- January 21, 2022
Guppedantha Manasu నేటి ఎపిపోడ్.. గుండెలను మెలిపెట్టే సీన్.. జగతి కన్నీరు, మారనున్న రిషి

గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 21న శుక్రవారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Epiosde 353 ధారావాహికలో అందరినీ కంటతడి పెట్టించే సీన్లు పడ్డాయి. కన్నతల్లిని మాటలతో రిషి ఎంతలా బాధపెడతాడో, తండ్రి కోసం రిషి కొత్త నిర్ణయం తీసుకోబోతోన్నాడా? అనేట్టుగా సాగింది. ఇక దేవయాణి నాటకాలు శరామామూలే. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ అంతా కూడా ఎమోషనల్‌గా సాగింది.
చెప్పేవన్నీ చెప్పి దారులన్నీ మూసేసి.. ఇప్పుడు చెప్పమంటున్నావా రిషి అని జగతి లోలోపల బాధపడుతుంది.. నాకు బాధలు కొత్త కాదు.. కానీ మహేంద్రకు కొత్త.. ఏదో సమస్యతో బాధపడుతున్నాడు అని జగతి అంటుంది.. సమస్యను కనిపెట్టిన వారు.. పరిష్కారం కూడా అనుకునే ఉంటారు కదా? అని రిషి కౌంటర్లు వేస్తాడు. నేనేం అనుకోలేదు.. మహేంద్రను అపురూపంగా చూసుకోవాలి అని రిషికి జగతి చెబుతుంది..
తను నా డాడ్., నా హీరో. ఆయన్ను ఎలా చూసుకోవాలో.. మీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు.. మీరు లేని రోజులు, రానన్ని రోజులు.. ఎవరు చెబితే చేశాను.. మీరు హితబోధ చేసేందుకు ప్రయత్నించకండి.. అని నానా రకాలుగా మాటలు అని జగతిని బాధపెడతాడు. డాడ్ మనసులో మీరే ఏదో ఒక సమస్యను నింపారేమో.. వసు విషయంలో నా ప్రమేయం ఉందని మీరే డాడ్‌కి చెప్పారేమో.. అయినా వసు మీద అనవసరమైన ఒత్తిడి పెరగొద్దనే అలా చేయమన్నాను కానీ మీ మీద కోపంతో కాదు.. ఈ విషయాన్ని డాడ్‌కి చెప్పారా? లేదా?.. అని రిషి అడుగుతాడు.
ఇంతలో వసు అక్కడికి వస్తుంది. వసు మా మాటలు విందా?. అని రిషి కంగారు పడతాడు. మహేంద్ర సర్.. మీ ఇద్దరనీ రమ్మన్నారు.. అని వసు చెబుతుంది. దీంతో జగతి వెళ్తుంది. కారులో గౌతమ్, ఫణీంద్ర, దేవయాణి, ధరణిలు వస్తుంటార. ప్రమాదం తప్పింది అని గౌతమ్ అంటే.. చాలా భయపడ్డాను.. మొత్తానికి ప్రమాదం తప్పింది అని ఫణీంద్ర అంటాడు.
పెద్ద గండం తప్పిపోయిందని అని ధరణి అంటుంది. గండం ఎందుకు వచ్చిందో అని మాత్రం ఆలోచించడం లేదు అని దేవయాణి సెటైర్లు వేస్తుంది. అసలు నిజం మాత్రం తెలుసుకోవడం లేదు అని దేవయాణి అంటే.. అసలు నిజం ఏంటి పెద్దమ్మ అని గౌతమ్ అడుగుతాడు. దీంతో ఫణీంద్ర ఏదో కవర్ చేస్తాడు. ఇదంతా మిషన్ ఎడ్యుకేషన్ వల్లే.. అని దేవయాణి ఏదేదో అంటుంది. మహేంద్రకు అలా అయిందని మేం బాధపడుతుంటే.. ఇలా మాట్లాడతావేంటి.. సైలెంట్‌గా ఉండు అని ఫణీంద్ర చురకలు అంటిస్తాడు.. దొరికిందే చాన్స్ అని చిన్నత్తయ్యను ఈ పెద్దత్తయ్య ఇంకా ఎంత సాధిస్తుందో.. అని ధరణి మనసులో అనుకుంటుంది.
