- November 6, 2021
Intinti Gruhalakshmi Episode 470 : లాస్యకు కడుపు మండిపోయింది.. కారులో తులసి కౌంటర్లు

ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్లో శుక్రవారం అంకిత శ్రుతీ పూజ చేసేందుకు గొడవ పడ్డారు. శ్రుతీ మొక్కు ఉందని, తానే పూజ చేస్తాను అని ఎంత చెప్పినా కూడా అంకిత వినలేదు. మొత్తానికి పట్టు సాధించింది. అంకిత తన మాటను నెగ్గించుకుంది. నేను అంటే ఎందుకంత కోపం.. నేను ప్రేమించిన ప్రేమ్ను పెళ్లి చేసుకోవడం తప్పా? అని శ్రుతీ అడిగింది. అన్నింటి కంటే పెద్ద తప్పు చేశావ్.. నా ఇగోను టట్ చేశావ్.. చిన్న కోడలు మంచిదంటూ పేరు తెచ్చుకుంటున్నావ్.. రాజు గారి రెండో భార్య మంచిదంటే.. మొదటి భార్య చెడ్డదనే కదా? అని.. అలా నువ్ వచ్చి నన్ను తక్కువ చేసేశావ్ అని అంకిత తన మనసులో ద్వేషాన్ని బయటపెడుతుంది.
ఇకపై నా పనులన్నీ కూడా నువ్వే చేయాలి.. ఈ పూజ నేను చేస్తాను.. రాత్రి ఉన్న అంట్లు కడిగేసి, టిఫిన్ రెడీ చేయిపో అంటూ శ్రుతీ మీద ఆర్డర్లు వేస్తుంది అంకింత. తులసి హడావిడిగా ఆఫీస్కు బయల్దేరుతుంది. హారతి తీసుకోకుండా వెళ్తున్నారేంటి అత్తయ్య అని అంకిత అంటుంది. అయ్యో కంగారులో మరిచిపోయాను.. ఏమనుకున్నా అమ్మ అంటూ దేవతను తలుచుకుంటూ హారతి తీసుకుంది తులసి. నువ్ పడుతున్న శ్రమను చూస్తోందిలే తల్లి.. నిన్ను ఏమీ అనుకోదంటూ మామ పరందామయ్య వచ్చాడు.
మావయ్య మీరు కూడా హారతి తీసుకోండని నందుని అడుగుతుంది అంకిత. వెంటనే నందు కూడా హారతి తీసుకుంటాడు. దీంతో లాస్య మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటిది కొత్తగా అని అంటుంది. వెంటనే పరందామయ్య కౌంటర్లు వేస్తాడు. ఎవరితో తిరిగితే వారి లక్షణాలు వస్తాయి.. మొన్నటి వరకు నీతో తిరిగాడు అందుకే అలా ఉన్నాడు.. ఇప్పుడు తులసితో తిరుగుతున్నాడు కాబట్టి మంచి లక్షణాలు వచ్చాయని అంటాడు. ఆ మాటలకు లాస్యకు కాలిపోతుంటుంది. మీరు కూడా హారతి తీసుకోండని లాస్యను అంటుంది అంకిత. నేను రోజురోజుకూ మారను అని అంటుంది లాస్య.
అనంతరం శ్రుతీ లంచ్ బాక్సును తీసుకొచ్చి తులసికి ఇస్తుంది. అదే సమయంలో నందు ఫ్లాష్ బ్యాక్ను గుర్తు తెచ్చుకున్నాడు. నిన్న తిన్న పిజ్జాను తలుచుకుని భయపడ్డాడు. దీంతో తనకు కూడా లంచ్ బాక్స్ కావాలని రాములమ్మను అడిగాడు. కానీ శ్రుతీ తీసుకొచ్చి ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ప్రేమతో తెచ్చిస్తే ఇలా ఎందుకు అంటారు? అని తులసి అంటుంది. ఈ దొంగ ప్రేమలు చాలా చూశాను.. మోసపోయాను అంటూ నందు అంటాడు. నిన్ను అడిగానా? నువ్ ఎందుకు తెచ్చావ్ అని నందు ఫైర్ అవుతాడు.
మీ దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకోవాలని అలా చేస్తుందేమో అంటూ అంకిత చురకలు అంటిస్తుంది. రాములమ్మ.. లంచ్ బాక్స్ ఏది అంటూ కేకలు వేస్తాడు నందు.వెంటనే రాములమ్మ వచ్చి శ్రుతీ చేతిలోంచి లంచ్ బాక్స్ తీసుకుని ఇస్తుంది. ఈ బుద్ది ముందుండాలని నందు అంటాడు. తన చేత్తో ఇస్తే తీసుకోకపోయినా కూడా తాను వండిందే తీసుకెళ్తున్నాడు కదా? అని శ్రుతీ అంటుంది. నువ్ కూడా నాలానే అల్ప సంతోషివి అని శ్రుతిని పొగుడుతుంది తులసి. ఈ గొడవ అంతా తెలుసుకుని ప్రేమ్ కూడా శ్రుతీని పొగుడుతాడు. మా అమ్మ లాంటి భార్య దొరికింది నేను చాలా లక్కీ అంటూ మురిసిపోయాడు.
ఇక కారులో నందు, తులసి, లాస్య ముగ్గురూ ఆఫీస్కు వెళ్లారు. ముందు సీట్లో తులసి కూర్చోవడంతో లాస్య కడుపు రగిలిపోయింది. ఇక ఈ ఇద్దరూ వాగ్వాదం పెంచుకుంటూ పోయారు. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనిస్తే డ్రైవింగ్ చేసుకుంటాను అని నందు విసుగ్గా అనేశాడు. దీంతో లాస్యకు మరోసారి భంగపాటు ఎదురైంది. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగిసిపోయింది.