• January 4, 2022

Priyanka Jain-Shiva Kumar: ఇంత వరకు ఎవ్వరికీ ప్రపోజ్ చేయలేదు!.. ప్రియాంక పరువుతీసిన ‘మౌనరాగం’ అంకిత్

Priyanka Jain-Shiva Kumar: ఇంత వరకు ఎవ్వరికీ ప్రపోజ్ చేయలేదు!.. ప్రియాంక పరువుతీసిన ‘మౌనరాగం’ అంకిత్

    Priyanka Jain-Shiva Kumar బుల్లితెరపై ప్రసారమైన మౌనరాగం సీరియల్ ద్వారా పరిచయమైన అంకిత్ ప్రియాంక జైన్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్లో ఎంతో అమాయకత్వంగా ఉంటూ ఎంతోమంది ప్రేక్షకాదరణ దక్కించుకున్న ప్రియాంక ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె స్టార్ మాలో ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తున్నారు.ఇకపోతే మౌనరాగం సీరియల్ ద్వారా ప్రియాంక జైన్ మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

    ఇలా మౌనరాగం సీరియల్ ద్వారా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఇకపోతే ఈ జంట. ది రెడ్ కౌచ్ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి పరిచయం గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా అంకిత్ తన లైఫ్ లో ఇప్పటి వరకు ఏ అమ్మాయి లేదని తెలిపారు.

    ఈ సందర్భంగా అంకిత్ మాట్లాడుతూ తను ఇప్పటి వరకు ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదని.. అసలు అమ్మాయిల సావాసమే వద్దని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రియాంక పరువు మొత్తం తీశారు. ఈ సందర్భంగా తను కేవలం తనకు ఫ్రెండ్ అంటూ చెప్పారు. అలాగే చివరికి తన జీవితంలో ఉన్నది అమ్మ నాన్న ఒక జైన్ అమ్మాయి అంటూ పరోక్షంగా ప్రియాంక జైన్ గురించి అంకిత్ ఈ సందర్భంగా మాట్లాడారు.

    Leave a Reply