• November 4, 2021

Karthika Deepam Episode 1188 : క్షణంలో తప్పించుకున్న డాక్టర్ బాబు.. చావుకు అతి దగ్గరగా వెళ్లిన కార్తీక్

Karthika Deepam Episode 1188 : క్షణంలో తప్పించుకున్న డాక్టర్ బాబు.. చావుకు అతి దగ్గరగా వెళ్లిన కార్తీక్

    కార్తీకదీపం సీరియల్‌లో ఇప్పుడు మోనిత ఆధిపత్య కనిపిస్తోంది. సహజంగా వచ్చిన గర్భం అంటూ చెప్పి సౌందర్య దగ్గర మాయ మాటలు చెప్పి నమ్మించేసింది. మొత్తానికి డాక్టర్ బాబు సంతకం పెట్టేశాడు. మోనితకు బిడ్డ పుట్టేశాడు. ఇక ఒప్పుడు ఒక కొత్త సమస్య వచ్చింది. పేగు మెడలో వేసుకుని బిడ్డ పుట్టాడనే విషయం తెలిసిన క్షణం నుంచి సౌందర్య కంగారు పడుతోంది. దోష నివారణ పూజ చేయాలని సౌందర్య పట్టుబట్టేసింది. గురువారం నాటి ఎపిసోడ్‌లో స్థూలంగా జరిగేది ఇదే.

    కార్తీక్, సౌందర్య అలా బయటకు వెళ్తారు. అక్కడ ఈ దోష నివారణ పూజ గురించి మాట్లాడుతుంది. కార్తీక్ ససేమిరా ఒప్పుకోడు. ఆ మోనిత పక్కన నేను కూర్చోవడం ఏంటి? అని అంటాడు. కానీ ఇదంతా చేసేది దీప కోసం పిల్లల కోసం అని అంటుంది సౌందర్య. అబద్దం చెప్పినా కూడా అతికినట్టు ఉండాలి మమ్మి.. ఇలా చెబుతావా? అంటూ కార్తీక్ ఫైర్ అవుతాడు. బిడ్డ అలా పుట్టడంతో నీకు గండం అంటున్నారు.. నీకు ఏమైనా అయితే దీప, పిల్లలు ఏం కావాలి? నేను ఇదొక్కటే ఆలోచిస్తున్నాను.. నువ్ మాత్రం కచ్చితంగా పూజలో కూర్చోవాలి అని అంటుంది సౌందర్య.

    అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ కారు వద్దకు వస్తారు. కానీ కారుపై కరెంటు తీగలు తెగి పడి ఉన్నాయి. కొంతదూరంలో కరెంటు పని చేసే వ్యక్తి దాన్ని చూస్తాడు. డాక్టర్ బాబు కారు వద్దకు వస్తుండటం చూసి కరెంటు పని చేసే వ్యక్తి అరుస్తూ వస్తాడు. కారును తాకొద్దు అని అరుస్తాడు. కానీ వినపడదు. సరిగ్గా కారును టచ్ చేసే సమయంతో వచ్చి డాక్టర్ బాబును నెట్టేస్తాడు. చచ్చిపోదామని అనుకుంటున్నారా? అని అంటాడు. కారుపై కరెంట్ తీగ ఉంది.. క్షణంలో చనిపోయేవారు.

    మీ భార్య తాళి గట్టిది.. మీ పిల్లల అదృష్టం బాగుంది అంటూ ఆ లైన్ మెన్ అంటాడు. ఈ ఘటనతో సౌందర్య ఇంకా భయపడుతుంది. ఎలాగైనా సరే దోష నివారణ పూజ జరిపించాలని అంటుంది. ఆ మోనిత ఉంటే నేను మాత్రం పక్కన కూర్చోను అని కార్తీక్ తెగేసి చెబుతాడు.

    ప్రియమణి తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంది. దీపకు జరుగుతున్న అన్యాయం గురించి మనసులో అనుకుంటుంది. ఇక్కడి ఉప్పు తింటున్నా కదా? అందుకే దీపమ్మ మీద జాలి, దయ కలుగుతున్నాయోమో అని అనుకుంటుంది.

    ఇక ఏదో పని చేస్తున్న దీప వద్దకు కార్తీక్ వస్తాడు. మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా రోజులైంది. మనమే ముందు మాట్లాడితే తప్పేంటి? అని కార్తీక్ తనలో తాను అనుకుంటాడు. దీప వద్దకు వస్తాడు.. ఏం చేస్తున్నావ్ దీప అని అంటాడు. కనబడటం లేదా? అని కౌంటర్ వేస్తుంది. ఏం కూరలు చేశావ్ దీప అంటాడు? కాసేపట్లోనే తింటారు కదా? మళ్లీ ఎందుకు అడగటం అని చిరాగ్గా చెబుతుంది? ఏమైంది? నీ మనసులో ఏదోఉంది.. నీ కళ్లలో ఏదో కనిపిస్తోందని అంటూ దీపతో అంటాడు కార్తీక్. నా కోపం, అలక ఇక్కడ ఎవరికి పట్టిందంటూ దీప నిట్టూర్పు కారుస్తుంది. పక్కకి తప్పుకుంటే వెళ్తాను అని దీప అంటుంది.

    ఇక సౌందర్య పలు ప్రశ్నలతో సతమతమవుతుంటే.. హిమ, శౌర్యలు వస్తారు. ఇంట్లో ఎందుకు అందరూ అలా ఉంటున్నారు? అని అడుగుతారు. సమస్య మిమ్మల్ని దాటి వెళ్లిందో.. అది మీకు ఎలా చెప్పాలి అంటూ సౌందర్య తనలో తాను అనుకుంటుంది. అమ్మ మా మీద ఎందుకు అంతలా అరిచింది అంటూ ప్రశ్నిస్తారు. అమ్మ ఏదో చిరాకులో ఉందేమో.. వెళ్లిన పని కాలేదేమో..పైగా మీరు తినలేదు అందుకే అలా అరిచి ఉంటుంది.. ఇప్పుడైనా మీరు తిన్నారా? లేదా. వెళ్లి తినండి అని సౌందర్య అక్కడి నుంచి పిల్లలను పంపిస్తుంది.

    అయితే దోష నివారణ పూజ ఎలాగైనా సరే జరిపించాలని సౌందర్య అనుకుంటుంది. దీని కోసం భారతిని రంగంలోకి దింపుతుంది. ఎలాగైనా సరే పూజకు రప్పించేలా చూడాలని భారతిని సౌందర్య వేడుకుంటుంది. భారతితో సౌందర్య మాట్లాడటాన్ని దీప చూస్తుంది. అసలేం జరుగుతోందో అర్థం కాక దీపం ఇంకా ఆలోచనల్లో పడుతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్, సౌందర్యలు ఈ దోష నివారణ పూజ గురించి మాట్లాడుకుంటూ ఉండగా దీప మధ్యలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply