• January 6, 2022

రష్మీ సుధీర్ పాపులారిటీని వాడుకోకండి.. శాంతి స్వరూప్ ఆగ్రహం

రష్మీ సుధీర్ పాపులారిటీని వాడుకోకండి.. శాంతి స్వరూప్ ఆగ్రహం

    Rashmi Sudheer బుల్లితెరపై రష్మీ సుధీర్ పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి నిజమైన ప్రేమ జంటలేనేమో అని అంతా భ్రమ పడుతుంటారు. అందుకే వారి అభిమానులు ఎప్పుడూ కూడా పెళ్లి చేసుకోండని అడుగుతుంటారు. అయితే తాజాగా శాంతి స్వరూప్ వేసుకున్న క్యాస్టూమ్స్ నెట్టింట్లో చిచ్చు పెట్టేశాయి.

    రష్మీ సుధీర్ చేసిన ఓ ఈవెంట్, అందులో రష్మీ ధరించిన క్యాస్టూమ్స్‌ను శాంతి స్వరూప్ ధరించడంతో అసలు వివాదం మొదలైంది. రష్మీ తాను ధరించిన క్యాస్టూమ్స్‌ను శాంతికి ఇచ్చిందటన ప్రచారం ఊపందుకుంది. ఆ క్యాస్టూమ్స్ ధరించిన రష్మీ సుధీర్ ఈవెంట్ చేశారు.. అందులో సుధీర్‌ను రష్మీ ప్రపోజ్ చేస్తుంది.. కానీ ఆ క్యాస్టూమ్స్‌ను అలా శాంతికి ఇచ్చిందంటే.. సుధీర్ అంటే ఆమెకు ఎంత ద్వేషమో అర్థం చేసుకోండి..

    సుధీర్‌ను అవమానించేందుకు రష్మీ ఇలా చేసిందంటూ ఓ నెటిజన్ తప్పుడు ప్రచారం మొదలుపెట్టేశాడు. దీంతో రంగంలోకి శాంతి స్వరూప్ దిగాడు. అసలు విషయాన్ని చెప్పేశాడు. తప్పుడు ప్రచారం చేయకండి.. ఆ కాస్ట్యూమ్ నచ్చి నేను కూడా చేయించుకున్నాను. కానీ మీరు నిజాలు తెలియకుండా ఇలాంటి పోస్ట్‌లు పెట్టకండి. ఈ పేజ్‌ని రిపోర్ట్ చేయండి.. తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాడు.. సుధీర్ రష్మీ పాపులారిటీని వాడుకోకండి.. అని శాంతి స్వరూప్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

    ఇక దీంతో సుధీర్ రష్మీ ఫ్యాన్స్ ముందు శాంతి స్వరూప్ హీరో అయ్యాడు. అందరూ కూడా శాంతి ఇలా బయటకు వచ్చి నిజం చెప్పడంతో ఖుషీ అవుతున్నారు. ఫ్యాన్స్ అంతా కూడా శాంతి స్వరూప్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

    Leave a Reply