- November 3, 2021
Karthika Deepam Episode 1187 : దీప కంటి చూపుకే భయపడ్డ కార్తీక్.. వెనుకడుగు వేసిన డాక్టర్ బాబు

వంటలక్కకు కోపం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సహజంగా అయితే ఎప్పుడూ ఎవరి మీదా కోపం చూపించదు. ఒకవేళ వస్తే కోపం వస్తే అది ప్రళయంలానే ఉంటుంది.అలాంటిదే బుధవారం నాటి ఎపిసోడ్‌లో కాసింత చూపించింది. ఒక్క చూపుతోనే దీప అందరినీ భయపెట్టేసింది. డాక్టర్ బాబు అయితే దెబ్బకు నోర్మూసుకున్నాడు. దీప మాట్లాడుతూ ఉంటే.. అందరూ అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అసలు బుధవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.
సౌందర్య కారు దిగి ఫోన్ మాట్లాడుతోంది. దీప ఆ పూజా సామాగ్రి చిట్టిని చూసింది నాకు తెలియకుండ ఈ పూజలు ఏంటి.. అసలు ఏం చేస్తున్నారు.. అంటూ లోలోపల దీప మథన పడింది. ప్రియమణి చెప్పింది.. డాక్టర్ బాబు , అత్తయ్య చేస్తోన్న పనుల గురించి గుర్తు చేసుకుంది.. ఎన్ని రోజులు ఎన్ని నిజాలు దాచేస్తారు అని లోలోపల అనుకుంది.
ఇక కారు లోపలకు వచ్చిన సౌందర్య.. దీప కళ్లోకి కళ్లు పెట్టి చూడలేకపోయింది. నువ్ కనిపించకపోయే సరికి కార్తీక్ చాలా టెన్షన్ పడ్డాడే అంటూ ఏదో కవర్ చేసేందుకు సౌందర్య ట్రై చేసింది. ఈ మధ్య నేను కనిపించినా కూడా కొందరు టెన్షన్ పడుతున్నారు అని దీప అనడంతో సౌందర్య షాక్ అయింది.
మరో వైపు ఆనంద్ రావ్ తన కొడుకు కార్తీక్‌తో మాట్లాడతాడు. దీపకు నిజం చెప్పవా? అని అంటాడు. అలా ఎలా చెప్పగలను డాడీ అని కార్తీక్ అంటాడు. నిజాన్ని ఒక్క ముక్కలో చెప్పొచ్చు.. అబద్దానికి అతుకులు వేస్తూ వెళ్లాలి అని ఆనంద్ రావు అంటాడు.. దీపకి ఈ నిజం చెబితే అల్లకల్లోలం జరగుతుంది అని కార్తీక్.. ఎప్పుడో సారి జరగాల్సిందే కదా? అని తండ్రి అంటే.. అప్పటికి ఏదో ఒకటి చెప్పగలను.. మోనితకు పుట్టిన బిడ్డకు నేనే తండ్రినేమో అని అనుమానం కలుగుతోంది అని ఎలా చెప్పగలను అంటూ కార్తీక్ మథనపడ్డాడు..నిజం ఒప్పుకోవడానికి నువ్ రెడీగా లేవు కదా? అని తండ్రి అంటే.. ఈ నిజాలు దీపకు చెప్పలేను అంటున్నాను.. ఎందుకు అక్కడికివెళ్లావ్ అని అంటే.. నీ మీద కోపం అనుమానంతో అక్కడికి వెళ్లాను.. మందు తాగాను అని చెప్పనా?. పిల్లలకు ఏమని చెప్పాలి?. ఇప్పుడిప్పుడే వాళ్లు మాట్లాడుతున్నారు.. అని అంటాడు. ఈ నిజాలు బయటకు వచ్చినప్పుడు నేను ఏదోలా మ్యానేజ్ చేసుకుంటాను.. టైం వచ్చినప్పుడు దీపను బతిమాలుకుంటాను.. అని డాక్టర్ బాబు అంటాడు. మానేజ్ చేస్తే కాపురం నిలబడదు.. నిజాలతో నిలుస్తుంది.. ఏ స్త్రీ కూడా ఇలాంటి విషయిల్లో కాంప్రమజక్ కాదు. తప్పు చేయడం కన్నా దాచడం ఇంకా పెద్ద తప్పు అవుతుంది అని తండ్రి సలహాలు ఇస్తాడు.
