- November 16, 2021
Guppedantha Manasu Episode 296 : నడిరోడ్డుపై వసు వీరంగం.. మనసులోని మాట చెప్పనున్న రిషి

Guppedantha Manasu Episode 296 గుప్పెడంత మనసు సీరియల్‌లో వసు, రిషిల మనస్తత్వాలు అందరికీ తెలిసింది. వసుకు ఆత్మాభిమానం ఎక్కువ. రిషికి ఇగో, మొండి పట్టుదల ఎక్కువ. ఈ ఇద్దరూ చేసే ప్రయాణమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మనసులో ఉన్నది బయటకు చెప్పుకోలేరు.. అసలు మనసులో ఏముందో వారికే తెలియదు. అలాంటి రిషి, వసుల మధ్య ఇప్పుడు కాస్త దూరం పెరిగింది. తనని అందరి ముందు అవమానించాడు.. ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాడంటూ రిషి దగ్గర పని చేయకూడదు, రిజైన్ చేయాలని వసు నిర్ణయించుకుంటుంది. కానీ అంతకంటే ముందే.. వసుని తీసేసి కొత్తవారిని అపాయింట్ చేసుకుంటాడు రిషి. ఇదంతా కూడా సోమవారం నాడు జరిగింది.
తనను ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు సమాధానం కావాలని నడి రోడ్డు మీద రిషికి అడ్డంగా నిలబడుతుంది వసు. సైకిల్‌తో చేజ్ చేసి మరీ కారుకు అడ్డంగా నిలబడుతుంది. సమాధానం కావాలని పట్టుబడుతుంది. నీకు చెప్పాల్సిన అవసరం అగత్యం నాకు పట్టలేదు అని రిషి వెళ్లిపోతాడు. మీరు సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలను అని చెబుతుంది. కానీ రిషి మాత్రం లైట్ తీసుకుంటాడు. అలా అక్కడినుంచి రిషి వెళ్లిపోతాడు.
వసు ఇంకా రాలేదని జగతి, మహేంద్రలు కంగారు పడతారు. ఫోన్ కూడా తీసుకెళ్లలేదు.. ఇలా ఎప్పుడూ జరగలేదు అని జగతి బాధపడుతుంది. రిషికి ఏమైనా తెలిసి ఉంటుందోమో ఫోన్ చేయండి అని మహేంద్రను అడుగుతుంది జగతి. మహేంద్ర ఫోన్ చేస్తుంటే పదే పదే కట్ చేస్తుంటాడు. చివరకు స్విచ్ ఆఫ్ చేస్తాడు. దీంతో ధరణికి ఫోన్ చేస్తాడు మహేంద్ర. రిషి మీద ఫుల్ కోపంగా ఉంటాడు మహేంద్ర. ఏం జరిగింది డాడీ అని కాస్త కూల్ అయి రిషి అడుగుతాడు.
వసు ఇంకా ఇంటికి రాలేదు.. అని చెప్పడంతో రిషి షాక్ అవుతాడు. అసలే వర్షం పడుతోంది.. వసుని నువ్ కలిశావా? అని అంటాడు. ఆ మాటతో షాకైన రిషికి అసలు విషయం అర్థమవుతంది. ధరణికి ఫోన్ ఇచ్చేసి వెళ్లిపోతాడు. ఇక వర్షంలో అలా నడి రోడ్డు మీద తడుస్తూనే ఉంటుంది వసు. అలా వసును చూసి రిషి షాక్ అవుతాడు. ఏంటి మొండితనం ఇలానే ఉంటావా? అని రిషి అంటాడు. నాకు సమాధానం కావాలి.. చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలను అని అన్నాను.. అంటూ వసు తిరిగి సమాధానం ఇస్తుంది.
సరే వెళ్దాం పద అని రిషి అంటాడు. నేను రాను సర్.. నాకు సమాధానం కావాలి అని వసు అంటుంది.. ఏం సమాధానం కావాలి అని రిషి అంటాడు.. నేను చేసిన తప్పేంటి.. ప్రతీ దానికి కోప్పడుతున్నారు.. దూరం పెడుతున్నారు.. అవసరం లేకుండా నా మీద కోపం వస్తోంది.. అని వసు తన బాధనంతా చెబుతుంది. నా కోపం నా ఇష్టం అని రిషి అంటాడు. అది నా మీద కోప్పడుతున్నారు కాబట్టి అడిగే హక్కు నాకు ఉంది అని వసు అంటుంది. చాలా రోజుల తరువాత హక్కు అనే మాట విన్నాను సరే వెళ్దాం పద..రోడ్డు ఏంటి ఈ న్యూసెన్స్ అని రిషి కాస్త అసహనం వ్యక్తం చేస్తాడు.
మీరేం అనుకున్నా నాకు పర్లేదు.. నాకు సమాధానం కావాలి.. నన్ను ఎందుకు ఉద్యోగం లోంచి తీసేశారు అని వసు అడుగుతుంది. ఆనాడు ఇంటర్వ్యూలోంచి వెళ్లిపోయావ్ కదా? అందుకే తీసేశాను అని అంటాడు. అప్పుడు చేస్తే అప్పుడే తీసేయాలి.. ఇప్పుడెందుకు అని అంటుంది వసు.. అది నా ఇష్టం అని రిషి అంటాడు.. అవసరాన్ని మించి తిట్టారు..అందరి ముందు నన్ను అవమానించారు.. ఒక జగతి మేడం దగ్గర తప్ప అందరి దగ్గర బాగానే ఉంటారు.. ఇప్పుడ నన్ను కూడా అలానే చేస్తున్నారు.. మీరు జెంటిల్మెన్ సర్.. మీరు మారిపోయారు సర్ అని వసు అంటుంది.. నేను మారలేదు అని రిషి అరుస్తాడు.. మీరు మారిపోయారు.. మనసులో ఏముంటే అది చెప్పే రిషి సర్ కాదు.. నా మీద ఎంత కోపం వచ్చినా.. అది కాసేపటికే మరిచిపోయేవారు.. ఆ రిషి సర్ కాదు అని వసు అంటుంది.
దీంతో రిషి బరస్ట్ అయ్యేట్టు కనిపిస్తోంది. రేపటి ఎపిసోడ్‌లో తన భ్రమలు తొలిగిపోయేలా ఉన్నాయ్.. నువ్ శిరీష్ పెళ్లి చేసుకుంటున్నారని నాకు ఎందుకు చెప్పలేదు అని రిషి అనడంతో.. వసు షాక్ అవుతుంది. నేను శిరీష్ పెళ్లి చేసుకుంటున్నారని ఎవరు చెప్పారు సర్ మీకు అని వసు అడుగుతూ కళ్లు తిరిగి కింద పడిపోతుంది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరుగుతుందో చూడాలి..