ఇక మహేంద్ర వద్దకు రిషి వస్తాడు. జగతి అంత దూరంలోనే నిల్చుంటుంది. పర్లేదు రా అని మహేంద్ర అంటాడు. ఏంటి మహేంద్ర.. ఇంత దాక తెచ్చుకున్నావ్.. అని జగతి అంటుంది. నాకేం అవుతుంది. రిషి ఉన్నాడు.. నువ్ ఉన్నాడు. అయితే నీ దగ్గరుంటా.. లేదంటే రిషి దగ్గరుంటే.. నాకేం జరిగినా మీరు చూసుకుంటారు కదా? అని మహేంద్ర అంటే.. అలా మాట్లాడకండి డాడ్ అని అంటాడు రిషి..
మీకు చాలా సార్లు కాల్ చేశాను సర్.. అని జగతి అంటుంది. ఫోన్ దూరంలో ఉంది అని రిషి చెబుతాడు.. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నావ్ కదా? అలిసిపోయినట్టున్నావ్ వెళ్లు జగతి అని మహేంద్ర అంటే.. మీరు వెళ్లండి మేడం.. అని రిషి కూడా అనేస్తాడు. కాస్త రెస్ట్ తీసుకో.. అని మహేంద్ర అంటాడు. ఇప్పటికీ అందరికీ దూరంగా ఉన్నాను.. చాలా దూరంగా వెళ్లిపోయాను.. ఇక రెస్ట్ అంటావా? 22 ఏళ్లకు పైగా ఒంటరిగా రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను..అని జగతి ఎమోషనల్ అవుతుంది.
మహేంద్ర.. ఇలాంటి పరిస్థితిలో నేనుంటే విడిచి వెళ్తావా? వెళ్లవు కదా? నాకు బుల్లెట్ తగిలినప్పుడు నువ్ ఎంత ఆరాటపడ్డావో.. టెన్షన్ పడ్డావో.. గుర్తుందా?. ఎవరు వద్దన్నా.. అందరినీ ఎదురించి.. అక్కడే ఉన్నావ్ కదా? రాత్రంతా… అప్పుడు నువ్ వదిలి ఎందుకు వెళ్లలేదు.. ఇప్పుడు నేనూ అందుకే వదిలి వెళ్లలేను..అని జగతి అంటుంది. బాగా అలిసిపోయినట్టున్నావ్.. అని మహేంద్ర అంటాడు.
నువ్ అలిసిపోతోన్నావ్ మహేంద్ర.. సమస్యలు, నిందలు, సూటిపోటి మాటలు, ప్రశ్నలు అడిగితే చెప్పలేని పరిస్థితి వీటన్నంటిని అందమైన చిరునవ్వుతో కప్పుకుని నువ్ అలిసిపోతోన్నావ్.. అని జగతి అంటంది. డాడ్ గురించి ఈ కోణంలో నేను ఎందుకు ఆలోచించలేకపోయాను.. చిరునవ్వుల వెనుకున్న విషాదం నాకు ఒక్కదానికే తెలుసు మహేంద్ర..అని జగతి అంటుంది.
నన్ను ఎందుకు సడెన్‌గా గొప్పవాడిని చేస్తున్నావ్ అని మహేంద్ర నవ్వుతూ అంటాడు.. ఈ మాటలతోనే మాయ చేస్తావ్.. నా భుజానికి బుల్లెట్ తగిలితే నీ గుండెకు తగిలినంత బాధపడ్డావ్.. మనం దూరమైనందుకు స్త్రీగా నాకు అన్యాయం జరిగిందని అంటారు..కానీ నలిగిపోతోన్న మనసు.. వెలిగిపోతోన్న నీ మొహం.. నీ బాధ ఎవరికి తెలుసు మమేంద్ర.. నాకు తెలుసు.. నా ఒక్కదానికే తెలుసు..అని జగతి ఏడ్చేస్తుంది.
