• January 28, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసుకి గాయం.. గౌతమ్ ఓవర్ యాక్షన్.. రిషి నిర్ణయంతో దేవయాణి షాక్

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసుకి గాయం.. గౌతమ్ ఓవర్ యాక్షన్.. రిషి నిర్ణయంతో దేవయాణి షాక్

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 28న శుక్రవారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Epiosde 359 ధారావాహికలో వసుకి గాయమవుతుంది. దేవయాణి అక్కసుతోనే ఆ పని చేస్తుంది. వసుకి గాయమవ్వడంతో గౌతమ్ తెగ ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇక రిషి మాత్రం గాయం తగలడంతో వసుని ఎక్కడకు కదలనివ్వడు. అలా మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    జగతిని చూసిన మహేంద్ర చిన్న పిల్లాడిలా మారిపోతాడు. జగతి నువ్విక్కడా? అని సంబరపడిపోతాడు. లేవకు మహేంద్ర అని జగతి వచ్చి పట్టుకుంటుంది.. ఏంటి రిషి ఈ సర్ ప్రైజ్.. అని మహేంద్ర గాల్లో తేలిపోతాడు. ఈ సంతోషం మీ కల్లలో చూడాలనే తీసుకొచ్చాను డాడ్ అని రిషి లోలోపల అనుకుంటాడు.. సంక్రాంతి శుభాకాంక్షలు డాడ్.. అని రిషి వెళ్లిపోతుంటాడు. సర్లే గానీ రిషి.. అని మహేంద్ర పడిపోబోతాడు. డాడ్..అని రిషి వచ్చే లోపు జగతి పట్టుకుంటుంది. ఆ ఇద్దరిని అలా చూసి రిషి వెళ్లిపోతాడు. జగతి ఇది కలా? నిజమా? నమ్మలేకుండా ఉండాను.. రా రా కూర్చో.. అని ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటారు.

    ఇక దేవయాణి కడుపు మంటతో రగిలిపోతుంది. చ.. ఏది జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. దేవయాణి చచ్చిపోయింది.. ఓడిపోయింది.. ఏం జరుగుతోంది.. రిషికి ఎందుకు ఇలా చేస్తున్నాడు.. రిషిని కాపాడుకుంటూ ఇన్ని రోజులు చేసిందంతా వ్యర్థమైంది.. జగతి, వసులను ఇక్కడకు పిలవడం ఏంటి.. ఈ దేవయాణి ఓడిపోయిందా? నేను ఓడిపోను.. అంటూ తెగ మండిపోతుంది.

    ఇక తన భర్తకు ఫోన్ చేస్తుంది దేవయాణి. ఫోన్ లిఫ్ట్ చేసిన ఫణీంద్ర.. ఆ దేవయాణి చెప్పు అని అంటాడు.. ఏంటసలు.. ఇంట్లో ఏం జరుగుతోందో మీకు తెలుసా? పరిస్థితులు ఘోరంగా తయ్యారయ్యావ్.. త్వరగా ఇంటికి రండి.. అని చెప్పేసి పెట్టేస్తుంది. ఈ రూం గెస్టులకు ఇస్తాను అన్నాడు.. ఇక్కడే ఉంటుందా? గెస్టుగా చిరునవ్వులు నవ్వుకుంటూ ఉంటే ఊరుకుంటానా? గుణపాఠం చెబుతాను.. చేయాల్సిందంతా చేస్తాను.. పెద్దమ్మ మీరున్నారా? పక్కకి జరగండి.. అని రిషి అంటాడు.

    ఇక సూట్ కేస్‌ను తోయడంతో వసు కాళ్ల మీద పడుతుంది. గాయమవుతుంది. డాక్టర్‌ దగ్గరకి వెళ్దామా? అని జగతి అంటుంది.. అవసరం లేదు.. డాక్టరే వస్తాను అన్నాడు.. అని రిషి అంటాడు. ఇంతలో డాక్టర్ వస్తాడు. ఆ డాక్టర్ రండి.. అని రిషి అంటాడు. వసుకి తగిలిన గాయం గురించి చెబుతాడు. డాక్టర్ చూస్తాడు. ఇక గౌతమ్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. అంబులెన్స్‌ను పిలుద్దామా?.. ఆపరేషన్ చేయిద్దామా? అని ఓవర్ చేస్తాడు.

