- January 23, 2022
జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్.. కష్టాలు వింటే కన్నీరే
Amardeep Chowdhary-Sridevi Drama Company వెండితెరపై వెలిగిపోవాలని, హీరోగా మారాలని అందరూ కలలు కంటారు. కానీ కొందరికే అది సాధ్యమవుతుంది. ఎటువంటి నేపథ్యం లేకుండా హీరోగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో గడపలు తొక్కాల్సి ఉంటుంది. నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుంది. పూట కూడా గడవని రోజులుంటాయి.
హీరోగా సక్సెస్ అవ్వడం వెనుక చాలా కష్టముంటుందని మరోసారి అమర్ దీప్ నిరూపించాడు. జానకి కలగనలేదు సీరియల్‌తో ఇప్పుడు ట్రెండ్‌లోకి వచ్చాడు అమర్ దీప్. అరియానా క్లోజ్ ఫ్రెండ్‌గా అమర్ దీప్ చాలా మందికి తెలుసు. అయితే జానకి కలగనలేదు సీరియల్‌లో రామ పాత్రలో తెలుగు వారందరకీ దగ్గరయ్యాడు.
ఇక ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో అమర్ దీప్ జర్నీని చూపించారు. వచ్చే వారం ప్రసారం కాబోతోన్న ఈ ఎపిసోడ్‌కు ప్రత్యేకత ఉంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ షో పెట్టి ఏడాది అవుతుంది. షో ఫుల్ సక్సెస్ అవ్వడంతో స్పెషల్ సెలెబ్రేషన్స్ చేశారు. ఇందు కోసం జేడీ చక్రవర్తిని స్పెషల్ గెస్టుగా తీసుకొచ్చారు. ఇదే షోలో అమర్ దీప్ తన జర్నీని పాటల రూపంలో ప్లే చేసి చూపించాడు.
ఇక ఊరి నుంచి సినిమా హీరో అవ్వాలని సిటీకి వచ్చాడట. ప్రతీ ఆఫీస్ గడప తొక్కాడట. కానీ అందరూ గెంటేశారట. చివరకు ఎలాగోలా సినిమా అవకాశం వచ్చిందట. అదే సమయంలో అమ్మ చనిపోయిందనే వార్త తెలిసిందట. అలా మొత్తానికి హీరోగా నిలదొక్కుకున్నాని చెప్పకనే చెప్పేశాడు. ఇప్పుడు తనకు ఎవరూ లేరని అంతా కూడా సినిమా పరిశ్రమ ఇచ్చిందేనని అన్నాడు. విష్ణు అక్కని సినిమా ఇచ్చిందని, చెల్లిని ఇలా అందరినీ కూడా సినిమానే ఇచ్చిందని ఎమోషనల్ అయ్యాడు.