- February 1, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. జగతిపై దేవయాణి కన్ను.. వసుతో రిషికి సర్ ప్రైజ్

గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 1న మంగళవారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Epiosde 362 ధారావాహిక అంతా కూడా చాలా సింపుల్‌గా ఎలాంటి ఆకట్టుకునే ఎమోషన్స్ లేకుండా సాఫీగానే సాగుతుంది. ఇక జగతి మహేంద్ర రిషి ఎక్కడ కలిసిపోతారోనని దేవయాణి ఆందోళన చెందడం కంటిన్యూ అవుతూ వచ్చింది. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు వెళ్లింది.
స్టోరూంలో ఉన్న వసుకి చెక్క గుచ్చుకుంటుంది. పిన్నీస్, గుండు సూది ఉన్నాయా? వాటితోనే తీయొచ్చు అని వసు అంటుంది. నేను ఏమైనా స్టేషనరీ షాప్ పెట్టుకున్నానా? అని రిషి కౌంటర్ వేస్తాడు. ఇది ఇలా రాదు.. నోటితో తీస్తాను ఆగు..మొన్న కాలికి, ఈ రోజు చేతికి, రేపు తలకు తగిలించుకుంటావా? అని అంటాడు. అలా మొత్తానికి నోటితో తీసేస్తాడు రిషి. ఈ గ్యాప్‌లో వసు ఓ పాట వేసుకుంటుంది.
చివవరకు వసు చేతికి గుచ్చుకున్న చిన్న ముక్కను తీసేస్తాడు.. చూస్తే ఎంతుందో చూడు.. అని రిషి అంటాడు. అవును సర్ చిన్న సమస్యలే మనల్ని ఇబ్బంది పెడతాయి?.. మనం పెద్దదిగా చూస్తాం.. అని వసు అంటుంది. దీంతో కూడా జ్ఞానబోధ చేస్తావా? దీన్ని కూడా జ్ఞాపకంగా దాచుకుంటావా? అని రిషి అంటాడు. ఇంతలో గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు..
హలో నన్ను కూడా పిలవొచ్చు కదరా.. భోగి మంటలు వదిలేసి ఇక్కడకు వచ్చావ్.. అని అడుగుతాడు గౌతమ్. ఏం లేదురా.. కరెక్ట్ టైంకి వచ్చావ్.. చెక్కలు తీసుకొనిరా.. అని అంటాడు. ఎలా తీసుకుని రావాలిరా అని గౌతమ్ అడిగితే.. నెత్తి మీద పెట్టుకుని.. చేతకాకపోతే నాకు చెప్పు.. నేను తీసుకొస్తాను రిషి అంటాడు. అమ్మో వసు ముందు చేతకాదని ఎలా అంటాను.. మార్కులు తగ్గిపోతాయ్.. గౌతమ్ అనే వాడు.. యోదుడు.. అది ఇది.. అని చెబుతుంటాడు. కదా? అయితే తీసుకురా.. రా వసుధార.. మనం వెళ్దాం..అని రిషి, వసు వెళ్తారు.
ఏంటి ధరణి పార్టీ మార్చేశావ్.. భోగి మంటలు అయిపోయాక.. ఆ బూడిదను పారేస్తాం.. మనుషుల్లాగా.. నేను వాకిల్లాంటి దాన్ని ఎప్పుడూ ఇక్కడే ఉంటాను.. ఇటురా అని భయపెట్టేస్తుంది దేవయాణి.. ఇంతలో గౌతమ్ వచ్చి పాత సామాన్లను మంటలో వేస్తాడు. గౌతమ్ మంచిపని చేస్తున్నాడు అని ఫణీంద్ర మెచ్చుకుంటాడు. గౌతమ్ చాలా చురుగ్గా ఉంటాడు.. అని మహేంద్ర కూడా అంటాడు.
