- January 4, 2022
ఢీ నుంచి శేఖర్ మాస్టర్ అవుట్.. కారణం చెప్పిన టాప్ కొరియోగ్రఫర్

Sekhar master-Dhee ఢీ షోకు కంటెస్టెంట్‌గా వచ్చి అదే షోకు జడ్జ్‌గా చేసే స్థాయికి శేఖర్ మాస్టర్ ఎదిగాడు. వెండితెరపై వెరైటీ స్టెప్పులు వేసే కొరియోగ్రాఫర్ బుల్లితెరపై జడ్జ్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు శేఖర్ మాస్టర్. ఢీ, జబర్దస్త్, పండుగ స్పెషల్ ఈవెంట్లలో శేఖర్ మాస్టర్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే గత కొన్ని రోజులుగా శేఖర్ మాస్టర్ ఢీ షోలో కనిపించడం లేదు.
శేఖర్ మాస్టర్‌కు బదులుగా గణేష్ మాస్టర్ ఢీ షో జడ్జ్‌గా ఫిక్స్ అయిపోయాడు. కేవలం జడ్జ్మెంట్ ఇవ్వడమే కాకుండా కంటెస్టెంట్ల ఫ్యామిలీ సమస్యలను తెలుసుకుని మరీ సాయం చేస్తుంటాడు గణేష్ మాస్టర్. అందుకే గణేష్ మాస్టర్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. అయితే శేఖర్ మాస్టర్ ఆ షో నుంచి తప్పుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు.
అక్కడి నుంచి బయటకు వచ్చిన శేఖర్ మాస్టర్ కామెడీ స్టార్స్ షోకు జడ్జ్‌గా మారిపోయాడు. అలా డ్యాన్స్ షో నుంచి కామెడీ షోకు న్యాయ నిర్ణేతగా శేఖర్ మాస్టర్ మారిపోయాడు. అయితే ఈ మధ్య శేఖర్ స్టూడియో అంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో వెరైటీ వీడియోలను షేర్ చేస్తున్నాడు.
తన పిల్లలతో కలిసి శేఖర్ మాస్టర్ ఓ వీడియోను చేశాడు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు శేఖర్ మాస్టర్, విన్ని, సాహితి సమాధానాలు ఇచ్చారు. ఇందులో ఓ నెటిజన్ ఢీ షోకు సంబంధించిన ప్రశ్నలను అడిగాడు. ఢీ షోను ఎందుకు వదిలేశారు.. ఎందుకు రావడం లేదు అని ఓ నెటిజన్ అడిగాడు. దానికి శేఖర్ మాస్టర్ సమాధానం ఇచ్చాడు. ఢీ షో అంటే తనకు ఇష్టమని, కాకపోతే ఇతర షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్లే అక్కడ మానేశాని, అంతకు మించి మరే కారణం లేదని క్లారిటీ ఇచ్చాడు.