    ఇంతలో దేవయాణి వచ్చి చూస్తుంది. నిజంగానా తగిలిందా? నాలా నటించిందా? అని దేవయాణి ఆలోచిస్తుంటే.. జగతికి అసలు విషయం అర్థమవుతుంది. ఈ గాయం ఎలా తగిలింది అని జగతి అడగడంతో దేవయాణి భయపడుతుంది. మేడం ఇప్పుడు అదంతా అవసరమా? చెప్పండి.. అని రిషి టాపిక్ డైవర్ట్ చేస్తాడు. కొన్ని రోజులు నడవకుండా చూసుకోండి.. పెయిన్ కిల్లర్స్ రాస్తున్నాను.. అని డాక్టర్ అంటాడు. ఆపరేషన్ అవసరం లేదు కదా? అని గౌతమ్ అంటే.. పేషెంట్‌ని ఎందుకు భయపెడుతున్నారు.. అని డాక్టర్ కౌంటర్ వేస్తాడు.

    నేను ఇంటికి వెళ్తాను.. ఇక్కడే ఉంటే పండుగ మూడ్ పోతుంది.. అని రిషి అంటాడు. ఎక్కడికి వెళ్లేది.. డాక్టర్ అన్నది విన్నారా?.. అది తగ్గేదాక ఇక్కడే ఉండాలి.. ఉంటున్నావ్.. అని రిషి అనడంతో దేవయాణి మొహం మాడిపోతుంది. నువ్ సూపర్‌రా రిషి.. అవును నీ కాలినొప్పి తగ్గేవరకు ఇక్కడే ఉంటున్నావ్.. ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు అయినా సరే ఉంటున్నావ్..అని గౌతమ్ ఓవర్ చేస్తాడు.

    ఏం ఆలోచించకుండా ఇక్కడే ఉండండి.. మీరైనా చెప్పండి మేడం అని రిషి వెళ్లిపోతాడు. ధరణి లోపలకు పదా.. అని దేవయాణి అంటుంది. వదిన హ్యాపీ సంక్రాంతి.. ఈ సంక్రాంతి స్పెషల్.. దేవుడు నాకు అన్నీ కలిసొచ్చేలా చేశాడు.. గెస్టులు వస్తే ఇంతే చిన్నప్పటి నుంచి సంతోషం.. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు.. అన్నీ కలిసొచ్చినట్టు.. నా మనసు గాలిపటంలా ఎగిరిపోతుంది.. అని గౌతమ్ చెబుతూ ఉంటాడు.

    ఆ దారం తెగుతుంది జాగ్రత్త.. అని రిషి కౌంటర్ వేస్తాడు. ఎలా తెగుతుందిరా అని గౌతమ్ అంటాడు. తెంపితే తెగుతుంది అని రిషి అంటాడు.. ఆ తెంపే వాడివి నువ్వే అవుతావ్.. ముడేయడం గొప్ప.. తెంపడం కాదురా అని కొటేషన్ చెప్పి గౌతమ్ ఫీలవుతుంటాడు… కాఫీ రెడీ చేయండి.. వెళ్లి ఇచ్చొస్తాను వదిన అని గౌతమ్ అంటాడు.. బుద్దిగా ఉండు.. ఎక్స్ ట్రాలు చేయకు..అని రిషి వార్నింగ్ ఇస్తాడు.

    ఓన్లీ టీ సప్లై, కాఫీ సప్లై.. అని గౌతమ్ మళ్లీ ఓవర్ చేస్తాడు. వసు కాలికి అలా అయిపోయింది.. ఎంత బాధ వేసిందో తెలుసా? గుండె కరిగింది.. అని గౌతమ్ అంటాడు. చలికాలమే కదా.. గడ్డ కడుతుంది.. టీలు, కాఫీలు సప్లై వద్దు.. నోర్మూసుకో.. తోక కత్తిరిస్తా.. అని రిషి అంటాడు. వదిన ఎన్నాళ్లు ఇలా టీ, కాఫీలు మోస్తారు.. నాకు ఇవ్వండి.. అని గౌతమ్ తీసుకుంటాతడు.

