• November 10, 2021

Karthika Deepam Episode 1193 : అసలు సినిమా ఇప్పుడే షురూ.. మోనితకు వార్నింగ్.. వంటలక్క 2.ఓ!

Karthika Deepam Episode 1193 : అసలు సినిమా ఇప్పుడే షురూ.. మోనితకు వార్నింగ్..  వంటలక్క 2.ఓ!

    కార్తీక దీపం సీరియల్ బుధవారం నాడు అందరినీ కంటతడి పెట్టించేలా ఉంది. దీప గుండెలవిసేలా ఏడ్చేసింది. డాక్టర్ బాబు ఏంటి ఇలాంటి పనులు చేయడమేంటి? అత్తయ్య గారు ఇలా దగ్గరుండి చేయించడమేంటి? అని దోష నివారణ పూజను చూసిన దీప కంటతడి పెట్టేస్తుంది. అసలు బుధవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఓ సారి చూద్దాం.

    గుడి వద్ద సౌందర్య కారును చూసి వారణాసిని కారు ఆపమంటుంది. ఆ కారులో వస్తాను వెళ్లమని వారణాసికి చెబుతుంది. కానీ వారణాసి మాత్రం ఏదో ఆందోళన చెందుతాడు. జాగ్రత్త అక్కా? అని అంటాడు. ఎందుకురా? నేను చచ్చిపోతాను అని అనుకుంటున్నావా? అది నీకు నా మీదున్న ప్రేమరా? శరీరం ఒక్కసారి చస్తుంది. కానీ మనసు రోజు రోజుకు చస్తూనే ఉంటుంది. ఈ భూమ్మీద అన్నింటికంటే ప్రమాదమైనవి పులులు, పాములు కాదు.. మనుషులు. వారి ఆలోచనల్లో, మాటల్లో, చేష్టల్లో విషం ఉంటుంది అని దీప చెప్పింది. నాకేం కాదు నువ్ వెళ్లు అని వారణాసిని పంపించేస్తుంది.

    ఇక గుడిలోపలకి వెళ్లిన దీపకు.. అసలు సంగతి తెలుస్తుంది. అలా మోనిత పక్కన చూసే సరికి గుండె బద్దలవుతుంది. డాక్టర్ బాబు ఇలా ఎందుకు చేశారంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. హాస్పిటల్‌కు వెళ్లి సంతకం పెట్టాడంటే మానవత్వం అనుకున్నాను.. అది నాకు చెప్పలేదంటే.. నేను ఎక్కడ బాధపడతానో అని చెప్పలేదని అనుకున్నాను. కానీ ఇది ఎందుకు చేస్తున్నారంటూ దీప తెగ మథన పడింది.

    చివరకు అత్తయ్య గారు కూడా నన్ను మోసం చేశారు.. ఇంత ద్రోహం చేస్తారా. అంటూ దీప ఎమోషనల్ అవుతుంది. ఇక దీప గుడిలోంచి వెళ్లడం కార్తీక్ చూస్తాడు. దీప అనే పేరును నాకు ఎందుకు పెట్టారు.. ఎప్పటికైనా ఆరిపోవాల్సిందేనా? అని పెట్టారేమో అని దీప ఏడుస్తుంది. ఇక బయటకు వచ్చిన పంతులను ఆ పూజ ఏంటి? అని అడుగుతుంది. బిడ్డ పేగును మెడలో వేసుకుని పుట్టాడంటా.. అందుకే ఆ దంపతులు దోష నివారణ పూజ చేస్తున్నారు అని పంతులు చెప్పాడు. దంపతులు అనే పదం విని షాక్ అయింది. మరి మీరు ఎవరు అని దీపను అడుగుతాడు పంతులు.

    అదే నాకు కూడా తెలియడం లేదు అని అంటాడు. బయటకు వెళ్తున్నారు.. దేవుడిని దర్శించుకున్నారా? అని పంతులు అంటే.. గొప్పగా దర్శనం జరిగిందని దీప ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఇక పంతులు ముందు మోనిత తెగ నటించేసింది. ఉత్తమ ఇల్లాలుగా ఓవర్ యాక్షన్ చేసింది. కార్తీక్‌కు పదే పదే హింసించడంతో చిరాకుపడ్డాడు. మోనిత మీద అరిచాడు. త్వరలోనే ఇంట్లోకి కోడలిగా వస్తాను.. మీరే పిలుస్తారు అంటూ సవాల్ విసిరింది మోనిత.

    నీకోసమో, నీ బిడ్డ కోసమో వచ్చానని అనుకుంటున్నావా? మా మమ్మీ చెప్పింది కాబట్టి వచ్చాను.. ఆ రోజు కూడా మా మమ్మీ చెప్పిందనే కారణంతోనే సంతకం పెట్టాను. ఇప్పుడు కూడా మమ్మీ బలవంతం చేసింది కాబట్టే వచ్చాను అని అంటాడు. ఇదంతా ఏంటి మమ్మీ అని కార్తీక్ అంటాడు. సమయం బాగా లేనప్పుడు వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు అని సౌందర్య అంటుంది. అవసరం తీరిపోయాక మంచి సామెతే చెప్పారు అని మోనిత కౌంటర్ వేస్తుంది. మొత్తానికి కార్తీక్, మోనితల మధ్య ఢీ అంటే ఢీ అనే మాటల యుద్దం జరిగింది.

    ఇక రేపటి నుంచి మనం వంటలక్కలో కొత్త యాంగిల్‌ను చూడబోతోన్నట్టు కనిపిస్తోంది. మోనితకు కొత్త సినిమాను చూపిస్తాను అంటూ మోనిత మీదే ఒట్టు వేసింది. నీ క్రిమినల్ బుర్రకు అందనివి ఎన్నో జరుగుతాయ్ అంటూ వంటలక్క 2.ఓగా మారిపోయింది. ఇంతకీ వంటలక్క ఎందుకు అలా మారింది? ఏం చేస్తుందో చూడాలి.

     

    Leave a Reply