• January 29, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. రిషిని చూసి వెనుకడుగు.. దేవయాణికి ఎదురుదెబ్బలు

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. రిషిని చూసి వెనుకడుగు.. దేవయాణికి ఎదురుదెబ్బలు

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 20న శనివారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Epiosde 360 ధారావాహికలో దేవయాణికి ఎదురుదెబ్బలు తగులుతూనే వచ్చాయి. ఇక వసు అయితే రిషి, గౌతమ్‌లకు ఓ పోటీ పెట్టేసింది. గెలిచిన వారికి బహుమతి ఇస్తానంటూ వసు పందెం పెట్టేడంతో గౌతమ్ పరుగులు తీశాడు. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ సాఫీగా సాగిపోయింది.

    అటూ ఇటూ తిరగకు.. ఏం కావాలన్నా నాకు చెప్పు.. అని వసుని జాగ్రత్తగా చూసుకుంటాడు రిషి. సర్ థ్యాంక్స్.. అని వసు చెబుతుంది. ఎందుకు.. అని రిషి అడుగుతాడు. జగతి మేడంను ఇంటికి పిలిచినందుకు..అని మనసులో అనుకుంటుంది. బయటకు మాత్రం కాఫీ తెచ్చినందుకు.. అని చెబుతుంది. ఇక ఫణీంద్ర అయితే.. దేవయాణి ఎందుకు ఫోన్ చేసింది. ఎందుకు ఇంత చిరాగ్గా ఉంది.. ఏమై ఉంటుంది..అని ఆలోచిస్తూ వస్తుంటాడు.

    జగతి నువ్ మన ఇంటికి వచ్చావంటే.. నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు.. రిషి ముందుగా చెబితే బాగుండేది.. ఇంట్లోకి అడుగుపెట్టడాన్ని నా కళ్లతో చూసేవాడిని.. ఎన్నాళైంది.. సంక్రాంతి పండుగకు రిషి నాకు గొప్ప బహుమతి ఇచ్చాడన్నమాట.. ఏంటి జగతి మాట్లాడటం లేదు.. హలో జగతి.. ఏంటి.. అని మహేంద్ర అడుగుతాడ. నన్ను మాట్లాడించకు.. ఈక్షణం కోసం ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేశాను.. కలేమో.. మెళుకువ వస్తుందేమో.. అబద్దం అవుతుందేమో అని భయంగా ఉంది.

    ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతోన్నా. మాట్లాడలేను. మాట్లాడించొద్దు.. అని జగతి, మహేంద్రలు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక ఇంతలో చిన మామయ్య గారు.. అని ధరణి లోపలకు వస్తుంది. మిమ్మల్ని ఇద్దరినీ ఇలా చూస్తుంటే ఎంత బాగుందో.. అని ధరణి అంటుంది. అన్ని పండుగలు ఒకేసారి వచ్చినట్టుంది అని మహేంద్ర అంటాడు.. అవును మామయ్య గారు అని ధరణి అంటుంది..

    మీకేం ఇష్టం.. మీరేం తింటారు.. ఇన్నాళ్లకు మీకు వండి పెట్టే ఈ భాగ్యం కలిగింది.. అని జగతితో ధరణి చెబుతుంది ధరణి నా కడుపు నిండిపోయింది..మనసు నిండిపోయింది..నాకేం వద్దు.. అని అంటుంది. చిన మామయ్య గారు.. పెద్దత్తయ్య కోపం చూస్తుంటే భయంగా ఉంది..అని అంటుంది ధరణి. పర్లేదులే అమ్మా.. ఈ ఆనందం ముందు ఎన్ని కోపాలు, మాటలు అన్నా కూడా నేను పట్టించుకోను.. అని అంటాడు.

    కాఫీ ఏమైనా తెమ్మంటారా? అని ధరణి అడిగితే.. నాకు కావాల్సింది దొరికింది.. అని మనసులో అనుకుంటాడు. నాకేం వద్దులే అమ్మా అని చెబుతాడు. పెద్ద మామయ్య గారువచ్చారు అని ధరణి చెప్పి వెళ్తుంది. బావగారిని కలిసి వస్తాను అని జగతి అంటే.. నేనూ వస్తాను అని మహేంద్ర అంటాడు. రెస్ట్ తీసుకోండి అని జగతి అంటే.. లేదు జగతి.. ఇద్దరం కలిసే వెళ్దాం.. పద.. అని అంటాడు. జాగ్రత్త.. ఇది నిజంగానే నిజమే కదా.. అని జగతి సంబరపడుతుంది. అవును పద..అని మహేంద్ర అంటాడు.

    ఇక మరో వైపు ఆవు పేడ, గొబ్బమ్మ గొప్పదనం గురించి వసు చెబుతుంది. ఆ ఆవు పేడను తీసుకురావాలంటూ రిషి, గౌతమ్‌లకు పోటీ పెడుతుంది. ఎవరు ముందుగా తీసుకొస్తే వారికి గిఫ్ట్ ఇస్తాను అని అంటుంది. దీంతో గౌతమ్ ఎగిరి గంతేస్తాడు. కానీ రిషి మాత్రం కాస్త ఆలోచిస్తాడు. డ్రాప్ అయితే గౌతమ్ ఓవర్ చేస్తాడు అంటూ ఇక ఇద్దరూ బరిలోకి దిగుతారు.

    జగతి ఇంట్లోకి రావడంపై దేవయాణి కస్సుబుస్సులాడుతుంది. ఏంటండి మాట్లాడరు.. అని ఫణీంద్రతో వాగ్వాదానికి దిగుతుంది. నీ బాధ ఏంటి దేవయాణి అని ఫణీంద్ర అడుగుతాడు.. ఎప్పుడో తెంచుకున్న చుట్టరికం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?.అని దేవయాణి అడుగుతుంది. ఎప్పుడూ రాని దాన్ని ఇప్పుడు ఎందుకు వచ్చానో మీకు చెప్పిన అర్థం కాదు లేండి.. అది మనసున్న వాళ్లకే అర్థమవుతుంది..అని జగతి అంటుంది.

    నా ఇంటికి వచ్చి నన్నే అంటోంది.. అని దేవయాణి ఉడికిపోతుంది. ఈ ప్రశ్నకు రిషి సమాధానం చెప్తాడు అని మహేంద్ర అంటాడు. జగతిని కాలేజ్‌లోకి తెచ్చిందే నువ్ కదా?..అని దేవయాణి అంటుంది. కాలేజ్ విషయాలు ఇప్పుడు ఎందుకు అని ఫణీంద్ర అంటాడు.. ఇదే అలుసు అయింది.. మిషన్ ఎడ్యుకేషన్ అంటారు.. నెత్తిన పెట్టుకుంటారు.. అని దేవయాణి అంటుంది. నీ బాధ ఏంటో నాకు ఇన్నేళ్లైనా అర్థం కాలేదు.. నీ ఇళ్లు నీ ఇళ్లు అంటావేంటి..నీకు ఎంత హక్కుందో జగతికి కూడా అంతే హక్కు ఉంటుంది.. అని ఫణీంద్ర అంటాడు.

    హక్కులు, వాటాలు అంటూ మీరే ఐడియాలు ఇవ్వండి.. అని దేవయాణి కౌంటర్లు వేస్తుంది. హక్కుల కోసం పంతానికి వెళ్తే మీకే అవమానం జరుగుతుంది.. వాటాల కోసం పోరాడితే మీ పెత్తనానికే ప్రశ్నార్థకం అవుతుంది.. రిషి కోసమే మీరేం చేసినా సహిస్తున్నాను.. అని జగతి అంటుంది. అదండి సంగతి.. మీరు వింటున్నారు కదా? అని దేవయాణి అంటుంది.