    నాన్న గౌతమ్.. అని పిలిచి.. అందులోంచి రెండు కాఫీలు తీసుకుంటాడు రిషి. ఓరేయ్ మిత్రద్రోహి.. కాఫీ సర్వ్ చేయడంలో ఎంత ఆనందం ఉందో నీకు తెలుసా? అని గౌతమ్ అంటాడు.. నాకు తెలుసు కాబట్టే నేను తీసుకెళ్తున్నాను.. అని తీసుకుని వెళ్లడంతో ధరణి షాక్ అవుతుంది. నాకు తెలుసురా నువ్వేం అనుకుంటున్నావో.. జాగ్రత్త అని అంటాడు గౌతమ్. ఫ్రెండ్‌వి కాదురా విలన్..అని ఆ కాఫీని తాగేస్తాడు.. చూసుకోలేదు వదిన.. వేడిగా ఇవ్వాలా? కాఫీ అని గౌతమ్ అంటాడు..

    సూట్ కేస్ ఎలా తగిలింది.. కాలికి దెబ్బ తగిలిందన్న బాధకంటే.. జగతి మేడం ఇక్కడకు వచ్చిందన్న ఆనందమే ఎక్కవుగా ఉంది.. సర్ వస్తే.. గట్టిగా షేక్ హ్యాండ్.. ఇవ్వాలి అనుకుంటుంది వసు. ఇంతలో రిషి వస్తాడు. అన్నింటిని థ్యాంక్స్ సర్..అని చేతులు గట్టిగా పట్టుకుంటుంది. కానీ ఇదంతా కల అని తరువాత తెలుస్తుంది.రిషి సర్ రాలేదా? ఇదంతా నా ఊహానా?అని వసు అనుకుంటుంది.

    ఇంతలో రెండు కాఫీలను తీసుకుని రిషి వస్తాడు.. కూర్చో కూర్చో పర్లేదు.. అని రిషి అంటాడు. కాఫీ తీసుకో.. అని రిషి అంటే.. మీరేంటి సర్.. ఇలా అని వసు అడుగుతుంది. నేను కాఫీ ఇస్తే తాగవా..అని అంటాడు. రెస్టారెంట్లో నేను గెస్ట్.. నువ్ కాఫీ ఇస్తావ్.. ఇక్కడ నువ్ గెస్ట్ నేను ఇస్తాను..అని అంటాడు. కాలు బాగా నొప్పిగా ఉందా?. సారీ వసుధార.. మా ఇంటికి రాగానే ఇలా జరిగింది.. అని రిషి అంటాడు.

    ఏదో అనుకోకుండా జరిగింది.. అని వసు అంటుంది. కాఫీ బాగుందా అని అడుగుతాడు రిషి.. బాగుంది మీరు చేశారా? అని వసు అంటే.. నేను చేయలేదు కాబట్టే బాగుంది.. అని అంటాడు. పాత రోజులను వసు తలుచుకుని నవ్వుకుంటుంది. ఇక్కడ నీకేం ఇబ్బంది లేదు కదా?.. ఫీల్ ఫ్రీ..ఏం కావాలన్నా నన్నుఅడగండి.. మీరు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది పడొద్దు.. అని అంటాడు.

    రేపు ఇంటి ముందు ముగ్గు వేస్తాను.. నేను బాగా వేస్తాను.. అని జగతి అంటుంది. నేను చూడలేదు కదా? అని ధరణి అంటుంది.. రంగులు, పూలు కావాలి అని జగతి అంటే.. నేను వెళ్లి తీసుకొస్తాను.. నేనున్నాను కదా అని గౌతమ్ అంటాడు. మరో వైపు వసు కూడా ఇలానే ఆలోచిస్తుంది. ఇంటి ముందు ముగ్గులు వేయడం నాకు ఇష్టం.. నేనే వేసేదాన్ని కానీ కాలికి దెబ్బ తగిలింది.. అని వసు అంటుంది. ఏం పర్లేదు వదిన వేస్తుంది..అని అంటాడు. రంగులు కావాలని అడుగుతుంది వసు. తీసుకొస్తాను అని రిషి అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    Leave a Reply