- November 8, 2021
Karthika Deepam Epsidoe 1191 : విషయం తెలిసి దీప గుండె బద్దలైంది.. ఇక ప్రళయమేనా?
కార్తీకదీపం ఈ వారం మంచి మలుపులతో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. కార్తీకదీపం సీరియల్‌లో సోమవారం అంటే.. ఎపిసోడ్ నంబర్ 1191లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. ఆనంద్ రావు, సౌందర్యల మీద సీన్ ఓపెన్ అవుతుంది. దోష నివారణ పూజ కోసం గుడికి రమ్మంటే రావడం లేదు.. కనీసం మీరైనా చెప్పండి అని భర్త ఆనంద్ రావును సౌందర్య అడుగుతుంది. నువ్ తప్పు దారిలో వెళ్తున్నావ్.. దీప అంటే ఇష్టమన్నావ్.. సింహాసనం మీద కూర్చోపెడతాను అన్నావ్. ఇలా అర్దరాత్రి మోనిత దగ్గరకి వెళ్లి మాట్లాడి వచ్చావ్ అని తెలిస్తే.. దీప ఎంతలా బాధపడుతుంది. మీ ఇద్దరు ఎందుకు ఇళా తప్పులు చేస్తున్నారు.. అంటూ సౌందర్యను తిట్టేశాడు.
మోనితతో మాట్లాడాను.. కానీ దీప మీద ప్రేమతోనే చేశాను అని సౌందర్య అంటుంది.. ఒక్కోసారి వైద్యం చేస్తే కుట్లు వేస్తారు.. బాధ కలుగుతుంది. ఇది కూడా అలాంటిదే. నేను కార్తీక్ చేసిన తప్పులను కప్పి పుచ్చడం లేదు. మీరు ఒకసారిచ చెప్పిండి. దోష నివారణ పూజకు రమ్మనండి అని సౌందర్య అంటుంది. దోషం చేయడం ఎందుకు దోష నివారణ ఎందుకు అని ఆనంద్ రావు. దీంట్లోని నన్ను లాగకండి.. దీపకు ముందు నిజం చెప్పండి అని అంటాడు. మోనిత చెప్పింది నిజమని నువ్ నమ్ముతున్నావా? మమ్మీ అని కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఇదిగో ఇలా ఉంది మీ వరస అంటూ ఆనంద్ రావు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆ తరువాత కార్తీక్, సౌందర్యలు మాట్లాడతారు. జరిగిందాంట్లో ఎవరి తప్పుందో పక్కన పెట్టేద్దాం.. ఇది నాకు ప్రాణ గండం అనుకో.. నా మీద ఇష్టం ఉంటే రేపు పూజకు రా.. అని చెప్పి వెళ్తుంది సౌందర్య. ఆ తరువాత సీన్ కట్ చేస్తే పిల్లలను దీప నిద్ర లేపుతుంది. నాన్న సరిగ్గా మాట్లాడలేదు.. సంతోషంగా లేరేమో.. సైలెంట్‌గా చూస్తున్నాడు తప్పా.. ఏం మాట్లాడలేదు అని పిల్లలిద్దరూ చెబుతారు.. అందుకే ఎక్కువగా ఊహించుకోకూడదు అని దీప కౌంటర్ వేస్తుంది. ఈ రోజు స్కూల్‌కు వె ళ్తాం అని చెప్పడంతో.. బోర్ కొట్టినప్పుడు మాత్రమే కాదు.. ప్రతీ రోజూ వెళ్లాలి అని దీప అంటుంది. అన్నీ ఆన్ లైన్ క్లాసులే కదా? అమ్మ అని పిల్లలంటే.. ఒక్క మాట కూడా పడరు కదా? అని మీకున్న బుద్ది నాకు లేదు.. ఉంటే నేను ఎందుకు ఇలా బాధపడతాను.. అడక్కుండా ఉంటాను అని దీప అంటుంది. నువ్ ఈ మధ్య ఎక్కువగా కోప్పడుతున్నావ్ అని పిల్లలన్నారు. నేను మనిషినే కదా?.. నాకు బాధ, కోపం ఉంటాయ్ కదా?. ఎప్పుడో సారి అరిస్తే.. నాకు కోపం ఎక్కువ అని అంటావా? అని దీప అంటుంది. బాగానే ఉన్నావా? అమ్మా అని అని పిల్లలంటారు.. నాకు నేను ఇదే ప్రశ్నను వేసుకుంటాను.. నాకు సమాధానం దొరికినప్పుడు నీకు చెబుతాను అని దీప చెబుతుంది.