    మహేంద్రకి ఆరోగ్యం బాగాలేదు.. పండుగకి సంతోషంగా ఉండొచ్చు కదా? అని దేవయాణికి కౌంటర్లు వేస్తాడు ఫణీంద్ర. మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారు.. పరాయి వాళ్లకే.. చేస్తుంటారు కదా? అని అంటుంది. ఇక్కడ ఎవ్వరూ పరాయి వాళ్లు లేరు.. జగతి నా భార్య.. అని మహేంద్ర ముందుకు వస్తాడు. కానివ్వండి.. అందరూ ఒక్కటయ్యారు.. అని దేవయాణి చిరాగ్గా వెళ్తుంది. రాకరాక వచ్చావ్.. కన్నీళ్లు పెట్టుకోకు.. జగతి అని ఫణీంద్ర అంటాడు.

    ఇప్పుడేమైంది రిషికి.. నాకు చెప్పకుండా ఇలా చేస్తున్నాడేంటి?.. నా మీద ప్రేమ పెరిగింది.. నా చేతుల్లోంచి జారిపోతోన్నాడా.. అని తెగ ఆలోచిస్తుంటుంది దేవయాణి. ఏం దేవయాణి ఒక్క దానివే కూర్చున్నావ్..అని ఫణీంద్ర అడుగుతాడు. మధ్యలో అవసరం లేనివాళ్లు వచ్చారు.. నేను అందుకే ఒక్క దాన్ని కూర్చున్నాను అని కౌంటర్ వేస్తుంది.. మహేంద్రకు అంత పెద్ద గండం తప్పింది.. కాస్త సంతోషంగా ఉండొచ్చు కదా? అని ఫణీంద్ర అంటాడు.

    నటిస్తే అది కోపం ఎలా అవుతుంది.. అయినా అందరూ ఒక్కటయ్యారు కదా? అని అంటుంది. మామయ్య గారు అవి ఇవ్వండి అని చేతుల్లో ఉన్న బట్టల గురించి ధరణి అడుగుతుంది.. ఏంటడి మీరు.. రిషి ఇంటికి పిలుస్తారు.. మీరేమో బట్టలు కొనిస్తారు..ధరణి ఏమో కమ్మగా వండి పెడుతుంది.. నేను రాక్షసినా?.. చిన్నప్పుడు వదిలేసి వెళ్లిందని గుర్తు లేదా.. అని పాతవి తీసేందుకు ప్రయత్నిస్తుంది.

    మన చేతుల మీదుగా బట్టలు పెడదాం.. సంతోషిస్తారు.. అని ఫణీంద్ర అంటడు. నేను మాత్రం సంతోషంగా ఉండను. నేను వెళ్లిపోతాను.. నా చేతులతో జగతికి బట్టలు పెట్టడం అసంభవం.. అని దేవయాణి అంటుంది. ఇంతలో వాళ్లే వస్తుంటారు. రా రా మహేంద్ర.. అమ్మా జగతి అక్కడే ఆగిపోయావేంటి.. రా అమ్మా.. అని అంటాడు. అన్నయ్య ఏంటి.. అని మహేంద్ర అడుగుతాడు. చాలా అరుదైన అవకాశం.. ఎన్నో ఏళ్ల తరువాత జగతి ఇంటికి వచ్చింది.. పండుగ రోజున వచ్చింది.. బట్టలు పెడదామని అంటూ ఫణీంద్ర చెబుతాడు. దేవయాణి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలో రిషి వస్తాడు. రిషి రాకతో దేవయాణి వెనుకడుగు వేస్తుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక వచ్చే వారం అందరూ కలిసి సంక్రాంతిని సెలెబ్రేట్ చేసుకుంటారు. రిషి వసుల మధ్య ఇంకా దూరం తగ్గేట్టు కనిపిస్తోంది.

    Leave a Reply