• November 8, 2021

Janaki Kalaganaledu Episode 166 : మల్లిక ప్లాన్‌కు జానకి బలవుతుందా?

Janaki Kalaganaledu Episode 166 : మల్లిక ప్లాన్‌కు జానకి బలవుతుందా?

    జానకి కలగనలేదు సీరియల్‌లో గోవిందరాజులు అమ్మ మైరావతి కారెక్టర్ ఎంట్రీ జరిగింది. జానకి విషయంలో జ్ఞానంబ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఆ బాధ్యతను తన తల్లి మైరావతికి అప్పజెప్పేందుకు గోవింద రాజులు ఫిక్స్ అయ్యాడు. జ్ఞానాంబ కూడా ఆ నిర్ణయం మంచిదే అనుకుని తన అత్తగారింటికి బయల్దేరుతారు. అలా సోమవారం నాటి ఎపిసోడ్ మొత్తం మైరావతి చుట్టే తిరుగుతుంది. సోమవారం అంటే 166వ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఓ సారి చూద్దాం.

    మైరావతి పద్దతులు, సంప్రదాయాల గురించి తెలిసేలా కొన్ని సీన్లు పెడతాడు. పచ్చి మిరపకాయలు, ఉల్లిగడ్డలు తింటూ పాత మనిషిలా చూపించారు. మనవళ్లు మనవరాళ్లు హాయ్ అని చెప్పడం, తాను పర్మిషన్ ఇవ్వకముందే తన ముందు కూర్చోవడంపై కస్సుబుస్సు మంటుంది. తన పెద్ద కొడుకు ఫ్యామిలీ చాలా రోజుల తరువాత వస్తున్నారంటూ..వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఇంట్లో పనోళ్లకు చెబుతుంది మైరావతి.

    అలా జ్ఞానాంబ ఫ్యామిలీ దిగుతుంది. చెప్పులు అలా సైడ్‌కు వదిలేయాలని జ్ఞానాంబ గుర్తు చేస్తుంది. కొడుకు కోడలిని చూసి మైరావతి మురిసిపోతోంది. ఏంటి పెద్దోడా? అలా చిక్కిపోయావ్ అని మైరావతి అంటే.. ఏ తల్లికైనా సరే.. కొడుకు చిక్కినట్టు కనిపిస్తుందని గోవింద రాజులు అంటాడు. ఈ మధ్య ఆరు కేజీలు పెరిగాను అమ్మా అని అంటే.. అంత పెరిగావా? అయితే రోజూ పొద్దున్నే లేచి నడువు.. లేదంటే కొవ్వు పట్టేస్తుందని అంటుంది మైరావతి.

    ఇంతకు ముందే చిక్కావ్ అని అంది.. ఇప్పుడేమో ఇలా అంటోంది.. ఇంకా మా అమ్మ మారలేదా? అని లోలోపల అనుకుంటాడు గోవింద రాజులు. నేను మారలేదురా? అని మైరావతి బయటకు అంటుంది. రామచంద్రను చూసి మైరావతి ఎమోషనల్ అవుతుంది. తాను పెళ్లికి వస్తే అరిష్టం అని పంతులు చెప్పాడట. అందుకే పెళ్లికి రాలేదట. పెళ్లి చూడలేదనే బాధ ఉందని మైరావతి చెబుతూ ఎమోషనల్ అవుతుంది. జానకిని చూసి.. ఆమె నీ భార్యనా? అని రామను అడుగుతుంది.

    అవును నాన్నమ.. జానకి గారు అని అంటాడు రామ. గారు ఏంట్రా.. భర్తకు భార్య గౌరవం ఇవ్వాలి.. కానీ భార్యకు భర్త కాదు అని అంటుంది. సరే నానమ్మ అంటాడు. జానకి అని రామ పిలుస్తాడు. కాళ్లు మొక్కే సమయంలోనూ జానకిని మైరావతి తక్కువ చేసి చూస్తుంది. ఎలా మొక్కాలో కూడా తెలీదా? మీ అత్త నీకు నేర్పించలేదా? అని అంటుంది. మా అత్త గారు అమ్మలా అన్నీ నేర్పిస్తుంది.. నేనే నేర్చుకోవడంలో పొరబాటు పడి ఉంటాను అని జానకి అంటుంది.

    అక్కడ జరిగిన సీన్‌ను గమనించి మల్లిక ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇంకా అతి వినయం తగ్గలేదా? అంటూ కౌంటర్లు వేస్తుంది. దీంతో మల్లిక గాలి తీసినట్టు అయింది. భార్యా భర్తలు ఒకే గదిలో ఉండొద్దని నియమం పెట్టారు. దీంతో మల్లిక, జానకి ఒకే గదిలోకి వచ్చారు. గోవిందరాజులు ఇచ్చిన మహాలక్ష్మీ విగ్రహాన్ని జానకి తీసి చూసింది. పెద్ద కోడలికి ఇస్తారా? నాకు ఇవ్వరా? అని మల్లిక ఏదో కుట్ర చేయబోతోంది. తలనొప్పి అంటూ మల్లిక డ్రామాలు ఆడింది. జానకిని బయటకు పంపించింది. ఇక రేపు మల్లిక వేసే ప్లాన్‌కు జానకి బలవుతుందా? లేదా? అన్నది చూడాలి.

    Leave a Reply