- November 16, 2021
Karthika Deepam Epiosde 1198 : డాక్టర్ బాబును నిలదీసిన ఆదిత్య.. నడిరోడ్డు మీదే కార్తీక్‌పై ఫైర్

Karthika Deepam Epiosde 1198 కార్తీక దీపం సీరియల్‌లో మంగళవారం నాడు అంటే నవంబర్ 16న జరగబోయే ఎపిసోడ్‌లో ఆదిత్యకు అసలు నిజం తెలుస్తుంది. మోనిత చెప్పిన అబద్దాలు, చూపించిన ఫోటోలతో ఆదిత్య షాక్ అవుతాడు. ఇక అన్న మీద కోపం అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. కార్తీక్‌కు నడి రోడ్డు మీద నిలదీస్తాడు. మొత్తానికి నేడు జరగబోయే 1198 ఎపిసోడ్‌లో కథనం ఎలా ఉందో ఓసారి చూద్దాం.
డైనింగ్ టేబుల్ వద్ద దీప విచిత్ర ప్రవర్తనకు అంతా షాక్ అవుతారు. ఏంటి వదినా? కొత్తగా ఉన్నావ్ అని అదిత్య అనడం.. ఏడుపు మొహంతో ఉంటే ఇంకా అలానే ఏడిపిస్తున్నారు. అందుకే ఇలా ఉంటున్నా అని దీప అంటుంది. ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండు అమ్మ అని శౌర్య అంటుంది. ఇలానే ఉంటానమ్మ.. ఉండనిస్తే అని కౌంటర్ వేస్తుంది. ఆ తరువాత తన వంటకు మార్కులు ఇవ్వమని అంటుంది. మామయ్య సాంబార్‌కు ఎన్ని మార్కులు ఇస్తారు అని అడుగుతుంది. 8 మార్కులు అని అంటాడు ఆనంద్ రావు. కొత్తిమీర పచ్చడికి ఎన్ని మార్కలిస్తారు అత్తమ్మ అంటే తొమ్మిది మార్కులు అని అంటుంది. ఇక డాకర్ట్ బాబు గుత్తి వంకాయకు పది మార్కులు ఇస్తాను అని అంటాడు.
అబద్దాలు చెబుతున్నారు.. అన్నీ అబద్దాలే చెబుతున్నారు.. ఈ రోజు గుత్తి వంకాయ కూర సరిగ్గా రాలేదు. అయినా మీరు పది మార్కులు ఇచ్చారంటే అబద్దమే కదా? అని అంది. వంటల్లో పాస్ చేశారు కదా? అని నన్ను జీవితంలో ఫెయిల్ చేయకండని అంటుంది దీప. ఆ మాటలకు ఆదిత్యకు ఏమీ అర్థం కాదు. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే.. మోనిత మీద ఓపెన్ చేస్తారు. ప్రియమణి మీద మోనిత అరిచేస్తుంది. ఇంట్లో సరిగ్గా పనులు చేయడం లేదు.. ఈ బట్టలేంటి ఇక్కడున్నాయ్ అని విరుచుకుపడుతుంది.
ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు.. ఇల్లు బాగుండాలి కదా? అని అంటుంది. ఇళ్లు, ఇల్లాల అట అని ప్రియమణి తనలో తాను నవ్వుకుంది. ఇంతకి ఇంటికి ఎవరు వస్తున్నారమ్మా అని అడుగుతుంది. ఎవరు వస్తున్నారో తెలిస్తే షాక్ అవుతావ్.. గెస్ చేస్తూ ఉండు.. అని అంటుంది. ఇంతలో ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు. వామ్మో ఆదిత్యయ్య వచ్చాడేంటి.. అసలే చిటపటలాడుతుంటాడు.. ఇప్పుడేం గొడవ జరుగుతుందో ఏమోనని ప్రియమణి భయపడుతుంది.
