- December 6, 2021
Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. ఆటోలో మ్యాటర్.. రిషి వసు ప్రయాణం ఎక్కడి వరకో?
గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ అంటే.. సోమవారం జరిగే ధారావాహిక.. అంటే.. Guppedantha Manasu Epiosde 313 ఎలా ముందుకు సాగిందో చూద్దాం. మంత్రి గారు ఏర్పాటు చేసిన వన భోజనాల చుట్టూ గత రెండు మూడు రోజులుగా ఎపిసోడ్ చక్కర్లు కొడుతోంది. ఇక సోమవారం నాటి ఎపిసోడ్‌లోనూ అక్కడ జరిగిన కొన్ని సీన్లు అదిరిపోయాయి. మన రిషి చెట్టెక్కి ఊయల కట్టేస్తాడు.. రిషి, వసులు కలిసి ఆటోలో అటూ ఇటూ మీద పడుతూ ప్రయాణించారు. అలా గుప్పెడంత మనసు సీరియల్ ముందుకు కొనసాగింది.
గత వారం నాడు చెట్టెక్కి ఊయల కట్టలేక వసు.. రిషి మీద పడుతుంది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో రిషి చెట్టెక్కేస్తాడు. ఊయల కడతాడు. తన వదిన ధరణిని ఊయల్లో కూర్చోబెట్టి ఊపేస్తాడు. ఇంతలోపు మంత్రి వస్తాడు. అందరూ మంత్రిని స్వాగతించేందుకు వెళ్లారు. నమస్కారం మంత్రి గారు అని ఫణీంద్ర, మహేంద్రలు వస్తారు. ఫణీంద్ర గారు నమస్కారం అంటూ మంత్రి కూడా తిరిగి నమస్కారం పెట్టాడు..
మీరు వస్తారని అనుకోలేదని మంత్రి అంటే.. మీరు పిలిచాక.. రాకపోవడం అంటూ ఉంటుందా? అని ఫణీంద్ర అంటాడు. అలా అని కాదు..మీకు మీ పనులు ఉంటాయ్ కదా? అని మంత్రి అంటాడు. మీ కుటుంబాన్ని చూస్తే నాకు ముచ్చటేస్తుందండి.. అందరూ కలిసి కాలేజ్‌ని ముందుకు తీసుకెళ్తున్నారు అని మహేంద్రను పొగుడుతాడు. ఇక మంత్రి దండం పెట్టడంతో దేవయాణి కూడా దండంపెడుతుంది.
కానీ మంత్రి దండం పెట్టింది.. జగతికి. జగతి మేడం నమస్కారం.. అందరినీ ముందుండి నడిపించే మీరు.. వెనక నిల్చున్నారేంటి.. ముందుకు రండి.. రండి మేడం.. అద్భుతమైన ఆలోచనలతో అందరికీ చదువును ఇప్పిస్తున్నారు.. మిషన్ ఎడ్యుకేషన్ రూపకర్త అని జగతిని ప్రశంసలతో ముంచెత్తాడు మంత్రి.. మీరు ఇలానే కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్లండి.. ప్రతీసారి చెబుతున్నా మాటే.. మళ్లీ మళ్లీ చెబుతున్నా.. మా నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తీసుకోండి.. మీ ఆలోచనలు అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి..అని జగతిని మరింత పొగిడేశాడు.
యంగ్ అండ్ డైనమిక్ రిషి ఎక్కడా? అని మంత్రి అడగడం.. వచ్చాడు సర్.. ఇక్కడే ఎక్కడో ఉన్నాడు.. తీసుకొస్తాను సర్ అని మహేంద్ర అక్కడి నుంచి వస్తాడు. ఇక ధరణిని ఊయల ఊపుతున్న రిషిని చూసి మహేంద్ర ఆశ్చర్యపోతూ ఆనంద పడతాడు. ధరణి ప్లేస్‌లో వసు ఉన్నట్టుగా, రిషి ఊయల ఊపుతున్నట్టుగా కల కంటాడు మహేంద్ర. ఇక మహేంద్ర, జగతిలు ఊయలాటలు ఆడుకుంటున్నట్టుగా వసు కల కంటుంది.
తక్కువ వయసులోనే ఎంతో సాధించావ్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. రుష్యేంద్ర భూషణ్ అంటూ రిషిని మంత్రి పొగిడేస్తాడు. అయితే వసు, పుష్పలు ఏదో మాట్లాడుకోవడం, వసు కంగారు బయటకు వెళ్లడం చూసి రిషి కూడా వెనకే ఫాలో అవుతాడు. ఆటో ఎక్కుతున్న వసుని ఎక్కడకు వెళ్తున్నావ్ అని ప్రశ్నిస్తాడు. విస్తారాకులు మరిచిపోయారట. తీసుకురావడానికి వెళ్తున్నారు అని వసు చెప్పింది. అలా ఇద్దరూ ఆటో ఎక్కి ప్రయాణించారు.
