• November 15, 2021

Guppedantha Manasu Episode 295 : దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చాడు.. రిషి దెబ్బకు వసు షాక్

Guppedantha Manasu Episode 295 : దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చాడు.. రిషి దెబ్బకు వసు షాక్

    ఓడిపోయిందన్న నెపంతో వసును అందరి ముందు ఇష్టమొచ్చినట్టుగా మాటలు అనేశారు. ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీశాడు రిషి. గత శనివారం ఇదే జరిగింది. ఇక సోమవారం నాడు అది కంటిన్యూ అయింది. వసును అలా ఎందుకు అన్నావ్ అంటూ రిషితో మహేంద్ర మాట్లాడతాడు. ఆకాశంలోఉంది.. నేల మీదకు దించాను అని రిషి అంటాడు. వసు ఎంతో స్ట్రాంగో అంతే సెన్సిటివ్ అని అంటాడు మహేంద్ర. అది ఒక సాకు కాకూడదు.. కాన్సిడెన్స్‌కు కేరాఫ్.. విజయానికి పర్మనెంట్ అడ్రస్ అంటా అని వసు అందని రిషి చెప్పాడు. అదేదో సరదాకు అని అంటుంది రిషి అంటూ మమేంద్ర సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ రిషి మాత్రం వినలేదు.

    మరో వైపు వసుకు సర్ది చెప్పేందుకు జగతి చూసింది. కానీ మాట వినలేదు. అసిస్టెంట్‌గా జాబ్ రిజైన్ చేస్తాను అని మొండికేసింది. మర్యాద లేని చోటకు మన నీడ కూడా వెళ్లకూడదు.. నేను ఆయన దగ్గర పని చేయకూడదు.. అని నిర్ణయించుకున్నాను అందుకే ఈ లెటర్ రాస్తున్నాను అని వసు ఫిక్స్ అయింది. ఇక రిషికాస్త ఆలోచనల్లో పడ్డాడు. డాడీ చెప్పినట్టు నేను ఎక్కువ చేశానా? ఎక్కువ మాటలు అనేశానా? అని బాధపడుతుంటాడు. సారీ చెప్పాలా? అని తర్జనభర్జనలాడతాడు. తాను చేసింది కరెక్టే.. అలాంటప్పుడు సారీ చెప్పాల్సిన పని లేదని ఊరుకుంటాడు. మీరంటే గౌరవమే.. కానీ నా ఆత్మ గౌరవం, ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశారు.. దగ్గర లేకపోతేనే విలువ తెలుస్తుంది.. నాకూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉటుంది.. దాన్ని దెబ్బ తీస్తే ఎవ్వరినైనా సరే క్షమించేది లేదు.. అంటూ వసు రిజైన్ లెటర్ రాసుకుంటుంది.

    ఇక ఉదయం కాగానే కాలేజ్ వద్ద జగతి,మహేంద్రలు కలుసుకుంటారు. ఎందుకు త్వరగా రమ్మన్నావ్ అని జగతిని మహేంద్ర అడుగుతాడు. కాస్త దూరంగానే కూర్చుందాం.. ఇలా మనం ఇక్కడ దగ్గరగా కూర్చోడం చూసే ఆనాడు అలా అన్నాడంటూ రిషి మాటలను గుర్తు చేసుకుంటుంది జగతి.ఏమైంది డల్‌గా ఉన్నావ్ ఎందుకు రమ్మన్నావ్ అని అంటాడు. రిషి ఎలా ఉన్నాడు అని జగతి అడుగుతుంది. అలానే కోపంతో భగభగ మండిపోతోన్నాడు అని మహేంద్ర అంటాడు. వసుధార ఏంటుంది? ఫీల్ అయిందా? అని అడుగుతాడు. ఫీల్ అవ్వడం ఏంటి? రిషి అసిస్టెంట్‌గా పని చేయనని అంటోంది.. అని జగతి చెబుతోంది. అదేంటి? అని మహేంద్ర ఆశ్చర్యపోతాడు.

