• January 8, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. తండ్రిపై రిషి ప్రేమ.. కొడుకు కోసం జగతి ఆరాటం

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. తండ్రిపై రిషి ప్రేమ.. కొడుకు కోసం జగతి ఆరాటం

    గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ అంటే శనివారం నాటి Guppedantha Manasu Epiosde 342 ధారవాహికలో తండ్రి కొడుకుల బంధం, కొడుకు కోసం తల్లి పడే తపనను చూపించారు. ఇక వసు కోసం గౌతమ్ చేసే ఓవర్ యాక్షన్, దాన్ని కట్టడి చేసేందుకు రిషి చేసే పనులతో ముందుకు సాగింది. మొత్తానికి గౌతమ్‌కి మాత్రం రిషి మీద అనుమానం మొదలైంది. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా గడిచింది.

    ఇక గౌతమ్ అందరి కంటే లేటుగా వచ్చాడు. దీంతో మహేంద్ర బుక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఎక్కడికో వెళ్తున్నా? అన్నావ్.. ఇక్కడికి వచ్చావేంటి? అని మహేంద్ర అడుగుతాడు. అందరి ముందు అడగాలా? అంకుల్ అని లోలోపల గౌతమ్ అనుకుంటాడు.. వెళ్లిన పని కాలేదు అందుకే ఇటు వచ్చాను.. మేడం అని గౌతమ్ అంటాడు. ఏంటి వాటర్ కావాలా? అని జగతి అంటుంది.

    మీకెలా తెలిసింది మేడం అని గౌతమ్ అంటాడ. నాకు ఇప్పుడు అర్థమైంది నీళ్లకు కరువు వచ్చిందని జగతి లోలోపల అనుకుంటుంది.. వద్దులేండి నీళ్లు ఇక్కడే ఉన్నాయ్ అని రిషి వద్దకు గౌతమ్ వెళ్తాడు. ఎందుకు వచ్చావ్ రా అని రిషి అడుగుతాడు. నువ్ ఎందుకు వచ్చావ్ రా అని గౌతమ్ రివర్స్ ప్రశ్నిస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ పని ఉండి వచ్చాను.. అని రిషి అంటే.. నమ్మొచ్చా? అని రిషి అనుమానిస్తాడు. నిన్ను నమ్మించే అవసరం నాకు లేదు.. అని రిషి అంటాడు.

    కాఫీ తీసుకురా వసు అని జగతి చెబితే.. కాలేజ్ వర్క్ కోసం వచ్చాం అలాంటివేమీ వద్దని రిషి అంటాడు. అవును కాఫీలు వద్దు ఈ టైంలో మిర్చీ బజ్జీలు, పకోడిలాంటివి ఉంటే బాగుంటాయ్ అని మహేంద్ర అంటాడు.. మిర్చీ బజ్జీలుంటే బాగుంటాయ్.. అని వసు కూడా అంటుంది. గుడ్ ఐడియా అని గౌతమ్ అంటాడు.. ఏంట్రా గుడ్ ఐడియా.. వర్క్ కోసం వచ్చాం.. పిక్నిక్‌కి కాదు అని అంటాడు. కనీసం బ్రెడ్ ఆమ్లేట్ అని గౌతమ్ అంటే.. షటప్ అని రిషి అంటాడు. కనీసం కాఫీ అని గౌతమ్ అంటే నో అని రిషి అరిచేస్తాడు.

    సరే అంకుల్.. మీరేంటి ఇక్కడ.. ఇంతకు ముందు కూడా కనిపించారు.. నాలానే చనువుగా మిర్చీ బజ్జీ, పకోడి అంటున్నారు.. మేడం మీరు కాలేజ్ మేట్స్ అనుకుంటున్నా..అందుకే అంత ఫ్రీగా ఉంటున్నారా? అని జగతి, మహేంద్రలను గౌతమ్ అడుగుతాడు. పెద్దవాళ్లను అలా అడగొచ్చా?.. అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు రిషి. నేనేం అడిగాన్రా అని గౌతమ్ అంటుంటే. నోర్మూయ్.. అని రిషి అనేస్తాడు.

