• November 24, 2021

Jabardasth Avinash: ఆపుకోలేకపోతోన్నా!.. భార్య గురించి అవినాష్ కామెంట్స్

Jabardasth Avinash: ఆపుకోలేకపోతోన్నా!.. భార్య గురించి అవినాష్ కామెంట్స్

    Jabardasth Avinash జబర్దస్త్ షో నుంచి అవినాష్ పాపులర్ అయ్యాడు. అక్కడ కామెడీ చేసుకుంటూనే వెండితెరపై అవకాశాలు సంపాదించుకున్నాడు. అలా మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాడు. బిగ్ బాస్ ఇంట్లోకివెళ్లేందుకు కూడా పెద్ద సాహసమే చేశాడు. మల్లెమాల నుంచి అగ్రిమెంట్ తెంచుకునేందుకు పది లక్షలు కట్టి వచ్చాడు. అలా అంత మొత్తం అక్కడ కట్టేసి మరీ బిగ్ బాస్ ఇంటికి వచ్చాడు. అయితే అది బాగానే గిట్టుబాటు అయింది.

    బిగ్ బాస్ ఇంట్లో అవినాష్‌కు దాదాపు యాభై లక్షలు ముట్టినట్టు తెలుస్తోంది. ఆ మధ్య అవినాష్‌కు యాభై లక్షలు వచ్చాయని రూమర్ బాగానే వచ్చింది. దాంతో తన అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కామెడీ స్టార్స్ అనే షోతో అవినాష్ హల్చల్ చేస్తున్నాడు. లైఫ్ బాగానే సెటిల్ అయింది. అందుకే పెళ్లి చేసుకున్నాడు. గత నెలలోనే అవినాష్ పెళ్లి చేసుకున్నాడు. తాను చేసుకోబోయే అమ్మాయి అనూజ అంటే బుల్లితెరపైనే పరిచయం చేశాడు.

    అలా మొత్తానికి అనూజ అవినాష్ వివాహాం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. అవినాష్ పెళ్లి ఫోటోలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అవినాస్ పెళ్లి వేడుకలకు సంబంధించిన హల్దీ, మెహందీ ఈవెంట్లు, అందులో శ్రీముఖి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ మెమోరబుల్ ఫోటోను అవినాష్ షేర్ చేసుకున్నాడు.

    పెళ్లి, ఫోటోలు అంటే ఎన్నో మెమోరీలను బంధించడం. అలా మనకు తెలియకుండానే కొన్ని ఫోటోలను తీస్తుంటారు. అవి ఎంతో సహజంగా వస్తుంటాయి. అలా అవినాష్ పెళ్లిలోనూ అలానే సీక్రెట్ ఫోటోను తీశారట. దాన్ని ఆల్బమ్‌గా చేశారట. అది చూసి అనూజ ఎంతో సంతోషించదట. ఈ ఫోటోను షేర్ చేయకుండా ఆపుకోలేకపోతోన్నాను అందుకే షేర్ చేస్తున్నాను అని అవినాష్ అన్నాడు.

    Leave a Reply