ఇంట్లోకి దీప వెళ్లగానే పిల్లలు వచ్చారు.ఎక్కడికి వెళ్లావ్ అమ్మా అని హిమ, శౌర్యలు అడిగారు. నా దగ్గరే ఎన్నో ప్రశ్నలున్నాయ్.. మీరు ఇంకా అడక్కండి అని చెప్పేసింది. ఇంకా టిఫిన్ కూడా చేయలేదా? ఇలా ఉన్నారేంటి? అని దీప అరవడం ప్రారంభించింది. శ్రావ్యా అంటూ కేకలు పెట్టేసింది. నా పిల్లలకు కనీసం ఒక్క పూట భోజనం కూడా పెట్టలేరా? నేను లేకపోతే నా పిల్లలను పట్టించుకోరా? అని శ్రావ్యా మీద చిందులు తొక్కేసింది.
మధ్యలో డాక్టర్ బాబు కలగజేసుకుని ఎక్కడకు వెళ్లావ్ దీప అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఒక్క చూపు చూసింది. దానికే డాక్టర్ బాబు దెబ్బకు షాక్ అయ్యాడు. ఏం మాట్లాడకుండా వెనకడుగు వేసేశాడు. ఇప్పుడు ఇలా ఉన్నారంటే.. రేపు నేను చనిపోతే ఎలా? అంటూ బిడ్డల మీద, శ్రావ్య మీద కోపాన్ని చూపించింది. ఇంట్లో లేకపోతే నా పిల్లలకు తిండి పెట్టరా? పట్టించుకోరా? రెండు ముద్దల అన్నం పెట్టరా? దీపు గాడిని వదిలేసినట్టు.. నా పిల్లలను నేను వదిలేయలేను కదా శ్రావ్యా.. మీరేంటి.. ఇలా అన్నింటికి అడుగుతారు.. కదా? కనీసం టిఫిన్ కూడా అడిగి పెట్టించుకోరా? రేపు నేను చస్తే ఎలాగా? అంటూ దీప పిల్లల మీద ఫైర్ అవుతుంది.. దీప ఏంటా మాటలు అని సౌందర్య అంటుంది.. ఒక్క పూట నా పిల్లలకు టిఫిన్ పెట్టలేరు నా పిల్లలకు అంటూ అరుస్తూ తన పిల్లలను తీసుకెళ్లింది దీప
అవసరం లేకపోయినా అరుస్తారు.. కదా?.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కదా?.. అంటూ కోపంతోనే పిల్లలకు తినిపించింది దీప. ఆమె విచిత్ర ప్రవర్తనను చూసి సౌందర్య, కార్తీక్ ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇలా చేస్తోంది? మమ్మి అని కార్తీక్ అంటాడు. ఏదైనా నిజం తెలిసి ఉంటుందంటావా? అని అడిగితే.. కచ్చితంగా తెలిసే అవకాశం లేదురా? అని అంటుంది.
ఇక కార్తీక్ తన మనసులో తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటాడు. ఇంత కోపం ఎందుకు వచ్చింది. కేవలం పిల్లలు తినకపోవడం వల్లే వచ్చిందా? దీపకు విషయం తెలిస్తే ఇలా ఉండదు కదా?.. దీపకు విషయం తెలిస్తే నా కాలర్ పట్టుకుని నిలదీస్తుందా? పిల్లల మీద ఇలా కోప్పడదు.. అసలు దీప ఎక్కడకు వెళ్లింది?.. మోనిత విషయంలో ఏమీ తెలియదు అనుకుందాం.. ఎక్కడికి వెళ్లావ్ అని ళ్లలో కళ్లు పెట్టి దీపను ఇప్పుడు అడగలేను.. మోనిత చెప్పిందాంట్లో నిజం ఎంతో అబద్దం ఎంతో దేవుడికే తెలియాలి.. ఇది తెలిస్తే.. దీప గుండె పగులుతుంది.. గట్టిగా నిలదీస్తుంది కదా?. తను నా వైపు చూసే చూపు తట్టుకోలేకపోతోన్నాను.. అసలు దీపకు ఏమైంది అంటూ కార్తీక్ లోలోపల ప్రశ్నలతో సతమతమవుతాడు.
