• November 5, 2021

Guppedantha Manasu Episode 287 : ఆ సీన్ చూడటంతో రిషి హర్ట్.. వసుపై మారని తీరు

Guppedantha Manasu Episode 287 : ఆ సీన్ చూడటంతో రిషి హర్ట్.. వసుపై మారని తీరు

    గుప్పెడంత మనసు శుక్రవారం నాడు జరగబోయేది ఏంటో చూద్దాం. మన భూమి పత్రిక కోసం ఆర్టికల్ రాసేందుకు పుష్పకు పని చెప్పాడు రిషి. గురువారం నాడు ఆ సంగతి గడిచింది. దాని కంటిన్యూగా శుక్రవారం నాడు జరిగింది. ఆర్టికల్ రాయలేనని పుష్ప అనడం, నువ్వే రాయమని వసును ఒత్తిడి చేస్తుంది. అయితే రాస్తే రిషి కోప్పడతాడు.. రాయకపోతే పుష్ప బాధపడుతుంది. ఇలాంటి సందిగ్దంలో వసు పడిపోతుంది.

    మరో వైపు రిషి మనసులో ఏముందో అని తెలుసుకునేందుకు దేవయాణి ప్రయత్నించింది. టీ ఇచ్చే పేరిటి రిషిని కవ్వించింది. అక్కడ ఒకరితో మనకు సంబంధం లేదు. ఇంకొకరు పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు. మనం ట్రైన్‌లో ప్రయాణిస్తే.. ఎంతో మంది కలుస్తారు. వెళ్తారు.. మనం ఒంటరిగానే ఉంటాం అంటూ రిషి ఏదేదో చెబుతాడు. మొత్తానికి రిషి మాత్రం జగతి గురించి, వసు గురించి ఆలోచించడం లేదు అని దేవయాణి తృప్తి పడుతుంది.

    అక్కడ సీన్ కట్ చేస్తే.. జగతి, మహేంద్రలు మాట్లాడుకుంటూ ఉంటారు. మధ్యలో వసు వస్తుంది. తన సమస్యను జగతి, మహేంద్రల ముందు ఉంచుతుంది. రాస్తే రిషి సర్‌కు కోపం.. రాయకపోతే పుష్ప బాధపడుతుందని చెబుతుంది. ఫ్యాకల్టీ హెడ్‌గా చెబుతున్నా.. నువ్వే రాయాలి.. మన కాలేజ్ కోసం రాసే ఆర్టికల్ బాగుండాలి కదా? అని వసును ఎంకరేజ్ చేస్తుంది జగతి. అయితే ఒక్కసారి రిషిని అడుగుదామని వసు ప్రయత్నిస్తుంది. కానీ వసు మెసెజ్‌లకు రిషి సరిగ్గా స్పందించడు.

    మొత్తానికి వసు ఆ ఆర్టికల్ రాసేస్తుంది. అయితే ఉదయం కాగానే రిషి ఇంటికి శిరీష్,వసు వెళ్తారు. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేందుకు వెళ్తారు. అక్కడ ఆ ఇద్దరికి ధరణి టీ ఇస్తుంది. కానీ శిరీష్ తీసుకోడు. వద్దంటాడు. మేం ఇద్దరం షేర్ చేసుకుంటామని వసు అంటుంది. సాసర్‌‌లో టీ పోసి ఇద్దరూ షేర్ చేసుకుంటారు. ఆ సీన్ చూసి రిషికి మండుతుంది. అటు నుంచి అటే లోపలకి రిషి వెళ్తాడు. ఇక రిషిని శిరీష్ కలిస్తేఎలా అని మహేంద్ర తెగ కంగారు పడతాడు. కలుస్తాను అని శిరీష్ అంటే.. వద్దు అని మహేంద్ర అంటాడు. రిషి ప్రేమను బయటపెట్టేందుకు ఇంతకన్నా మంచి సందర్భం రాదని మహేంద్ర అనుకుంటాడు. ఇదే సందు అనుకుని రిషి దగ్గరకు వసుని పంపిస్తాడు. ధరణికి చెప్పి వసుని రిషి దగ్గరకు తీసుకెళ్లమని అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    అయితే రిషి మాత్రం వసును చూడగానే ఆవేశపడతాడు. శిరీష్ పెళ్లి అంటూ వసు ఏదో చెప్పబోతోంటే.. నాకు అంత టైం లేదు అంటూ రిషి కసురుకున్నట్టు మాట్లాడతాడు. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. శిరీష్ పెళ్లి వసుతో కాదని తెలుస్తుందో లేదో మరి.

    Leave a Reply