అన్నయ్య వస్తాడు అన్నావ్ ఎక్కడ అని ఆదిత్య రూంలో వెతుకుతుంటాడు.. అలా అబద్దం చెబితేగానీ రావు అని అలా చెప్పాను అని మోనిత అంటుంది. ఇక ఆదిత్య వెళ్లిపోతుండటంతో కొన్ని నిజాలు చెప్పాలి ఆగు అని అంటుంది. కొన్ని నిజాలు కాదు.. కొన్ని అబద్దాలని చెప్పు అని ఆదిత్య కౌంటర్ వేస్తాడు.నేను ఏం చెప్పినా కూడా మీకు అబద్దంలానే అనిపిస్తుంది కనిపిస్తుంది.. మీ అన్నయ్య ఉన్నాడని చెబితే గానీ రావని అబద్దం చెప్పాను.. నేను ఇప్పుడు చెప్పేది నా ఒక్కదాని గురించి కాదు.. మన ఇంటి పరువుతో ముడిపడి ఉంది అంటూ అసలు విషయం మెల్లిగా తీసింది మోనిత
ఆనంద్ రావు గారిని తీసుకుని రా ప్రియమణి.. వాళ్ల బాబాయ్‌ని చూస్తారు.. అచ్చు మీ అన్నయ్య పోలికే తెలుసా.. వాడికి నీకు ఆనందం బాబాయ్ వి కదా.. నాకు బాబు పుట్టింది కూడా మీ వాళ్లు చెప్పలేదా? ఇంకా చాలా చాలా జరిగాయ్.. మీ నాన్న గారి మీద గౌరవంతో ఆయన పేరు పెట్టుకున్నా.. ఆనంద్ రావు గారు అని గౌరవంగా పిలుచుకుంటున్నాను.. వెళ్లి తీసుకుని రా ఎత్తుకుంటాడు.. ముద్దాడుతాడు.. అన్నయ్య కొడుకు మీద ఆ మాత్రం ప్రేమ ఉండదా? అని మోనిత అంటుంది. అవసరం లేదు అని ఆదిత్య అంటాడు..
కథ మొత్తం చెబితే అర్థం చేసుకుంటాడు.. కళ్లు తెరుస్తాడు.. మేం ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకోవాలి నువ్ లోపలకి వెళ్లు ప్రియమణి అని అంటుంది మోనిత.. నీతో నాకు మాట్లాడే ఉత్సాహం తీరిక లేదు అని ఆదిత్య ఫైర్ అవుతాడు.. నీ కోపం ఏంటో నాకు తెలుసుగానీ.. మీ అన్నయ్య డెలివరి టైంలో భర్త హోదాలో సంతకం చేశాడు.. బాబు పేగుమెడకు చుట్టుకున్నాడు.. మీ అమ్మగారు అన్నయ్యగారు వచ్చి.. సంతకం పెట్టాకే ఆపరేషన్ చేశారు.. అని మోనిత అసలు నిజం చెబుతుంది.
నేను నమ్మను అని ఆదిత్య అంటే.. నాకు తెలుసు.. నువ్ నమ్మవని.. వీటిని చూస్తే నమ్ముతావా?.. పేగు మెళ్లో వేసుకుని పుట్టినందుకు.. దోష నివారణ పూజ చేయించింది. .నీకు చెప్పలేదా? ఆదిత్య.. నిజానికి అందరికీ ఆర్టిఫిషయల్ ఇన్‌స్పికేషన్ కాదు.. ఒకసారి బాగా తాగొచ్చి.. అందరి పరువుపోతుందని నేను అబద్దం చెప్పాను.. మన కుటుంబం పరువుపోతుందనే కదా.. మీ అన్నయ్య తప్పు లేకపోతే పూజకు ఎందుకు వస్తారరు.. మంచిదాన్ని కాబట్టి.. పది మందికి చెప్పలేదు.. ఇప్పుడేమో మీ అన్నయ్య ఫోన్ చేయడం లేదు.. నువ్ ఫోన్ చేయకపోతే శ్రావ్య బాధపడుతుంది కదా?.. నేను అంతే కదా?.. ఆదిత్య నువ్ మీ ఇంట్లో అందరిలా కాదు.. మనసులో ఏముంటే అది మాట్లాడతావు.. కార్తీక్‌ని నాతో మాట్లాడమని చెప్పు..ర చ్చ చేసుకోవడం అవసరమా? అని చెప్పు.. నన్ను కోడలిగా ఇంటికి తీసుకెళ్లమని చెప్పు.. కావాలంటే దీపక్కను కూడా ఇంట్లో ఉండమను.. నాకేం ప్రాబ్లం లేదు.. అని మోనిత వాగేస్తుంది. దీంతో షాక్ అయిన ఆదిత్య బయటకు వెళ్తాడు. మొదటిసారి ఇంటికి వచ్చావ్. ఏం తీసుకోకుండా వెళ్తున్నావ్ అంటూ మోనిత దొంగ నాటకాలు ఆడింది
అగ్గిపుల్ల ఆదిత్య చేతికి ఇచ్చాను ఇక ఆ ఇంట్లో మంట పుడుతుంది అని మోనిత సంబరపడిపోయింది..దీప మాటలను గుర్తు చేసుకుంటూ ఆదిత్య బైక్ మీద వెళ్తాడు.. మోనిత మాటలతో షాక్ తిని.. దీప వదిన మాటలను చేష్టలను గుర్తు చేసుకుంటాడు. నా కంటే పెద్దవాడు అయితే ఏంటి? కడిగేస్తాను.. ఇంత ద్రోహం చేస్తాడా? పెద్దోడు అయితే కావొచ్చు.. కాలర్ పట్టుకుని అడిగేస్తాను. అంటూ ఆదిత్య ఆగ్రహంతో ఊగిపోతుంటాడు. కారుపాడవ్వం,ఏం జరిగిందో చూద్దామని అదే సమయంలో కార్తీక్ కనిపిస్తాడు ఆదిత్యకు.
