• November 11, 2021

Guppedantha Manasu Episode 292 : సారీ చెప్పేందుకు కూడా ఇగో అడ్డు.. వసు చేతిని పట్టుకున్న రిషి

Guppedantha Manasu Episode 292 : సారీ చెప్పేందుకు కూడా ఇగో అడ్డు.. వసు చేతిని పట్టుకున్న రిషి

    గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పుడు యూటర్న్ తిరిగే చాన్స్ ఉంది. వసు శిరీష్‌ల పెళ్లి అనే భ్రమలో రిషి ఉంటాడు. వసు పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందనే కోపంతో రిషి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిసున్నాడు. అదే కోపాన్ని ఆర్టికల్ రాయడం మీద కూడా చూపించాడు. అయితే తప్పు తనదే అని గురువారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుంటాడు. ముందే చెప్పేందుకు వచ్చింది కానీ నేను చూడలేదు.. తప్పు నాదే అనుకుంటాడు. అలా మొత్తానికి ఇగో లెక్చరర్ మాత్రం సారీ చెప్పేందుకు కూడా ఎన్నో సార్లు ఆలోచిస్తాడు. అసలు గురువారం నాడు ఏం జరగబోతోందో ఓ సారి చూద్దాం.

    గురువారం నాడు తండ్రీ కొడుకుల సెంటిమెంట్ మీద సీన్ ఓపెన్ అవుతుంది. తిన్నావా? రిషి అని మహేంద్ర అంటాడు. మీరు తిన్నారా డాడీ అని రిషి అంటే.. ఓ నేను పుష్టిగా తినేశాను అని అంటాడు. మరి ఇంకెందుకు అడుగుతున్నారు.. మీరు ఏదో నాకు తీసుకొచ్చి తినిపించేట్టు అని సెటైర్ వేస్తాడు. అంతలోపు ధరణి వస్తుంది. ఓహో అయితే ఏర్పాటు చేసుకునే వచ్చారన్న మాట అని రిషి అంటాడు. నిజం చెప్పండి మీరు తిన్నారా? అని రిషి అంటాడు. నువ్ తినకుండా నేను ఎందుకు తింటాను రిషి అని మహేంద్ర అంటాడు. అలా తండ్రీ కొడుకులిద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటారు.

    పొగరు తిందో లేదో అని వసు గురించి రిషి ఆలోచిస్తాడు. అక్కడ వసు ఏమో రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.నేను ఏం తప్పు చేశానో అడుగుతాను అంటూ రిషికి మెసెజ్ చేస్తుంది వసు. కానీ ఆ మెసెజ్‌ను కావాలనే చూడకుండా ఉంటాడు రిషి. అలా రూంలో నడుస్తుంటే చెత్త బుట్టలో మొన్న విసిరేసిన ఆర్టికల్ పేపర్స్ కనిపిస్తాయి. అంటే వసు నాకు ముందే చెప్పేందుకు వచ్చింది. ఆర్టికల్ చూడమని ఇచ్చింది అంటే నేను అనవసరంగా కోప్పడ్డానా? కోప్పడలేదు.. అరిచేశాను.. అంటే సారి చెప్పాలా? అవసరమా? అని అనుకుంటాడు. అయినా వసు శిరీస్ కలిసి వచ్చారు. నాకు ఆ ఆర్టికల్ గురించి చెబుదామని ప్రత్యేకంగా రాలేదు కదా? అంటే సారి చెప్పాల్సిన అవసరం లేదంటూ ఇలా సారి చెప్పాలా?వద్దా? అని ఆలోచిస్తూనే ఉంటాడు.

    ఇక పేపర్ మీద వసుధార శిరీష్ అని రాస్తాడు. ఈ పేర్లు బాగా లేవు. రిషి వసుధార అయితే పలకడానికి, వినడానికి బాగుంది.. రిషిధార ఇంకా చాలా బాగుంది అని అనుకుంటాడు. కానీ వసుధార చేసిన పనే బాగాలేదు.. తీసుకున్న నిర్ణయం ఇంకా బాగాలేదు.. నువ్ ఎవరిని పెళ్లి చేసుకుంటే.. నాకేంటి.. నీ గురించి ఆలోచించను.. ఊహలు బాగానే ఉంటాయి కానీ అవి నిజమవ్వవు కదా? అని అనుకుంటాడు. అలా చివరకు వసు పంపిన మెసెజ్ చూస్తాడు. రేపు పిక్ అప్ చేసుకుంటాను గుడ్ నైట్ అని చెప్పేస్తాడు.

    సీన్ ఓపెన్ చేస్తే.. కార్లో రిషి, వసు ఉంటాడు. మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ బయటకు మాత్రం మాట్లాడరు. నువ్ మాట్లాడొచ్చు కదా? అని ఒకరు అనుకుంటే.. నువ్ మాట్లాడుకోవచ్చు కదా? అని ఇంకొకరు మనసులో అనుకుంటారు. మొత్తానికి మాటలు మొదలవుతాయి. ఏం తిన్నావ్ అని రిషి అంటే.. ఏం తినలేదు అని వసు అంటుంది. మీరేం తిన్నారు అంటే.. చాలా తిన్నాను అని రిషి చెబుతాడు. కానీ అప్పుడే మహేంద్ర ఫోన్ చేస్తాడు. టిఫిన్ తినకుండా ఎందుకు వెళ్లావ్.. కారు వెనక సీట్లో టిఫిన్ పెట్టాను తిను అని చెబుతాడు.

    ఇలా దొరికిపోయాన్ ఏంట్రా అని రిషి ఫీలవుతాడు. మొత్తానికి ఇద్దరూ కలిసి టిఫిన్ తింటూ ఉంటారు. అప్పుడు అసలు సంగతి అడిగేస్తాడు. మరి రిషి అనుకుంటున్నట్టుగా.. జరిగేది శిరిష్ వసు పెళ్లి కాదని తెలిస్తే కథ ఎలా తిరుగుతుందో చూడాలి.

     

    Leave a Reply