• November 9, 2021

Karthika Deepam Episode 1192 : మోనిత ఓవర్ యాక్షన్.. కార్తీక్ ఆగ్రహం.. దీప నిర్ణయం ఏంటో?

Karthika Deepam Episode 1192 : మోనిత ఓవర్ యాక్షన్.. కార్తీక్ ఆగ్రహం.. దీప నిర్ణయం ఏంటో?

    కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు దోష నివారణ చుట్టూ తిరుగుతోంది. మంగళవారం నాడు అంటే ఎపిసోడ్ నంబర్ 1192లో దోష నివారణ పూజ మొదలవుతుంది. మంగళవారం నాడు ఏం జరగబోతోందో ఓ సారి చూద్దాం. కారులో గుడికి బయల్దేరిన కార్తీక్, సౌందర్యల ఎన్నెన్నో చర్చించుకుంటారు. దీపను మోసం చేస్తున్నామేమో ఇదంతా అవసరమా ? అంటూ కార్తీక్ అంటాడు. దీపతో ఇన్ని రోజులు జరిగిన సంఘటనలను కార్తీక్ గుర్తు చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తాడు.

    మరో వైపు మోనిత కూడా బయల్దేరుతుంది. ప్రియమణితో తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. నేను గెలిచాను. గెలుస్తున్నాను.. గెలుస్తూనే ఉంటాను.. గెలుపులో ఉండే కిక్కే వేరు అంటూ మోనిత తెగ సంబరపడుతుంది. ఇక మరో వైపు వారణాసి దీపలు వెళ్తుంటారు. పిల్లలను స్కూల్‌లో డ్రాప్ చేసి వస్తుంటారు. అక్కా నిన్ను ఇలా చూస్తుంటే భయం వేస్తోంది.. అసలు ఎందుకు ఇలా ఉంటున్నావ్ అంటూ దీప పరిస్థితిపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు వారణాసి.

    ఒక్క మాట అడుగుతాను అని నా జీవితం మొత్తం అడిగేశావ్.. నువ్ అడిగిన వాటికి ఏ ఒక్కదానికి నా దగ్గర సమాధానం లేదు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతాను. ఆ సమయం వస్తుందా? లేదా? అన్నది కూడా చెప్పలేను దీప అర్థం కాని సమాధానం చెప్పడంతో వారణాసి ఇంకా ఏమీ అంతు పట్టలేదు.

    మళ్లీ కార్తీక్, సౌందర్యలు కారులో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. దీపను మోసం చేస్తున్నామేమోనని కార్తీక్ అంటాడు.. మోసం జరిగిపోయింది అని సౌందర్య అంటుంది.. మోనిత దగ్గరకు వెళ్లినప్పుడే మనం మోసం చేసినట్టు.. ఇప్పుడు దీపకు న్యాయం చేయడానికే చూస్తున్నాను.. దీపకు జరగబోయే కీడును కొంచెమైనా నివారించినదాన్ని అవుతాను అంటూ సౌందర్య తన చర్యలను సమర్థించుకుంటుంది. మమ్మీ ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఇంటికి వెళ్దాం.. నా మనసు ఒప్పుకోవడం లేదు..అంటూ కార్తీక్ అంటాడు.

    ఆనంద్ రావు తనలో తాను మథనపడుతుంటాడు. దీపను మోసం చేస్తున్నాం. తనకు తెలియకుండా ఇదంతా చేస్తున్నారు. ఒక వేళ మోనిత సరాసరి ఇంటికి వస్తే పరిస్థితి ఏంటి? ఇంటికి వచ్చే రకం కూడా అప్పుడు దీప రాజీ పడదు.. ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుంది అని ఆనంద్ రావ్ కంగారు పడుతుంటాడు.

    గుడి దగ్గర సౌందర్య, కార్తీక్ ఎదురుచూస్తుంటారు. మోనిత ఆలస్యంగా వస్తుంది. వచ్చీ రాగానే ఏదో ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అక్కడ అందరికీ భార్యభర్తలమేనని చెప్పమని, ప్రచారం చేయమని చెప్పినట్టు కనిపిస్తోంది. పంతులు దగ్గర కూడా భార్యాభర్తలమేనన్న కలరింగ్ ఇచ్చేందుకు మోనిత కష్టపడింది. రాసుకుపూసుకుని కూర్చుండటంతో కార్తీక్ సీరియస్‌గా చూస్తాడు.

    రేపటి ఎపిసోడ్‌లో దీప ఈ తతంగాన్ని చూసేట్టు కనిపిస్తోంది. చూసిన దీప అసలు సంగతి తెలుసుకుంటుందా? డాక్టర్ బాబు, సౌందర్యలను క్షమిస్తుందా? అసలు దీప ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారనుంది.

    Leave a Reply