నాపనితనానికి రేటింగ్ ఇచ్చారు థ్యాంక్స్ అని గౌతమ్ సంబరపడతాడు.. సైకిల్ పోటీల్లో ఎవరు గెలిచారు.. అని మహేంద్ర అడుగుతాడు. వసు చెప్పబోతోంటే.. నేను చెబుతాను.. నువ్వుండు వసుదార.. అని అంటాడు. గెలిచామా? ఓడామా? అన్నది ముఖ్యం కాదు.. పోరాడామా? లేదా? అన్నదే ముఖ్యం.. అని కవర్ చేసుకునేందుకు గౌతమ్ ట్రై చేస్తే.. ఎవరు గెలిచారో అర్థమైంది.. అని మహేంద్ర అంటాడు. సైకిల్ పోటీల్లో అనవసరంగా ఓడిపోయాను.. అని అనుకుంటాడు గౌతమ్. ఇక భోగి మంటలు చూస్తుంటే రిషికి ఒకటి గుర్తుకు వస్తుంది. వసు మనం ఆ రోజు విన్న పాట గుర్తుందా? అని అడుగుతాడ రిషి. ఆ పాట గుర్తుంది సర్.. అని వసు అంటుంది. ఓసారి ప్లే చేయవా అని అడిగితే.. గౌతమ్ దగ్గర ఉన్న తన ఫోన్ తీసుకుని పాట ప్లే చేస్తుంది.
దీంతో మహేంద్ర, గౌతమ్‌లు డ్యాన్సులు చేస్తారు. జగతి నవ్వుతుంది. దేవయాణి కుళ్లుతో చచ్చిపోతుంది. అలా భోగి మంటలు ముగుస్తాయ్. ఇంటి ముందు పూల దండలు కడుతూ వసు, రిషిలు బిజీగా ఉంటారు. ఇక లోపల తోరణాలు కడుతూ జగతి, మహేంద్రలు బిజీగా ఉంటారు. వసు మీద పూలు జల్లాలని ప్లాన్ వేస్తాడు గౌతమ్. దీనికి ధరణి హెల్ప్ తీసుకుంటాడు.
కానీ అది చివరకు ఫ్లాప్ అవుతుంది. ఆ పూల వర్షం కాస్తా.. మహేంద్ర జగతిల మీద పడుతుంది. మీ వదినే తెలియకుండా మీ మీద పూల వర్షాన్ని కురిపించిందని చెబుతాడు ఫణీంద్ర. థ్యాంక్స్ వదిన.. సంక్రాంతి శుభాకాంక్షలు అని అంటాడు. అలా అందరూ విషెస్ చెప్పుకుంటారు. సర్ సంక్రాంతి శుభాకాంక్షలు అని జగతి చెబుతుంది. మీక్కూడా మేడం అని రిషి అంటాడు.
అది చూసి దేవయాణి మరింత రెచ్చిపోతుంది. రిషి మీద ఎక్కడా లేని ప్రేమను ఒలకబోస్తూ జగతిని బాధపెట్టాలని మరింత ఎక్కువగా చేస్తుంది. అలా చివరకు వసుకి గౌతమ్ విషెస్ చెబుతూ.. షేక్ హ్యాండ్ ఇస్తాడు. కానీ వసు మాత్రం దండం పెట్టేస్తుంది. ఇక అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. జగతి చేసిన పాయసాన్ని ఫణీంద్ర, గౌతమ్ మెచ్చుకుంటారు. నువ్వే చేశావ్ కదా? చాలా బాగుంది అని జగతితో మహేంద్ర అంటాడు. ఇలా నా కొడుకుతో కూర్చుని ఎన్నేళ్లు అవుతుందో కదా? అని జగతి అంటుంది. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక రేపటి ఎపిసోడ్‌లో రిషి కోసం కొన్న బట్టలను వసుకి జగతి చూపిస్తుంది. ఇవి వేసుకుని నా కొడుకు కనిపించాలి అని వసుకి చెబుతుంది. ఈ మాటలన్నీ కూడా దేవయాణి వింటుంది. జగతి ప్లాన్‌ను చెడగొట్టేందుకు రెడీ అవుతుంది. మరేం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.