    నువ్ ఎందుకు వచ్చావో ముందు చెప్పరా? అని రిషి ప్రశ్నిస్తాడు. నువ్ ఎందుకు వచ్చావ్ రా అని గౌతమ్ ప్రశ్నిస్తాడు. చెప్పాను కదా?. మిషన్ ఎడ్యుకేషన్ గురించేనని రిషి అంటే.. నేను కూడా అందుకే వచ్చాను.. షార్ట్ ఫిల్మ్ ఐడియాలు నాక్కూడా వస్తాయ్ కదా.. అని పెన్ డ్రైవ్‌ని ఇస్తాడు గౌతమ్. ఏంటి అంకుల్ ప్లాన్స్..అందరం కలిసి అలా బయటకు వెళ్దామా? అని గౌతమ్ అంటే.. పెద్దమ్మ ఈ రోజు ఇంట్లో స్పెషల్ చేసింది.. ఎక్కడికి లేదు అని రిషి అంటాడు.. అలా వెళ్లి ఏదైనా తిందాంరా.. అని గౌతమ్ అంటాడు.. ఎలాంటి ప్రోగ్రామ్స్ లేవు.. తమరు వెళ్లొచ్చు.. అని రిషి అంటాడు. ఎలారా? అని గౌతమ్ అడిగితే ఇలా అని మహేంద్ర కారు కీని ఇస్తాడు. మరి అంకుల్ ఎలా వస్తారు అని అడుగుతాడు.. నా కారులో వస్తారు.. ఇంకొక్క మాట మాట్లాడితే క్యాబ్ బుక్ చేస్తాను..అని గౌతమ్‌కు రిషి వార్నింగ్ ఇస్తాడు. వద్దులే ఇదే బెటర్.. అని గౌతమ్ వెళ్తుంటాడు. మీ పని అయిపోయిందా? అని గౌతమ్ అడుగుతాడు. బ్యాలెన్స్ వర్క్ మళ్లీ చూద్దాం.. వసుధార అని రిషి కూడా బయల్దేరుతాడు.

    కారులో మహేంద్ర, రిషి వెళ్తుంటారు. గౌతమ్ మాటలను తలుచుకున్న రిషి.. కారు ఆపేస్తాడు. తండ్రిని దిగమంటాడు. సారీ డాడ్ అని చెబుతాడు. గౌతమ్ మాటలకు నేు ఫీల్ అయ్యానేమోనని నువ్ ఫీల్ అవుతున్నావా? అని రిషిని మహేంద్ర అడుగుతాడు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెబుతాను. కానీ నేను సమాధానం చెబితే మీరు ఇంకా బాధపడతారు.. అందుకే అక్కడ ఏం మాట్లాడలేదు అని రిషి అంటాడు.

    ఇవన్నీ జరగడానికి నేనూ కూడా ఓ కారణం.. సారీ రిషి అని మమేంద్ర అంటాడు. ప్రపంచంలో మీరు నాకు తప్పా ఎవ్వరికి సారీ చెప్పినా బాధపడతాను.. అలా అని నాకు కూడా సారీ చెప్పాల్సిన పని లేదు..యూ ఆర్ మై హీరో.. నా జీవితంలో మీరే నా హీరో.. మీరు ఏ తప్పూ చేయలేదు.. తల దించుకోవాల్సిన పనిలేదు.. బాధపడాల్సిన పని లేదు.. మీకు ఎప్పటికీ నేను రక్షణగా ఉంటాను.. ఒక్క మాట అనాలంటే నన్ను దాటి వెళ్లాల్సిందే.. ఈ విషయంలో మీకు నేనేం సలహాలు ఇవ్వను.. వెళ్లమని అనను.. వెల్లొద్దని అనలేను.. మీ మనసుకు నచ్చింది మీరు చేయండి.. మీరేం చేసినా యూ ఆర్ మై హీరో.. అని తండ్రి మీద ప్రేమను కురిపిస్తాడు రిషి.

    గౌతమ్ మాటలు తలుచుకున్న వసు.. పెన్ డ్రైవ్‌ను పట్టుకుని చూస్తుంటుంది. రిషి, గౌతమ్ మాటలు తలుచుకున్న జగతి.. వసుతో తన బాధను చెప్పుకుంటుంది. రిషిలో నీకు సహనం, కోపంలో ఏది ఇష్టమని వసుని జగతి అడుగుతుంది. నాకు సహనం ఇష్టం మేడం అని వసు చెబితే.. నాకు కోపమే ఇష్టమని జగతి అంటుంది.. రిషి రిషిలానే ఉంటేనే బాగుంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకుని.. మహేంద్ర కోసం భయపడుతూ..చెడ్డపేరు వస్తుందని.. రిషి పడిన ఆరాటం నేను చూశాను వసు.. తల్లిగా నా మనసుకు ఎంతో బాధ వేసింది..