    అదేంటని అంటావేంటి మహేంద్ర?.. రిషి అన్నన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు.. రిషి దగ్గర పని చేయను అని చెప్పింది అంటూ జగతి చెబుతుంది.. రాజీనామా చేస్తే కథ మళ్లీ మొదటికి వచ్చింది అని మహేంద్ర తనలో తాను అనుకుంటాడు.. చేసింది తప్పే అయినా సమర్థించుకుంటున్నాడు అని మహేంద్ర అంటాడు.. వసుని ఆపలేమా? అని ధీనంగా అడుగుతాడు మహేంద్ర.. గొడవ పెద్దది అవుతుంది తప్పా జరిగిదేమీ లేదు అని మహేంద్ర అంటాడు.. ఆనాడు పెళ్లి పీటలు నుంచి వచ్చినప్పుడు వసు కంట్లో కన్నీళ్లు కనిపించాయి. అప్పుడు ఆవేద, చదువు మీద ప్రేమ కనిపించాయ్.. ఇప్పడు తన కళ్లలోని నీళ్లను చూస్తే నాకూ ఏడుపు వచ్చింది. ఆడదాని ఆత్మాభిమానం మీద దెబ్బ పడితే.. దాని బాధ ఎలా ఉంటుందో నాకూ తెలుసు.. అని జగతి బాధపడుతుంది. నయానోభయానో వారిద్దరి మధ్య రాజీ కుదుర్చుతాను.. అంతా బాగుందని అనుకుంటే.. ఇలా జరిగిందేంటి.. అని మహేంద్ర తెగ ఆలోచిస్తాడు.

    వసుకు మహేంద్ర ఎదురువెళ్తాడు. గుడ్ మార్నింగ్ సర్ అని వసు అంటుంది. ఇది జస్ట్ మార్నింగ్.. గుడ్ కాదు.. రిషి దగ్గర పని చేయడం మానేస్తున్నావట.. జగతి చెప్పింది అని వసుతో మహేంద్ర అంటాడు.. చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి అని మహేంద్ర అంటాడు.. చిన్న గొడవలు కాదు.. నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు. తప్పొప్పులు, గొడవలు, ఒక దశ వరకే ఉంటాయి.. అవి దాటిపోయినప్పుడు.. ఎదుటి వాళ్లు హద్దులు దాటినప్పుడు.. ఎవ్వరూ చెప్పినా వినను. ఆల్రెడీ నేను నిర్ణయం తీసుకున్నాను.. మీరు అడిగిన గురు దక్షిణ చెల్లించలేను.. మీరు చెప్పిన పని నేను చేయలేను.. నా ఆత్మాభిమానాన్ని చంపుకుని రిషి దగ్గర పని చేయలేను. అని వసు అంటుంది. ప్లీజ్ ఒక్కసారి నాకోసం అంటూ బతిమిలాడతాడు మహేంద్ర.. మీరంటే నాకు గౌరవం.. జగతి మేడం గారంటే కూడా గౌరవం..కానీ నా ఆత్మ గౌరవం అంటే ముఖ్యమే కదా? సర్ అని వసు వెళ్లిపోతుంది.

    కానీ అక్కడ రిషి అసలైన షాక్ ఇస్తాడు. వసు రిజైన్ చేసే కంటే ముందే.. ఆమెను పనిలోంచి తీసేసి వికాస్ అనేవాడిని అపాయింట్ చేసుకుంటాడు. దీంతో వసుకు ఇంకా కాలుతుంది. అలా ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తుంది. ఆ హక్కు నాకుందని రిషి అడుగుతాడు. అడిగే హక్కు నాక్కూడా ఉంటుంది అని వసు నిలదీసింది. నాకు సమాధానం కావాలి అంటూ వసు పట్టుబడుతుంది. వసుధార సీన్ చేయకు.. నీ దగ్గరున్న ఫైల్స్ వికాస్‌కు ఇవ్వు అని అంటాడు. వెల్కమ్ టు డిబీఎస్టీ మిషన్ ఎడ్యుకేషన్ అని అంటాడు. దీంతో వసుకు ఇంకా మండుతుంది.

    వసు ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. కానీ రిషి వినకుండా కారులో వెళ్లిపోతాడు. ఇక ఆ కారును సైకిల్‌తో చేజ్ చేస్తుంది వసుధార. అది కాస్త కామెడీగానే అనిపిస్తుంది. మొత్తానికి రేపటి ఎపిసోడ్‌లో రిషి కారుకు అడ్డంగా ఉంటుంది వసు. ఎందుకు తీసేశారో కారణం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలను అని భీష్మించుకుంటుంది. అలా మొత్తానికి వసు షాకిద్దామని చూస్తే.. రివర్స్‌లో వసుకే షాక్ ఇచ్చాడు రిషి. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply