• November 13, 2021

కూతురిని మోసం చేసిన శేఖర్ మాస్టర్!.. విన్నీ మాటలకు సాహితీ షాక్

కూతురిని మోసం చేసిన శేఖర్ మాస్టర్!.. విన్నీ మాటలకు సాహితీ షాక్

    శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఎంత సరదాగా ఉంటాడో ఇంట్లోనూ అంతే సరదాగా ఉంటాడు. కానీ సినిమాల్లో పాటలను కంపోజ్ చేసే సమయంలో, సెట్ మీదున్న సమయంలో మాత్రం శేఖర్ మాస్టర్ పని గురించి మాత్రమే ఆలోచిస్తాడట. ఎప్పుడూ ఏ మూమెంట్ వేయాలి.. ఎలా కంపోజ్ చేయాలనే ఆలోచనలతోనే ఉంటాడట. శేఖర్ స్టూడియో అనే యూట్యూబ్ చానెల్ ద్వారా శేఖర్ మాస్టర్‌లోని ఇంకో కోణాన్ని మనం తెలుసుకోవచ్చు. శేఖర్ మాస్టర్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎక్కువగా యూట్యూబ్ వీడియోల్లో దొరుకుతాయి.

    శేఖర్ మాస్టర్ కూతురు సాహితి, కొడుకు విన్నీలు బుల్లితెరపై ఫేమస్. ఎన్నో ఈవెంట్లు, ఎన్నో ప్రోగ్రాంలలో ఈ ఇద్దరూ కలిసి వచ్చారు. క్యాష్ షోలోనూ సాహితీ, విన్నీ వచ్చారు. పండుగ స్పెషల్ ఈవెంట్లో సాహితీ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు, విన్నీ ఫన్నీ స్కిట్లు వైరల్ అవుతుంటాయి. తాజాగా సాహితీఓ ఆట ఆడింది. తన గురించిఎవరికి ఎక్కువ తెలుసు.. తన మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో తెలుసుకునే క్రమంలో అందరినీ ప్రశ్నలు వేసింది. పరీక్షించింది.

    అలా తన ఫ్రెండ్స్, తమ్ముడు విన్నీకి కొన్ని ప్రశ్నలు వేసింది. కానీ సరైన సమాధానాలు చెప్పలేదు. దీంతో సాహితీ కాస్త హర్ట్ అయింది. అదే సమయంలో శేఖర్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. బాధపడుతున్న సాహితీని అసలు విషయం అడిగి తెలుసుకున్నాడు. నేను అంటే ఎవ్వరికీ ఇష్టం.. నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం, నా ఇష్టాలు ఇక్కడ ఎవ్వరికీ తెలియడం లేదు అని సాహితీ అంటుంది. నేను ఉన్నాను కద తల్లి.. నీ కంటే ఏది ఎక్కువ లేదంటూ డైలాగ్స్ విసురుతాడు.

    ఐతే కొన్ని ప్రశ్నలను అడుగుతాను. వాటికి సమాధానం చెప్పమని అంటుంది సాహితి. వామ్మో ప్రశ్నలా? అని అనుకుని.. సరే అడగమని చెబుతాడు. ఇష్టమైన ఫుడ్ ఏంటి? అని అడుగుతుంది. పంజాబీ డిషెస్ అని అంటాడు. కరెక్ట్ అని సాహితీ ఎగ్జైట్ అవుతుంది. నాకు ఇష్టమైన చిత్రం ఏంటి? అని మళ్లీ అడుగుతుంది. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా.. చిన్నప్పటి నుంచి నీకు అదే ఇష్టం. ఆ సినిమా పెడితే గానీ అన్నం తినేదానికి కావు.. చూసి చూసి సీడీలను అరగ్గొట్టేశావ్ కదా? అని అంటాడు. సంతోష్ అని అంటే నీకు ఇష్టం కదా? అని కూతురి గురించి శేఖర్ మాస్టర్ చెప్పాడు.

    ఫ్యాషన్ డిజైనర్ కాకపోతే నా బ్యాకప్ ప్లాన్ ఏంటి? అని అడుగుతుంది.ఇది కూడా ఓ ప్రశ్నేనా?.. ఈవెంట్ మేనేజర్ అని చెబుతాడు శేఖర్ మాస్టర్. ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో సాహితీ తెగ సంబరపడిపోతుంది. నాన్న నువ్ షూటింగ్‌లంటూ చాలా బిజీగా ఉంటావ్ కదా? ఇవన్నీ నీకు ఎలా గుర్తుంటాయ్ అని అడుగుతుంది. నీకంటే ఎవరు ఎక్కువ తల్లి.. నీ తరువాతే ఎవ్వరైనా అని శేఖర్ మాస్టర్ డైలాగ్స్ మీద డైలాగ్స్ వదిలేస్తాడు.

    దీంతో విన్నీ అసలు గుట్టు విప్పేస్తాడు. డాడీ.. నువ్ ఇవన్నీ మమ్మీ దగ్గర తెలుసుకుని వచ్చావ్ కదా? అని అసలు విషయం చెప్పేస్తాడు. దీంతో సాహితీ హర్ట్ అవుతుంది. దొంగ డాడీ అంటూ అలుగుతుంది. మొత్తానికి శేఖర్ మాస్టర్ అలా మోసం చేసి తన కూతురిని ఆటపట్టించేశాడు.

     

    Leave a Reply