• November 10, 2021

Guppedantha Manasu Episode 291 : దారుణంగా అవమానించేశాడు.. వసును బాధపెట్టిన రిషి

Guppedantha Manasu Episode 291 : దారుణంగా అవమానించేశాడు.. వసును బాధపెట్టిన రిషి

    గుప్పెడంత మనసు బుధవారం నాటి ఎపిసోడ్‌లో రిషి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పుష్ప ఆ ఆర్టికల్ రాయలేదని చెప్పడంతో అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. వసుధారను పిలిచి నానా చీవాట్లు పెట్టేశాడు. గతంలోని సంఘటనలు గుర్తు చేసి మరీ కించపరిచాడు. నా మాట కాదని ఎలా రాస్తుంది.. నాకు ఆత్మాభిమానం ఉండదా? ఒకప్పుడు ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పింది.. మధ్యలో ఇంటర్వ్యూకు హ్యాండ్ ఇచ్చింది అంటూ ఇలా గత ఘటనను గుర్తు చేశాడు.

    వసును దారుణంగా మాటలు అనేశాడు. చదువు ఒక్కటే కాదు క్రమశిక్షణ కూడా ఉండాలి.. అంటూ నానా రకాలు చీవాట్లు పెట్టేశాడు. చిన్న విషయానికి ఎందుకు ఇలా చేస్తున్నావ్ రిషి అని.. మహేంద్ర మధ్యలోకి వచ్చే ప్రయత్నం చేశాడు. ఇది చిన్న విషయం కాదు డాడీ.. మన కాలేజ్ సిస్టంను వసుధార ధిక్కరించింది. అందరూ ఇష్టమొచ్చినట్టు చేసుకుంటే వెళ్తే నేను ఎందుకు ఇక్కడ. ఏదీ చేసినా ఎవ్వరూ ఏమీ అనరనే ధైర్యమా? అంటూ వసు మీద రెచ్చిపోయాడు రిషి.

    ఫ్యాకల్టీ హెడ్‌గా నేనే రాయమన్నాను అని జగతి చెప్పే ప్రయత్నం చేసింది. ఫ్యాకల్టీ హెడ్ అంటే ఏంటి.. నాకు హెడ్ కాదు కదా? మీరు చెబితే వసుధార రాస్తుందా? నన్ను అడగాలి కదా? నా పర్మిషన్ తీసుకోవాలి కదా? ఇలా ఇష్టమొచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు.. నా అధికారాన్ని కాదని, నా మాట కాదని చేయడం కరెక్ట్ కాదు.. మీ ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే కుదరుదు ఇక్కడ.. అని రిషి వెళ్లిపోయాడు.

    ఇక ఇంటికి వెళ్లిన తరువాత రిషి, వసుధారలు ఇద్దరూ ఒకే రకమైన ఆలోచనలు, మాటలతో గడిపేస్తారు. అక్కడ వసు తన మనసులో వేసుకునే ప్రశ్నలకు ఇక్కడ రిషి సమాధానం ఇస్తున్నట్టు అనిపిస్తుంది. పెళ్లి చేసుకునే ఆలోచన వచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా? అని రిషి.. నేను ఏం తప్పు చేశానో చెబితే సరిదిద్దుకునే దాన్ని కదా అని వసు అనుకుంటుంది. సరిదిద్దుకోలేని తప్పు చేశావ్.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావ్ అని రిషి అనుకుంటాడు. ఒకప్పటిలా మీరు లేరు సర్.. మారిపోయారు అని వసు అనుకుంటుంది. అవును ఒకప్పటిలా నేను లేను.. ఒకప్పుడు ఇంత సున్నితంగా ఉండేవాడిని కాదు..నేను ఎందుకు మారిపోయాను.. నా చుట్టూనేను ఓ గోడ కట్టుకున్నానా? అని రిషి అనుకుంటాడు.

    మీరు ప్రిన్స్ సార్.. రాజు తన మనసులో ఉన్నది చెప్పాలి.. శిక్షించాల్సిన సమయం వస్తే శిక్షించాలి అంటూ వసు అనుకుంటుంది. ఆర్టికల్ రాసినందుకే అంత కోపమా? దానికే అంత కోపం వచ్చిందంటే అబద్దమవుతుంది.. మరి నిజం ఏంటి? ఏమో మరి.. అయినా వసుధార గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను.. ఈ రోజు ఉంటుంది.. రేపు వెళ్లిపోతుంది.. అని రిషి అనుకుంటాడు. ఫోన్ చేయాలా? అని వసు ఆలోచిస్తుంది.. ఫోన్ చేయాలా? అవసరమా? అని రిషి కూడా అనుకుంటాడు.

    దీర్ఘాలోచనలో ఉన్న వసు దగ్గరకు జగతి వస్తుంది. తినడానికి రమ్మంటుంది. కాలేజ్ విషయాలు ఇంటి వరకు మోసుకురావొద్దు.. అవన్నీ మనసుకు భారంగా అవుతాయ్.. తినకుండా పడుకోకూడదు. కనీసం ఫ్రూట్స్ అయినా తిను అని జగతి అంటుంది. మేడం ఏమో ప్రేమ చూపిస్తుంది.. సర్ ఏమో కోపం చూపిస్తారు అని వసు అనుకుంటుంది.

    ఇక రిషి దగ్గరకు మహేంద్ర వస్తాడు. ఆర్టికల్ రాసినందుకే ఇంత కోపం వచ్చిందా? లోపల ఏదో ఉందని నాకు అనిపిస్తోంది. నీ ఇగో కోసం అలా చేశావ్ అని నాకు అనిపిస్తోందని రిషితో మహేంద్ర మాట్లాడతాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మంచి సీన్ పడేలా ఉంది. అయితే అది రిషి భ్రమ కూడా కావొచ్చు. ఏకంగా వసు చేతిని పట్టుకుని.. ఆ శిరీష్‌ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్ అని అడిగేస్తాడు. చూస్తుంటే రిషి కల కంటున్నట్టు అనిపిస్తోంది.

    Leave a Reply