• November 15, 2021

బతికితే అలా బతికాలి.. స్టార్ హీరోపై హైపర్ ఆది కామెంట్స్

బతికితే అలా బతికాలి.. స్టార్ హీరోపై హైపర్ ఆది కామెంట్స్

    హైపర్ ఆది మాట్లాడే మాటలు, రాసే డైలాగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలకు డైలాగ్ రైటర్‌గా పని చేశాడు.ఏ సందర్భంలో ఏది మాట్లాడాలి.. ఎంత మాట్లాడాలి.. ఎవరిని ఎక్కడ పొగడాలి.. ఎవరి మీద ఎప్పుడు సెటైర్లు వేయాలి అని బాగా తెలుసు. అలాంటి హైపర్ ఆది తాజాగా ఓ హీరో మీద కామెంట్ చేశాడు. హీరో అంటే కేవలం తెర మీద ఫైట్లు, డ్యాన్సులు చేసి డైలాగ్స్ కొట్టే హీరో మాత్రమే కాదు. నిజ జీవితంలోనూ ఓ హీరోనే.

    పునీత్ రాజ్ కుమార్. ఈ పేరు ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ఒకరి పుట్టుక అనేది ఎవ్వరి చేతుల్లో ఉండదు. కానీ మరణించేటప్పుడు మాత్రం గొప్పమనిషి, రాజులా చనిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఎన్నో మంచి పనులు, దేవుడి లాంటి మంచి గుణం, సాయం చేసే ఆలోచనలు ఉన్న వాళ్లకు ఇలాంటి నివాళి దొరుకుతుంది. దేశంలోని ప్రతీ మూలన పునీత్ రాజ్ కుమార్ పేరు వినబడింది. ఆయన మరణంతో కన్నడ రాష్ట్రం మొత్తం కన్నీరు పెట్టుకుంది.

    అలాంటి పునీత్ రాజ్ కుమార్ గురించి శ్రీదేవీ డ్రామా కంపెనీ నివాళి అర్పించింది. పునీత్ రాజ్ కుమార్ గుప్త దానాల గురించి వివరింది. నేను చేయాల్సిన పనులు ఇతను అక్కడ ఉండి చేస్తున్నాడేంటి.. నా పక్కన ఉండాలి కదా? అని దేవుడే పునీత్ రాజ్ కుమార్‌ను తీసుకెళ్లాడని ఇంద్రజ ఎమోషన్ అయింది. బతికితే అలా బతకాలి అని నిరూపించిన ఏకైక స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంటూ హైపర్ ఆది కామెంట్ చేశాడు. అలా మొత్తానికి పునీత్ రాజ్ కుమార్ మీద చేసిన ఈ ఎపిసోడ్ అందరినీ కదిలిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

    Leave a Reply