ఇక నడి రోడ్డు మీదే రచ్చ జరుగుతుంది.. ఏం చేస్తున్నావ్ నువ్.. మన ఫ్యామిలీని ప్రశాంతంగా ఉండనివ్వవా? దీప వదినను బతకనివ్వవా.. మోనిత ఇంటికి వెళ్లి వచ్చాను అని ఆదిత్య అంటాడు.. అక్కడికి ఎందుకు వెళ్లావ్ రా.. బుద్ది ఉందా.. అని డాక్టర్ బాబు అంటాడు. అక్కడికి వెళ్లాను కాబట్టి నిజాలు తెలిశాయ్.. బాబుని కంటావ్.. హాస్పిటల్‌లో సంతకం పెడతావ్.. గుళ్లో పూజలు చేస్తావ్.. మళ్లీ వదినను వదిలేస్తావా? అప్పటిలాగ.. అని ఆదిత్య ఫైర్ అవుతాడు.
ఆదిత్య.. అంటూ డాక్టర్ బాబు చెయ్యి ఎత్తుతాడు. నువ్ చేసిన వెదవ పనుల గురించి అడిగితే.. నడి రోడ్డు మీద కొడతవా? పరువు నడిరోడ్డు మీదకు తీసుకొచ్చావ్.. నడి రోడ్డు మీదే కొడతావ్ లే అంటూ మరింతగా మాటలు వదులుతాడు ఆదిత్య.. ఎక్కువ చేస్తున్నావ్ ఆదిత్య అని కార్తీక్ అంటాడు.. తమరు ఒళ్లు తెలియకుండా తప్పు చేశారు కదా? అని కౌంటర్ వేస్తాడు.. స్టాపిట్ ఆదిత్య అని కార్తీక్.. తప్పుల మీద తప్పులు చేస్తున్నావ్.. వదినను ఏం చేస్తావ్.. అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తాడు.
దండం పెడతాను.. ఆపరా ఆపు.. నేనేం తప్పు చేయలేదు.. జరిగిందో లేదో నాకే తెలియదు.. తాగిన మాట నిజం.. ఒళ్లు ప్రవర్తించేంత దిగజారలేదురా.. ఒకసారి తప్పు చేసినందుకే 11 ఏళ్లు దీపకు దూరమయ్యాను.. దీపంటే నాకు ప్రాణంరా అని కార్తీక్ అంటాడు..అలాంటప్పుడు హాస్పిటల్‌కు, పూజకు ఎందుకు వెళ్లావ్ అని నిలదీస్తాడు.. మానవత్వం అంటూ మమ్మీ తీసుకెళ్లింది అని కార్తీక్ చెబుతాడు. ఇదంతా మమ్మీ కోసం చేశానంటావ్ అంతేనా? అని ఆదిత్య ప్రశ్నిస్తాడు.. నీ తప్పు లేనప్పుడు వదినకు వెళ్లి చెప్పాలి కదా?. తన దగ్గర ఎందుకు దాచావ్ అని ఆదిత్య అంటాడు.. దాచే అవకాశం కూడా లేదు.. దీప చూసింది.. నా టెన్షన్ అదే కదా?. .ఏం మాట్లాడదు.. ఏం అడగదు.. ఏం జరగనట్టే ఉంటోంది.. ఏం అర్థం చేసుకుందో అర్థం కావడం లేదు.. నాకు నోరు రావడం లేదు.. తను నోరు విప్పదు.. నరకయాతన అనుభవిస్తున్నా.. పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు..అంటూ కార్తీక్ బాధపడతాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి.