• January 31, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. ఓ వైపు జగతి మహేంద్ర.. ఇంకో వైపు రిషి వసు

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. ఓ వైపు జగతి మహేంద్ర.. ఇంకో వైపు రిషి వసు

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే 31 జనవరి సోమవారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Epiosde 361 ధారావాహిక అంతా కూడా సింపుల్‌గా సాగిపోయింది. జగతి మహేంద్రలు ఆనందంలో తేలిపోతోంటారు. ఇక దేవయాణి కుళ్లుతో కడుపు మంటతో రగిలిపోతుంది. ఇక రిషి, వసుల మధ్య దూరం ఇంకాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ మాత్రం అలా సో సోగా గడిచింది.

    రిషి రాకను గమనించిన దేవయాణి ప్లేట్ పిరాయించింది. కొత్త బట్టలు ఇవ్వడం సంప్రదాయమని కలరింగ్ ఇచ్చింది. ఇంటికి కొత్తగా వచ్చిన వారికి ఇలా బట్టలు పెట్టడం మన సంప్రదాయం కదా? అని రిషితో దేవయాణి అంటుంది. మీ మంచితనం నాకు తెలుసు కదా? పెద్దమ్మ అని రిషి అంటాడు. మీరు ఇవ్వండి మీరు పెద్దవారు కదా? అని రిషి వెళ్లిపోతాడు.

    ఇక రిషి వెళ్లడంతో ఆ బట్టలు మళ్లీ ఫణీంద్రకే ఇచ్చేస్తుంది దేవయాణి. మళ్లీ రిషి వచ్చినా వస్తాడు అని ఫణీంద్ర అనడంతో ఇద్దరూ కలిసి జగతి, మహేంద్రకు బట్టలు పెడతారు. ఇదంతా రిషి చూస్తాడు. మహేంద్ర, జగతిలు కాళ్లకు దండం పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ దేవయాణి మాత్రం దూరం జరుగుతుంది. ఫణీంద్ర కాళ్లకు మాత్రం మొక్కుతారు. చల్లగా ఉండు తల్లి అని దీవిస్తాడు.

    డాడ్ కళ్లలో మునుపెన్నడూ కనిపించని కొత్త ఆనందం చూస్తున్నా.. అని రిషి అనుకుంటాడు. ఈ ఫ్యామిలీ ఎప్పుడూ ఇలా ఉంటే బాగుండు.. అని వసు అనుకుంటుంది. జగతి ఇంటికి రావడం అద్భుతం కన్నా ఎక్కువే.. జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చావ్ థ్యాంక్స్ రిషి.. అని ఓ వైపు మహేంద్ర సంబరంగా ఉంటాడు. సంతోషం అంటే పొద్దున్నే చిరునవ్వుతో కాఫీ అందించే భార్య మొహం చూడటం..అని చెప్పిన మహేంద్ర మాటలను తలుచుకున్న రిషి.. సంతోషం అంటే ఏంటో.. డాడ్ మొహంలో మొదటి సారి చూశాను.. పాపం వసుకి ఇంటికి రాగానే దెబ్బ తగిలింది. ఏం చేస్తోంది నిద్రపోతోందా? అని ఇంకో వైపు రిషి ఆలోచిస్తాడు.

    మేడం నిద్రపోరా ఇంకా? అని వసు అడుగుతుంది. నిద్రపట్టదేమో వసు అని జగతి అంటుంది.. మేడం కంగ్రాట్స్ మేడం.. అని వసు చెబితే.. థ్యాంక్స్ వసు అని జగతి అంటుంది.. నాకు అసలు మాట రావడం లేదు తెలుసా అని జగతి తన సంతోషం గురించి చెబుతుంది.. మిమ్మల్ని చూస్తుంటే నాకేం సంతోషంగా ఆగడం లేదు అని అంటుంది వసు.. ఒక పక్క రిషి రూం.. మరో పక్క మహేంద్ర రూం.. నేను ఇక్కడ.. నేను నేనేనా?. అసలు ఇదేలా సాధ్యమైంది.. అన్న ఆనందం.. ఊపిరి ఆగేలా చేస్తోంది. అని జగతి హ్యాపీగా ఫీలవుతుంది.

    సముద్రాన్నే ఈదారు.. కష్టాల సముద్రాన్ని ఈదేశారు.. ఎన్ని మాటలు భరించారు.. ఎన్ని ఏళ్లు ఎదురుచూశారు.. వాటి ఫలితం ఈ రోజు దక్కింది..అని వసు అంటుంది. సంక్రాంతి పండుగ నాకు ముందుగానే వచ్చింది.. నువ్ పడకో.. నాకు నిద్రపట్టదు.. అని జగతి అంటుంది. సంక్రాంతి శుభాకాంక్షలు..అని వసు చెబితే.. థ్యాంక్స్.. నాకు చాలా ప్రత్యేకమైన సంక్రాంతి..అని జగతి అంటుంది.

    ఇక భోగి మంటలు ఏర్పాటు చేస్తారు. ఇక భోగీ, సంక్రాంతి విశిష్టతను వసు వివరిస్తూ.. ఆపమని రిషి అంటాడు. స్టార్ట్ చేస్తే ఆగదు అని చెబుతాడు. అలా మొత్తానికి జగతి భోగి మంటలను ప్రారంభిస్తుంది. అందరూ కలిసి డ్యాన్సులు వేస్తుంటే రిషి, వసు చూస్తుంటారు. ఇక దేవయాణి, ఫణీంద్రలు వస్తారు. ఫణీంద్ర కూడా జాయిన్ అవుతాడు. కానీ దేవయాణి మాత్రం జగతి మహేంద్రల మధ్యలోకి దూరుతుంది.

    మహేంద్ర నువ్.. పేషెంట్ అని మరిచిపోయావా?.. అని దేవయాణి అంటుంది. మతి మరుపు నాకు దేవుడు ఇచ్చిన వరం.. నన్ను తిట్టినా, సూటి పోటి మాటలన్నా కూడా మరిచిపోతాను.. దేవుడు ఇచ్చిన వరం.. అని మహేంద్ర అంటాడు. పెద్దమ్మకు చలిగా ఉందేమో.. శాలువా తీసుకుని వస్తాను అని రిషి అంటాడు.. నేను తెస్తానురా అని గౌతమ్ వెళ్తాడు…

    స్టోరూంలో పాత సామాన్లుంటాయి.. వాటిని తీసుకురా అని రిషిని పంపిస్తాడు.. రిషితో పాటు వసు కూడా వెళ్తుంది. చిన్నప్పుడు రిషి భోగి పళ్లు పోసే దాక ఏడ్చేవాడు.. అని ఫణీంద్ర గుర్తు చేస్తాడు. మనం గుర్తు చేయాలి కానీ.. చాలా మంది మరిచిపోయారు అని మళ్లీ జగతిని ఏడిపిస్తుంది దేవయాణి. రిషి లేడు గౌతమ్ లేడు.. ఎక్కడికి వెళ్లారు.అని గౌతమ్ ఆలోచిస్తాడు.

    ఇక స్టోరూంలో ఈ ఇద్దరూ పాత సామాన్లను వెతుకుతారు. అటూ ఇటూ తిరుగుతూ దెబ్బలు తగిలించుకోకు అని చెబుతాడు.. మీరు దెయ్యాలను నమ్ముతారా? అని వసు అడుగుతుంది.. మనుషుల మీద కూడా నమ్మకం పోతుంది.. ఇప్పుడు ఈ దెయ్యాల గోల ఏంటి..అని రిషి అంటాడు. చీకట్లో దెయ్యాలను గుర్తు చేసుకోవద్దనుకుంటూనే గుర్తు చేసుకుంటాను సర్.. అని వసు అంటుంది. పాత చెక్కలు వెతుకు.. కాలు నొప్పిగా ఉందా కూర్చుంటావా..అని రిషి అడుగుతాడు. అలా ఓ చెక్కను తీసే సమయంలో వసుకి గాయమవుతుంది. ఈ సమయంలోనే గౌతమ్ వస్తాడు. ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో గౌతమ్ వసుకి చేయాలనుకున్న పని.. దేవయాణి జగతి మహేంద్రల మీద చేస్తుంది. తెలియకుండానే వారిద్దరి మీద పూల వర్షాన్ని కురిపిస్తుంది.

    Leave a Reply