• November 5, 2021

Intinti Gruhalakshmi : పనిలో నిమగ్నమైన నందు,తులసి.. కుళ్లుతో చచ్చిపోయిన లాస్య

Intinti Gruhalakshmi : పనిలో నిమగ్నమైన నందు,తులసి.. కుళ్లుతో చచ్చిపోయిన లాస్య

    ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో శుక్రవారం మంచి సీన్ జరగబోతోంది. నందుతులసిలు కలిసి ఆఫీస్ పని చేస్తుంటే.. లాస్య ఓర్వలేకపోయింది. ఆ కడుపు మంటను భరించలేక చచ్చిపోయేట్టు కనిపించింది. మొత్తానికి శుక్రవారం నాడు లాస్యకు మాత్రం మంచి గుణపాఠం జరిగింది. ఇక లాస్యను మరింత ఉడికించేందుకు ఆ భాగ్యం ఉండనే ఉంటుంది. అయితే శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    శ్రుతీ, ప్రేమ్ ఇచ్చిన డబ్బులను తులసి తీసుకోలేదు. అమ్మ గుర్తుగా ఉన్న నెక్లెస్ అమ్మి నాకు డబ్బులు ఇచ్చావంటే.. నా మీద నీకున్న ప్రేమ అర్థం అయింది.. మీ అమ్మ కంటే నాకే గొప్ప స్థానాన్ని ఇచ్చావని అర్థమవుతంది. నీ డబ్బులు తీసుకోలేదని బాధపడకు శ్రుతీ అని తులసి అంది. అయితే ఆ విషయాన్ని తలుచుకుంటూ శ్రుతీ, ప్రేమ్ ముచ్చట్లు పెట్టుకున్నారు. అంకిత కావాలనే ఇలా చేస్తోంది.. ఇంకా ఎన్ని గొడవలు పెడుతుందో.. అత్తయ్య గారు నన్ను అపార్థం చేసుకుంటారో ఏమో అని ప్రేమ్ దగ్గర శ్రుతీ బాధపడుతుంది. అమ్మ ఎందుకు అలా చేస్తుంది.. నీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను కదా? అని శ్రుతీని దగ్గరకు తీసుకున్నాడు ప్రేమ్.

    మరో వైపు నందు తనలో తాను తెగ మథన పడుతుంటాడు. నేను అనుకున్నవేమీ జరగడం లేదు.. జరుగుతున్నవేమీ నాకు అనుకూలంగా లేవు ఎందుకు ఇలా జరుగుతోంది.. నా జీవితం నా చేతుల్లో లేకుండా పోతోందా? అని నందు బాధపడుతుంటాడు. ఆ సమయంలో నందు తండ్రి పరంధామయ్య వస్తాడు. కాస్త హిత బోధ చేస్తాడు. నువ్ మమ్మల్ని ఎలాగూ పట్టించుకోవని తెలుసురా? అంటూ తండ్రి అనడంతో.. నందు ఎమోషనల్ అవుతాడు. అలా ఎందుకు అంటారు నాన్న.. మీరు నా బాధ్యత.. మిమ్మల్ని ఎందుకు చూసుకోను అంటాడు.

    తులసి నీ కోసం కష్టపడుతోంది.. అని పరంధామయ్య అంటాడు. తులసితో పని చేయడం ఇష్టం లేదని అంటాడు. కానీ నీ కోసమే తులసి అంతలా పరితపిస్తోంది. నీ మొహంలో చిరు నవ్వు చూడాలనే తులసి అంత కష్టపడుతోందని అంటాడు. ఇక తులసి ఏదో ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో నందు వస్తాడు. కాస్త సాయం చేయమని అడుగుతుంది. బయటకు వెళ్తున్నా అని నందు అంటే.. ఆఫీస్ పని కంటే ఎక్కువా? అని తులసి అంటుంది.

    ఇక తులసి మాట కాదనలేక ఆఫీస్ పనుల్లో సాయం చేస్తాడు. వారిద్దరూ అలా పనులు చేసుకుంటూ ఉంటే.. లాస్య ఓర్వలేకపోయింది. వారిద్దరూ ఎక్కడ కలిసిపోతారో అని కుళ్లుకుంది. ఒకరినొకరు దగ్గరగా కూర్చోవడాన్ని ఇంకా భరించలేకపోయింది. డిన్నర్‌కు వెళ్దామని అనుకున్నాం కదా? ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని లాస్య అంటుంది. కొంచెం సేపు కొంచెం సేపు అంటూ నందు తులసితో కలిసి పని చేసుకుంటూనే ఉంటాడు. చివరకు ఆలస్యమైందని రేపు వెళ్దామని అంటాడు నందు.

    దీంతో చిర్రెత్తుకొచ్చిన లాస్య.. కోపంతో అక్కడి నుంచి వెళ్తుంది. నందు గురించి ఆలోచిస్తుంటుంది. ఆ సమయంలో భాగ్యం వచ్చి లాస్యను మరింత రెచ్చగొడుతోంది. నీ చేతుల్లోంచి నందు బావగారు జారి పోతోన్నారు.. తులసి నీ ట్రిక్ ప్లే చేస్తోంది.. ఆఫీస్ పని అంటూ దగ్గరవుతోందని ఎక్కించేస్తుంది.

    ఇక మరో వైపు పూజ చేస్తానంటూ శ్రుతి బయల్దేరితే.. అంకిత అడ్డు పడుతుంది. పెద్ద కోడలిని నేను.. నేను చెప్పినట్టు వినాలి.. పూజ నేనే చేస్తాను అని అంకిత అంటుంది. ఇది నేను మొక్కుకున్నాను.. వచ్చే ఏడాది నువ్ చేయి అని అంకితను అంటుంది శ్రుతి. అలా ఆ ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో మాత్రం లాస్య మొహం మాడిపోయింది.

    Leave a Reply