అవసరమా? అని ఫణీంద్ర అంటాడు. పండుగ కదా అని పడనివాళ్లను చూసి ఎలా నవ్వుతూ ఉండేది అని దేవయాణి చిరాకుపడుతుంది.. ఇదంతా రిషి చేసిన తప్పులేండి అని దేవయాణి అనుకుంటూ వెళ్లిపోతూ రిషి, వసుని చూస్తుంది..

    ఇక వసుకి తన ఊరు, తన ఇంటి వాళ్లు గుర్తుకు వస్తారు. ఏంటి ఏం మాట్లాడటం లేదేంటి.. అని రిషి అడిగితే.. మా ఊరు, అమ్మానాన్నలు గుర్తొచ్చారు.. మా ఊర్లో బాగా చేస్తాం సర్.. అని వసు అంటుంది. ఇక్కడున్న వాళ్లంతా మీ వాళ్లే అనుకో. కొంచెం బాధ తగ్గుతుంది.. యూత్ ఐకాన్‌లా కాకుండా.. అచ్చమైన తెలుగమ్మాయిలా ఉన్నావ్ అని వసుని పొగిడేస్తాడు రిషి.. థ్యాంక్స్ సర్ అని వసు ఉప్పొంగిపోతుంది. ఇక డ్యాన్సులు ఆపేసి అందరూ ఇంట్లోకి వెళ్తారు.. వసు ఒకసారి లోపలకు రావా జగతి అంటుంది. వస్తాను మేడం అని వసు అంటుంది..

    ఈ గెటప్‌లో చాలా బాగున్నావ్.. ఒక్క మాటలో చెప్పాలంటే.. అసలు సిసలు తెలుగింటి అమ్మాయికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నావ్..అని గౌతమ్ పొగిడేస్తాడు. ఏంటి ఏం మాట్లాడావ్.. బాగా చెప్పాను కదా? అని గౌతమ్ అంటే.. ఇదే మాట అటు ఇటుగా కాస్తా రిషి సర్ అన్నారు అని వసు చెబుతుంది.. కాంప్లిమెంట్లో కూడా కాంపిటిషనా? వెదవ అని గౌతమ్ తిట్టుకుంటాడు.

    వసు నాకు చిన్న హెల్ప్ చేయాలి అని జగతి అడుగుతుంది.. మిమ్మల్ని ఇలా చూస్తే ప్రతీ క్షణం ఎంతో సంతోషంగా ఉంది.. ఆర్డర్ వేయాలి.. మీ ఇంట్లోకి నేను గెస్టు కదా? మీరు అడగాలి నేను చేయాలి అని వసు అంటుంది.. తట్టుకోలేనంత సంతోషంతో ఉన్నాను వసు అని జగతి చెబుతూ.. కళ్లు మూసుకో.. ఇప్పుడు కళ్లు తెరువు అని రిషి కోసం కొన్ని బట్టలను చూపిస్తుంది.

    ఏం చేస్తావో.. ఏం చెప్తావో.. నాకు తెలీదు.. ఈ డ్రెస్‌లో రిషి నాకు కనిపించాలి.. అని జగతి అంటుంది. నేను ఇస్తే తీసుకుంటాడా? అని వసు అంటే. నేను ఇచ్చానని చెబుతే తీసుకోడు అని జగతి కౌంటర్ వేస్తుంది.. ఈ ఇంటికి రప్పించి నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. నేను కొన్న బట్టల్లో నా కొడుకు కనిపించాలి.. మళ్లీ ఇంతటి అవకాశం రాకపోవచ్చు.. అని జగతి ఎమోషనల్ అవుతుంది. కొడుక్కి కొత్త బట్టలు పెడుతున్నావా?.. దాంతోనే నీ కథకు అద్భుతమైన ముగింపు నేనిస్తాను.. జీవితంలో నీ మొహం చూడకుండా చేస్తాను.. నీకు ఇస్తాను ఈ పండక్కి గిఫ్ట్. అని దేవయాణి ఏదో ప్లాన్ వేస్తుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    Leave a Reply