మరో వైపు తోటలో జగతి ఊయల ఊపుతుంటే ధరణి సంతోషంలో తేలిపోతుంది. ఇక ధరణి ఊగడం ఆపేసి.. జగతిని కూర్చోబెట్టి ధరణి ఊపుతుంది. ఆ సీన్ చూసి దేవయాణి కడుపు మండుతుంది. ఇళ్లు దాటగానే ఒళ్లు మరిచిపోయావా? ఈ ఇకఇకలు పకపకలు ఏంటి? అలా నవ్వకూడదని తెలియదా? కొత్త వాళ్లతో పరిచయం మొదలై.. కొత్త ఆలోచనలు, స్వతంత్రాలు వస్తున్నాయా? అని ధరణిని దేవయాణి తిట్టేసింది.
హాయిగా నవ్వుతుంటే.. సంతోషించాలి.. ఇలా మాట్లాడకూడదు.. అక్క అని జగతి అంటుంది. నువ్ నాకు నీతులు చెప్పకు.. అత్తారింట్లో గొడవలు పెట్టుకుని వెళ్లాలని, తిరుగుబాటు నేర్పిస్తున్నావా? అని దేవయాణి అంటుంది. నేను ఎందుకు ఇంటి నుంచి వెళ్లాల్సి వచ్చిందో అందరికీ తెలుసు.. అలానే ధరణికి అన్నీ తెలుసు.. చిన్న పిల్ల ఏం కాదు.. భయానికో, భక్తితోనో సైలెంట్‌గా ఉంటోంది.. ఆ గౌరవాన్ని కాపాడుకో అని జగతి అంటుంది.
మిషన్ ఎడ్యుకేషన్ పేరు చెప్పి అందరూ నిన్ను తల మీద పెట్టుకున్నారు అని దేవయాణి.. మినిష్టర్ ఇక్కడకు పిలిస్తే వచ్చాను అంటూ జగతి మాటమాట అనుకుంటున్నారు. ఇలా ఈ ఇద్దరూ గొడవపడటం ఫణీంద్ర, మహేంద్రలు చూస్తారు. నేను వెళ్తాను అన్నయ్య అని మహేంద్ర అంటే.. నువ్ వెళ్తే దేవయాణి ఇంకా రెచ్చిపోతుంది నేను వెళ్తాను అని ఫణీంద్ర వెళ్తాడు.
ఏమైంది అని ఫణీంద్ర అడుగుతాడు.. ధరణికి కొత్త కొత్త ఆలోచనలు చెబుతోంటే వద్దన్నాను అని దేవయాణి మాటలు మార్చుతుంది. నేను అలా మాట్లాడలేదు బావగారు అని జగతి అంటుంది.. ఎవరేంటో నాకు తెలుసు అంటూ దేవయాణికి పరోక్షంగా గడ్డి పెట్టేశాడు.. మర్యాదగా నడుచుకోండి.. ఇక్కడకు వచ్చి ఫ్యామిలీ విషయాలు మాట్లాడకండి.. పరువు తీయకండి అని ఫణీంద్ర వెళ్లిపోతాడు.
ఇక మరోవైపు వసు, రిషిలు ఆటో ప్రయాణం అడ్డదిడ్డంగా, ఎగుడుదిగుడుగా సాగుతుంది. ఒకరి మీద మరొకరు పడతారు.. టచింగ్స్ జరుగుతాయి.. అలా కళ్లు కళ్లు ప్లస్సు అనేలా మారిపోతుంది. అలా టచింగ్స్‌తో మ్యాటర్ మొదలయ్యేలా ఉంది. మొత్తానికి ఈ ఆటో ప్రయాణం రిషికి బాగానే నచ్చినట్టుంది. పాటలు పెట్టమని వసు అంటే.. ఎందుకు ఈ గాలి, పక్షుల సౌండ్స్ బాగున్నాయ్ కదా? అని రిషి అంటాడు. ఈ మధ్య రిషి సర్‌కి కూడా ప్రకృతి మీద ప్రేమ పెరుగుతోందే? అని వసు తన మనసులో అనుకుంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్‌లో వన భోజనాలు చేస్తుంటారు. రిషి పక్కనే జగతి కూర్చోవాల్సి వస్తుంది. అలా జగతి పక్కన మహేంద్ర కూర్చుంటాడు. అది చూసిన వసు సంబరపడితే.. దేవయాణి కడుపు రగిలిపోతుంది. ఆ ముగ్గురూ అలా కూర్చుని తింటే ఎంత బాగుందో అని ఓ ఫోటోను కూడా తీసేస్తుంది వసు. మరి రిషి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.