- January 18, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. మహేంద్ర కోసం తల్లడిల్లిన జగతి.. రిషి గుండెబద్దలు

గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా కాస్త ఉత్కంఠభరితంగానే సాగింది. Guppedantha Manasu Epiosde 350 నాటి ధారావాహికలో మహేంద్రకు గుండెనొప్పి రావడం, జగతి ఒంటరిగా ఉండటం, రిషి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అక్కడేమో రిషి గౌతమ్ ఆటలు ఆడుతూ ముచ్చట్లలో తేలిపోతోంటారు. ఇక వసుకి ఫోన్ చేయడం, ఇద్దరూ కలిసి హాస్పిటల్లో జాయిన్ చేయడం వంటి సీన్లతో ఎపిసోడ్ ముందుకు సాగుతుంది.
వసు, రిషి ఒంటరిగా ముచ్చట్లు పెడుతుంటే.. అక్కడికి గౌతమ్ వస్తాడు. ఏంట్రా ఇది.. నన్నేమో కేబిన్‌లో ఉండమన్నావ్.. నువ్వేమో ఇక్కడ ఇలా ఉన్నావ్ అని గౌతమ్ కౌంటర్ వేస్తాడు. నువ్ నోర్మూయ్ రా.. వసు నువ్ వెళ్లిపో అని రిషి అంటాడు. ఉండ వసుధార అని గౌతమ్ అంటాడు. వెళ్లు అని రిషి మరోసారి అంటాడు. దీంతో వసు వెళ్లిపోతుంది. గౌతమ్, రిషిలు ముచ్చట్లు పెట్టుకుంటారు.
అక్కడేమో జగతి మహేంద్రలు ముచ్చట్లు పెట్టుకుంటూ తెగ నవ్వుకుంటారు. దేవయాణి మొహం ఎలా మాడిపోయిందో వివరిస్తూ మహేంద్ర ఫుల్లుగా నవ్వుకుంటాడు. అలా ఒకరిని బాధ పెట్టి నవ్వకూడదు అని జగతి అంటుంది. అలాంటివేం లేవు అని మహేంద్ర జరిగిన విషయాన్ని చెబుతూ పగలబడి నవ్వేసుకుంటాడు.
ఇక కాలేజ్‌లో బాస్కెట్ బాల్ ఆడుతూ రిషి, గౌతమ్‌లు పరోక్షంగా పంచ్‌లు వేసుకుంటూ ఉంటారు. ఆటలో అయినా జీవితంలో అయినా గెలుపోటములుంటాయ్.. అని రిషి అంటాడు. నన్ను గెలవనివ్వొచ్చు కదా? అని అంటాడు. ఆటైనా జీవితమైనా గెలవడం మన చేతుల్లోనే ఉంటుంది.. అని రిషి కౌంటర్లు వేస్తాడు. తప్పుడు దారిలో వెళ్తే నేను అడ్డమొస్తాను.. నిన్ను వెళ్లనివ్వను అంటూ రిషి సెటైర్ వేస్తాడు.
ఇక జగతి మహేంద్రలు మరింత నవ్వుకుంటూ ఉంటారు. మహేంద్రకు ఎంత చెప్పినా వినడు. అంతగా నవ్వొద్దు.. మళ్లీ ఏడ్వాల్సి వస్తుంది అని జగతి అంటుంది. అలాంటిదేం ఉండదు. నవ్వాలని అనిపించినప్పుడు నవ్వాలి అంతే అని మహేంద్ర అంటాడు. దేవయాణి పరిస్థితి గురించి చెబుతూ మహేంద్ర నవ్వేస్తాడు. ఇక అదే సమయంలో మహేంద్రకు గుండె నొప్పి వస్తుంది.
కుప్పుకూలిపోతాడు మహేంద్ర. అది చూసి జగతి తల్లడిల్లిపోతోంది. కంగారులో ఏం చేయాలో తెలీదు. వసుకి ఫోన్ చేస్తుంది. తను లిఫ్ట్ చేయదు. అంబులెన్స్‌కు ఫోన్ చేస్తుంది. రిషి రిషి అని మహేంద్ర పరితపిస్తాడు. రిషికి జగతి ఫోన్ చేస్తుంది. కానీ ఆటలో నిమగ్నమై ఆ ఫోన్‌ను చూసుకోడు. ఆ తరువాత వసు వస్తుంది. ధైర్యం చెబుతుంది. రిషి సర్కి ఫోన్ చేశారా? అని వసు అడిగితే.. చేశాను కానీ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ జగతి చెబుతుంది.
ఇంతలో అంబులెన్స్ వస్తుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మరో వైపు రిషి, గౌతమ్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్ నా ఫ్రెండ్‌విరా.. వెళ్లే దారిలో ముళ్లున్నాయని తెలిసినప్పుడు ఆపుతాను కదా? నువ్ మూర్ఖత్వంతో వెళ్తుంటే.. నేను ఫ్రెండ్‌లా ఆపుతాను కదా? అని రిషి అంటాడు. ఇంతలో గౌతమ్‌కు వసు నుంచి ఫోన్ వస్తుంది. జరిగిన విషయాన్ని గౌతమ్‌కి వసు చెబుతుంది.
అసలు విషయం చెప్పకుండా రిషిని కారు ఎక్కించుకుని తీసుకెళ్తాడు. వసు ఏం చెప్పింది.. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. ఎందుకు ఇంత స్పీడ్‌గా వెళ్తున్నాం అని ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తాడు రిషి. హాస్పిటల్‌కు రమ్మంది.. వివరాలేం చెప్పలేదు అని గౌతమ్ అబద్దమాడతాడు. హాస్పిటల్లో జగతి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి వసు ఇదంతా మహేంద్రకు హార్ట్ ఎటాక్ రావడం ఏంటి?. నా కంటూ ఈ లోకం పలకరించే వాళ్లు ఎవరున్నారు వసు.. మహేంద్రకు ఏమైనా అయితే.. అని జగతి కన్నీరుమున్నీరు అవుతుంది. సార్ క్షేమంగా ఉంటారు.. ఏం కాదు మేడం అని వసు ధైర్యం చెబుతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో రిషికి అసలు విషయం తెలుస్తుంది. తండ్రికి హార్ట్ ఎటాక్ అని తెలియడంతో రిషి గుండె బద్దలవుతుంది.