    నిజమైన కష్టమంటే మనకు కష్టాలు రావడం కాదు.. మనకు ఇష్టమైనవాళ్లు కష్టపడుతుంటే ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంటాం అదే అసలైన కష్టం.. రిషి నన్ను ద్వేషించడంలో తప్పు లేదు.. కథలు, కబుర్లు చెప్పే, అమ్మ ప్రేమకు దూరమయ్యాడు.. అన్నీ మిస్ అయ్యాడు.. రిషి ద్వేషంలో న్యాయం, కోపంలో నిజం ఉంది.. మా ఇద్దరి గురించి గౌతమ్‌కి తెలియకూడదని పడ్డ తపన నాకు బాధగా అనిపిస్తోంది.. బాల్యాన్ని అందంగా మార్చలేదు.. భవిష్యత్తుని కొంతలోకొంతైనా అందంగా చేయాలి అని జగతి బాధపడుతుంది.. మేడం ఆ రోజు తప్పకుండా వస్తుంది.. అని వసు ధైర్యం చెబుతుంది.

    ఇక ఇంట్లో వసు బొమ్మను చూసుకుంటూ గౌతమ్ ఊహల్లో తేలిపోతాడు. ఇంకా పడుకోలేదా? అని రిషి అడుగుతాడు. నామీద కాన్సన్‌ట్రేట్ చేశావా? పరిగెత్తుంటేకాళ్ల మధ్యలో కాళ్లు పెట్టి పడేస్తున్నావ్ కదా? అని గౌతమ్ అంటాడు.. కాళ్ల మధ్య కాళ్లు పెట్టినా ఆగుతున్నావా? యమజాతకుడిని అని ఫీలింగ్.. దూసుకుపోతోన్నావ్ కదా? అని రిషి సెటైర్ వేస్తాడు. స్పీడు బ్రేకుల్లా నువ్ అడ్డు పడుతూనే ఉన్నావ్ కదా? ఇది బాగా లేదు.. దూకుడు బాగాలేదు.. అదీ ఇదీ అని చెప్పకు.. అని గౌతమ్ అంటాడు.

    చెప్పనురా..అని రిషి అంటే.. ఎందుకు చెప్పవురా అని గౌతమ్ అంటాడు.. హెల్ప్ చేయ్.. ఇలా అడ్డుపడకు.. అని గౌతమ్ అంటాడు. దేనికి సపోర్ట్.. చేయాలో.. దేనికి చేయకూడదో నాకు తెలుసు అని రిషి అంటాడు. నువ్వెంటో అర్థం కావురా.. నీ మీద కోపం వస్తుంది అరవలేను.. విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాను.. ఓ పని చేస్తాను.. ఏ పని అని అడగవేంట్రా?..అని గౌతమ్ అంటాడు. చెబితే చెప్పు లేకపోతే లేదు.. గుడ్ నైట్ అని రిషి వెళ్లిపోతాడు. అప్పుడప్పుడు ఏ ఎమోషన్స్ లేనట్టుంటాడు.. కానీ గుడ్ ఫ్రెండ్.. మొండిఘటం.. కొరుకుడుపడడు. వెధవ.. అయ్యో వసుధార.. నా ప్రేమకు అందరూ విలన్స్‌లా తయారయ్యారు.. నా మనసులో నువ్ ఉండగా.. నీ కళ్లు నేను గీయలేకపోయాను.. కానీ రిషి ఎలా ఈ బొమ్మను గీశాడు అనే అనుమానం మొదలవుతుంది గౌతమ్‌కి. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక వచ్చే వారం ఎపిసోడ్‌లో ఏకంగా వసుధారకి లవ్ లెటర్ రాయాలి.. ఒకటి రాసి పెట్టమని రిషినే గౌతమ్ అడిగేస్తాడు. దీంతో రిషి షాక్ అవుతాడు.

    Leave a Reply