• November 10, 2021

ఒరేయ్ ఎందుకురా ఇలాంటివి రాస్తారు!.. రూమర్లపై స్పందించిన హైపర్ ఆది

ఒరేయ్ ఎందుకురా ఇలాంటివి రాస్తారు!.. రూమర్లపై స్పందించిన హైపర్ ఆది

    గత రెండు రోజులుగా కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మంచు విష్ణు మీద ఆది వేసిన కౌంటర్లు, సెటైర్ల సెగ గట్టిగానే తగిలినట్టుంది. ప్రోమోలో ఉన్న పంచుల ప్రభావం తలకు తగలడంతో ఈవెంట్‌లో లేపేశారని తెలుస్తోంది. అయితే ఆది మీద మంచు విష్ణు అభిమానులు దాడి చేశారు.. చితక్కొట్టేశారు అంటూ రూమర్లు బయటకు వచ్చాయి. అయితే దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. రకరకాలుగా మాట్లాడుకున్నారు.

    మంచు విష్ణుకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా? వాళ్లు కూడా దాడి చేశారా? ఇదే పెద్ద జోక్ అని కొందరు కామెంట్లు చేశారు. ఆది గాడిని చితక్కొట్టేశారట.. వాడికి అలానే కావాలి.. ఒకరిని కించపరిచి కామెడీ చేస్తాడా? వాడికి అలా కావాల్సిందే అని ఇంకొందరు కామెంట్లు పెట్టేశారు. దాడి జరిగిందని కొందరు.. జరగలేదని ఇంకొందరు ఇలా వాగ్వాదం పెంచుకున్నారు. అయితే తాజాగా ఆది మాత్రం అసలు విషయాన్ని చెప్పేశాడు. దాడి గురించి నోరు విప్పేశాడు.

    గత రెండు రోజులుగా ఏవేవో వార్తలు వస్తున్నాయ్.. నా కోసం ఎవరో వెతుకుతున్నారట.. నా మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారట.. అందులో ఎలాంటి నిజం లేదు.. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు రాస్తార్రా.. మీకు డబ్బులు లేకపోతే నన్ను అడగండి..నేను సంపాదించేదాంట్లో కొంత ఇస్తాను.. అసలు ఇలాంటి వార్తలు రాసేవాడికి మా శాంతి స్వరూప్‌ను అప్పగిస్తాను.. నేను ఇప్పుడు జబర్దస్త్ షూటింగ్ చేశాను.. నా వెనక రాజు గారు ఉన్నారు.. శాంతి స్వరూప్ ఉన్నాడంటూ అసలు సంగతిని చెప్పేశాడు.

    Leave a Reply