- November 20, 2021
అక్కర్లేదన్న అషూ అలిగిన రాహుల్.. మళ్లీ టీఆర్పీ స్టంట్లు షురూ!

బుల్లితెరపై టీఆర్పీలు స్టంట్లు ఎలా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. ప్రోమోల్లో ఏదో జరిగినట్టు చూపిస్తారు. కానీ ఎపిసోడ్‌లో మాత్రం ఏమీ ఉండదు. ప్రోమోలను చూసి మోసపోయే కాలంపోయింది. ప్రోమోలను చూసి టీఆర్పీ స్టంట్లు అని అందరూ పసి గట్టేస్తున్నారు. జనాలు కూడా బాగానే ముదిరిపోయారు. అయితే తాజాగా అషూ రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్‌లతో ఓ స్టంట్ చేశారు. సుమ క్యాష్ షోలో అషూ రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్‌లు కాస్త ఎక్కువ చేసినట్టు కనిపిస్తోంది.
మామూలుగానే అషూ రెడ్డి, రాహుల్ కథ నెట్టింట్లో ఒకానొక సమయంలో తెగ ట్రెండ్ అయింది. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకోబోతోన్నారా? అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. నా గుండెల్లో రాహుల్ ఉన్నాడని అషూ చెప్పిన మాటలతో ఆ రూమర్లకు ఇంకా బలం పెరిగింది. అయితే రాహుల్, అషూలు మాత్రం తామిద్దరం మంచి స్నేహితులం, జాన్ జిగ్రీలమని చెప్పుకొచ్చారు. నా కోసం మూడు రోజులు షూటింగ్ చేసింది. కానీ ఒక్క రూపాయికూడా తీసుకోలేదని అషూ మీద తన ప్రేమను చూపించాడు రాహుల్.
సుమ క్యాష్ షోలో తాజాగా ఈ ఇద్దరూ కాస్త ఓవర్ డ్రామా చేశారు. ఏదో స్కిట్ వేసినట్టు కనిపిస్తోంది. నిజంగానే ఈఇద్దరూ గొడవ పెట్టుకున్నారా? అనేంత సీన్ క్రియేట్ చేశారు. నువ్ నాకు అక్కర్లేదు.. అంటూ అషూ అనడం. అలాంటప్పుడు ఈ షోకు నన్ను ఎందుకు పిలవడం అంటూ రాహుల్ అలిగి వెళిపోయాడు. అషూ కన్నీరు పెట్టుకున్నట్టు, సుమ కూడా ఎమోషనల్ అయినట్టు ఓవర్ మెలో డ్రామాతో రెచ్చిపోయారు. అయితే ఇవన్నీ కూడా టీఆర్పీ స్టంట్లు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.