నన్ను వదిలి వెళ్లింది.. నాకు శిక్ష పడిందని నేను అనుకన్నాను.. నా కంటే పెద్ద శిక్ష డాడ్‌కి పడిందా? సరదాగా ఉండే డాడ్ గురించి నేను ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాను.. నేను ఒప్పుకోకపోయినా.. నాకు జన్మనిచ్చిన జగతి మేడంని దూరం పెడుతూ.. డాడ్‌ని శిక్షిస్తున్నానా? డాడ్ కోసమైనా ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చిందా?..అని రిషి ఆలోచనలో పడతాడు. అదే సమయంలో దేవయాణి వస్తుంది.
ఇక కన్నీరు కారుస్తూ నాటకాలు మొదలుపెడుతుంది. గతాన్ని తవ్వి తీస్తుంది. నీ కష్టాలు పోయాయ్ అని అనుకున్నా.. ఇంకా పోలేదన్న మాట అని జగతిని చూస్తూ దేవయాణి కౌంటర్ వేస్తుంది.. మహేంద్ర నువ్వేం టెన్షన్ పడకు.. మేం అంతా ఉన్నాం కదా? అని ఫణీంద్ర అంటాడు. మనం అంతా ఏంటి.. ఉన్నదే మనం కదా? అని దేవయాణి అంటుంది.
రిషిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది మనమే కదా? మధ్యలో వచ్చిన వాళ్లు మధ్యలోనే వెళ్తారు కదా?.. కని వదిలిపోతే.. కన్నబిడ్డలా నేనే చూసుకున్నాను.. మహేంద్ర.. నువ్ ఇలా చేసుకుంటే ఎలా చెప్పు.. రిషి అన్యాయం అయిపోతాడు కదా. రిషికి ఎవరుంటారు చెప్పు.. అమ్మానాన్న అన్నీ నువ్వే కదా?. అని దేవయాణి ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది. మహానటికే నటన నేర్పగలరు అత్తయ్య గారు అని ధరణి లోలోపల అనుకుంటుంది.. డాడ్ బాగానే ఉన్నారు కదా? పెద్దమ్మ.. మీరు ఏడ్వకండి.. మీరు ఏడిస్తే నేను చూడలేను.. అని రిషి మాటలకు జగతి ఫీలవుతుంది. ఇక అక్కడి నుంచి జగతి బయటకు వచ్చేస్తుంది.
మేడం.. మీరు బయటకు వచ్చేశారేంటి.. అని వసు అంటుంది. వాళ్ల కుటుంబ సభ్యులు వచ్చేశారు కదా? అని జగతి అంటే.. మీరు కూడా అదే కుటుంబ సభ్యులు కదా? అని వసు బదులిస్తుంది. ఈ మాట నువ్వంటే సరిపోదు.. వారు ఎప్పుడో నా సభ్యత్వాన్ని రద్దు చేశారు కదా? ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం.. కావాలంటే ఉద్యోగాన్ని అడుక్కోవచ్చు. కానీ తల్లి స్థానాన్ని, భార్య స్థానాన్ని అడుక్కోలేం.. సంస్థలోంచి తీసేస్తే అడిగే హక్కు.. అమ్మ పోస్ట్ తీసేస్తే అడిగే హక్కు లేదు..అని జగతి ఫీలవుతుంది.
నాకు ఇక్కడ బోర్ కొడుతోంది. ఇంటికి తొందరగా వెళ్దాం పదా.. అని మహేంద్ర అంటాడ. ధరణి ఏం చూస్తున్నావ్.. ఫ్రూట్స్ ఇవ్వు అని దేవయాణి అంటుంది.. ఏం వద్దమ్మా.. ఓ కాఫీ ఇవ్వు ఇంటికెళ్లాక అని మహేంద్ర అంటాడు. ఇకపై అలాంటివేం కుదరవు.. నేను చెప్పిందే తినాలి అని రిషి అంటే.. అవును మేం చెప్పిందే తినాలి అని దేవయాణి అంటుంది. అలా మొత్తానికి సరదాగా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మహేంద్రను ఇంటికి తీసుకొస్తారు. కానీ జగతి మాత్రం బయటే నిల్చుండిపోతుంది. ఈ గడప దాటి లోపలకు ఎప్పుడు వస్తావ్ జగతి అని మహేంద్ర లోలోపల అనుకుంటాడు. ఈ గడప దాటి రాగలనా? అని జగతి అనుకుంటుంది. ఇక రిషి మాత్రం ఏదో కొత్త నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.