ఇక ఒంటరిగా కూర్చున్న దీప.. ల్యాబ్ డైరెక్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది. అది నిజమే అయితే.. డాక్టర్ బాబు, మోనితలు అబద్దం చెప్పారా? నన్ను దూరం పెడుతున్నారు..నేను వెళ్తే మాటలు మార్చేస్తున్నారు.. మోనిత దగ్గరికి వెళ్లి డాక్టర్ బాబు సంతకం పెట్టారట.. అత్తయ్య కూడా నాతో అబద్దాలు చెబుతున్నార. దోష నివారణ పూజ.. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారా? ఇన్నాళ్లు అత్తయ్య చూపించిన ప్రేమ మోసమా? నటనా? చదువురాదని నన్ను ఇలా చేస్తున్నారేమో.. ఇదంతా ముందుగా అనుకునే చేస్తున్నారు.. ఇద్దరూ ఒక్కటయ్యారా? నన్ను ఒంటరిని చేశారు? అసలు ఆ పూజ ఏంటి? మోనిత దగ్గరకు వెళ్తున్నారా? చీపురు కట్టలా మూలన పడి ఉంటాను? ఏం చేయననా? వాళ్లకు నేను అవసరం లేదా? పదకొండేళ్లు ఎదురుచూసి చూసి వచ్చనాని చులకనా? ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? నాకు. అని దీప బాధపడుతోంది.
ఆ సమయంలోనే పిల్లలు ఇద్దరూ వస్తారు. ఇక్కడ ఎందుకు ఉన్నావ్.. ఇంత పెద్ద ఇల్లు ఇక్కడ ఎందుకు ఉన్నావ్ అంటూ పిల్లలు అంటారు.. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అని దీప అర్థం కానట్టుగా ఏదో చెబుతుంది.. ఎందుకు ఏడుస్తున్నావ్ అమ్మా అని అంటే..జీవితం అంతా ఏడుపు కదా? నాకు నవ్వే అదృష్టం ఎక్కడుందమ్మా అని అంటుంది.. నువ్ బయటకు వెళ్తే.. అడిగి అన్నం పెట్టించుకుంటాం.. నీకు కోపం తెప్పించం.. మా మీద అలిగావా? అమ్మ అని పిల్లలు అంటే… నా అలకకు ఇక్కడ విలువే లేదమ్మ అని దీప అంటుంది
డాడీతో ఇంతకు ముందులా లేవు.. మాతో కూడా ఉండటం లేదు.. ఎందుకమ్మా.. నా బతుకంతా కూడా ఏడుపే అని రాసి ఉంటే.. ఎలా నవ్వగలను అమ్మా.. అని దీప అంటుంది. నాన్న మారిపోయాడు కదా?. మనం అంతా కలిసి బాగుందాం.. అని హిమ అంటే.. అవును మీ నాన్న అంచనాలకు అందనంతా మారిపోయాడు.. అని దీప అంటుంది. ఎందుకమ్మా ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తుంటావ్.. అని శౌర్య అంటే.. ఆలోచనలన్నీ అయిపోయాయ్ అమ్మ.. ఇక ఆలోచించడానికి ఏం లేదు అని దీప అంటుంది. తనలో తాను మథనపడుతూ.. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడాదు.. వీళ్ల మనసులో ఏముందో తెలిశాక.. అదే చివరి నిర్ణయం అవుతుంది.. భగవంతుడా? సరైనా నిర్ణయం తీసుకునే శక్తిని ఇవ్వు అంటూ కోరుకుంటుంది. అంటే మున్ముందు ప్రళయం రాబోతోందన్న మాట.