ఆ తరువాత మోనిత, ప్రియమణిల మీద సీన్ ఓపెన్ అవుతుంది. పూజ కోసం రెడీ అవుతుంది. మంగళసూత్రం వేసుకున్న మోనితను చూసి ప్రియమణి ఆశ్చర్యపోతోంది. ఈ మోనిత ఏం చేసినా అర్థం, పరమార్థం ఉంటాయన్న మాట..ఈ సూత్రం వేసుకోవడంతో ఒకరకమైన ఆనందం వచ్చేసింది.. త్వరలోనే నా కార్తీక్‌తో కట్టించుకుంటాను.. అని మోనిత మురిసిపోతోంది.
ఆ తరువాత సీన్.. పిల్లలకు దీప తినిపిస్తుండటం మీద ఓపెన్ అవుతుంది. కోపంగా ముద్దలు కలిపి తినిపిస్తుంది దీప. అక్కడే ఆనంద్ రావు కూడా కూర్చురని ఉంటాడు. ముద్ద కలిపి పెట్టాలా? మేం చిన్నపిల్లలమా? అని పిల్లలు అంటారు. ఈ ఇంట్లో అందరూ పక్కన పెట్టేశారు.. ఇప్పుడు మీ వంతు వచ్చిందా? అని దీప సెటైరికల్‌గా అంటుంది. ఆమాటలకు అర్థం ఆనంద్ రావుకు తెలుసు కాబట్టి కాస్త బాధపడ్డాడు. అత్తయ్య, డాక్టర్ బాబు ఎక్కడ మామయ్య గారు అని అంటే.. నాకు తెలీదమ్మా అని ఆనంద్ రావు అంటాడు.
మీక్కూడా చెప్పకుండా వెళ్లారా? అని దీప అంటే.. అన్నీ అందరికీ తెలియాలని లేదు కదా? అని అంటాడు ఆనంద్ రావు. అబద్దం చెప్పినందుకు నన్ను క్షమించు?. నిన్ను చూస్తున్నప్పుడల్లా నీకు చేసిన ద్రోహమే గుర్తుకు వస్తుందమ్మా అని ఆనంద్ రావు తనలో తానే అనుకుంటాడు.. నీకు చెప్పలేదు.. సరే.. నాకు అయినా ఎందుకు చెప్పలేదు అమ్మా అని హిమ అంటుంది.. అంటే నా స్థాయి ఏంటో నీక్కూడా తెలిసిందా? అని దీప బాధపడుతుంది. అలా కాదు అమ్మా.. నాకు చెప్పుకుండా వెళ్లడు కదా? అని హిమ అంటుంది. డాడీ మారినట్టు అనిపిస్తోంది.. ఇది వరకటిలా ఉండటం లేదని పిల్లలు అంటే.. ఏం మారాడా? ఝఆ ప్రశ్నలు కూడా నన్నే అడుగుతారా? అని దీప ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
గుడికి కారులో వెళ్తోన్న సౌందర్య, కార్తీక్ ఆలోచనల్లో మునిగి తేలుతారు. అన్నీ గుర్తు చేసుకుంటారు. అయితే రేపటి ఎపిసోడ్‌లో అసలు సంగతి తెలుస్తుంది. దోష నివారణ పూజ జరుగుతున్న గుడికి దీప వెళ్తుంది. అక్కడ ఆ తతంగాన్ని అంతా చూస్తుంది. దీప గుండె బద్దలవుతంది. మరి దీప ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.