• January 4, 2022

ఈ టార్చర్ అందరికీ ఉంటుందేమో?.. భార్య చేష్టలపై నిరుపమ్ కామెంట్లు

ఈ టార్చర్ అందరికీ ఉంటుందేమో?.. భార్య చేష్టలపై నిరుపమ్ కామెంట్లు

     

    సీరియల్ నటీనటులు నిరుపమ్, మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రముఖి సీరియల్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త పెళ్లి వరకు దారి తీసింది. ఇలా వైవాహిక జీవితంలో ఒకటైనా వీరిద్దరూ పలు సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక నిరుపమ్ కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్నారు.ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరొకవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ జంట తాజాగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు.

    ఈ వీడియోలో నిరుపమ్ మంజుల కొడుకు రిక్కీ ఏకంగా వారిద్దరి ఫోన్స్ గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే రీక్కీ తన తల్లి మంజులను ప్రశ్నిస్తూ.. మీ ఫోన్లో ఉన్న వరెస్ట్ సెల్ఫీ చూపించాలని అడిగినప్పుడు నిరుపమ్ సెల్ఫీ విషయంలో తను ఎంతో టార్చర్ అనుభవిస్తున్నానని తెలిపారు. సాధారణంగా అమ్మాయిలు ఫోటోలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా సెల్ఫీల విషయంలో ఇతరులను ఎంతో టార్చర్ చేస్తారని నిరుపమ్ చెప్పుకొచ్చారు.

    ఈ సందర్భంగా నిరుపమ్ మాట్లాడుతూ వేరే వారితో సెల్ఫీ తీసుకున్నప్పుడు ఫోన్ మనకు ఇస్తారు వాళ్ల దగ్గర మాత్రం పెట్టుకోరు. ఎందుకంటే సెల్ఫీ తీసుకున్నప్పుడు దగ్గరగా ఉంటే చాలా లావుగా కనిపిస్తారని మనకు ఇస్తారు. సరే పోన్లే అని మనకు నచ్చినట్టు సెల్ఫీ తీస్తే అలా కాదు, ఇలా కాదు, కొంచెం దూరం పెట్టు అంటూ మరొక టార్చర్ చూపిస్తారు. నాకు తెలిసి ఈ టార్చర్ మీరందరూ కూడా ఫేస్ చేసి ఉంటారు కదా అంటూ నిరుపమ్ తన భార్య చేష్టల పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

    Leave a Reply