• November 4, 2021

Guppedantha Manasu Episode 286 : మనసు ఒకచోట మనిషి మరో చోట.. గందరగోళంలో రిషి

Guppedantha Manasu Episode 286 : మనసు ఒకచోట మనిషి మరో చోట.. గందరగోళంలో రిషి

    గుప్పెడంత మనసు సీరియల్‌లో గురువారం నాడు వసు, రిషిల మీద ఎపిసోడ్ అంతా కూడా నడుస్తుంది. ఆర్టికల్ రాసే పనిని తనకు కాకుండా తన ఫ్రెండ్ పుష్పకు ఇవ్వడంతో వసు హర్ట్ అవుతుంది. కావాలనే ఇలా చేసి ఉంటాడు.. కోపం వచ్చి ఉంటుందని రిషికి మెసెజ్ పెడుతుంది వసు. నా మీద ఎందుకు అంత కోపం అని రిషికి మెసెజ్ పెడుతుంది వసు. ఇక రిషి కాలేజ్ నుంచి కారులోంచి వెళ్తుండటం చూసి దానికి అడ్డంగా నిల్చుంటుంది.

    సడెన్‌గా కారు ఆపిన రిషి.. వసు మీద ఫైర్ అవుతాడు. ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తావా? ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆర్టికల్ నన్ను ఎందుక రాయొద్దని అన్నారు.. అని అడుగుతుంది. అది నా ఇష్టం అని రిషి అంటాడు. అయినా ఆ మెసెజ్ ఏంటి? నువ్ అడిగితే నేను చెప్పాలా? అని రిషి అంటాడు. నువ్ ఇంతకు ముందులా హ్యాండ్ ఇవ్వవు అని గ్యారెంటి ఏంటి? అని అంటాడు. ఇంటర్వ్యూ కోసం రమ్మంటే చివర్లో హ్యాండ్ ఇచ్చావ్.. మళ్లీ ఇప్పుడు ఇవ్వవని గ్యారంటి ఏంటి? అని అంటాడు రిషి.

    అందుకే పాత అసిస్టెంట్ హ్యాండ్ ఇస్తోందని కొత్త వాళ్లని చూసుకుంటాను. నా ఇష్టం ఉన్న వాళ్లతో రాయిస్తాను. నీలాంటి వాళ్లను తయారుచేసుకోవాలి కదా? షార్ప్‌గా ఉండే వాళ్లను.. నా అసిస్టెంట్లను ఒక్కరిని కాదు నలుగురిని పెట్టుకుంటాను అది నా ఇష్టం అని రిషి అంటాడు. దీంతో వసు కాస్త హర్ట్ అవుతుంది. లిఫ్ట్ కావాలా? అని అడుగుతాడు. కానీ అంతలోనే నీ దారి వేరే నా దారి వేరే అని రిషి అంటాడు. లిఫ్ట్ ఇవ్వడం కుదరదు అని అనేస్తాడు.

    అలా వసు ఒంటరిగా అక్కడే నిల్చుండిపోతోంది. మహేంద్ర, జగతి వచ్చి వసును ఏమైందని అడుగుతారు. రిషి సర్ నా మీద కోపంగా ఉన్నాడని వసు అంటుంది. రిషి కోపంగా ఉన్నాడంటే అది రిషి తప్పు.. నువ్ ఎక్కువగా ఆలోచించకు.. నిన్ను రెస్టారెంట్‌లో వదిలేస్తాను.. పదా అంటూ జగతి అంటుంది.

    ఇక రిషి తన కారులో వెళ్తూ వసు ఆలోచనల్లొ మునిగిపోతాడు. నీ మీదున్న ఫీలింగ్స్ ఒక్కోసారి మారిపోయాయి.. మారినప్పుడల్లా నీకు చెప్పాను.. అందులో కొన్ని కారణలు చెప్పాను.. ఇంకొన్ని చెప్పలేకపోయినా.. అంటూ తనలో తాను అనుకుంటూ వచ్చాడు. మీరు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పడం చాలా కష్టం సర్ అంటూ వసు అన్న మాటలను తలుచుకుంటాడు. నాకు నేను ఏంటో తెలియడం లేదు అని రిషి అనుకుంటాడు.

    అయితే తెలియకుండానే వసు పని చేసే రెస్టారెంట్‌కు వెళ్లేశాడు రిషి. ఇదేంటి ఇక్కడికి వచ్చాను.. నాకు తెలియకుండా నా మనసు ఇక్కడికి తీసుకొచ్చిందా? అని అనుకుంటాడు రిషి. మరో వైపు జగతి.. వసును కూడా రెస్టారెంట్ వద్ద వదిలేస్తుంది. కానీ రిషి, వసు అక్కడ ఎదురుపడరు.

    ఇంట్లో రిషి గురించి దేవయాణి తన భర్తతో చెబుతుంది. ఎందుకో ఏదోలా ఉంటున్నాడు.. వాడి చుట్టూ ఏదో జరుగుతొంది అని రిషి గురించి దేవయాణి తన భర్తతో చెబుతుంది. ఇంట్లో ఖాళీగా ఉంటున్నావ్. ఇలాంటివి చెబుతుంటావ్ అని కసురుకుంటాడు. ఇక రిషి రావడంతో.. ఏమైంది? రిషి.. అంతా బాగానే ఉన్నావ్ కదా? అంటూ కుశల ప్రశ్నలు వేస్తుంది దేవయాణి. ఏమైంది? ఎందుకు అలా అడుగుతున్నావ్ పెద్దమ్మ అంటూ రిషి తిరిగి ప్రశ్నిస్తాడు. ఏం లేదులే.. లెమన్ టీ కావాలా? అని అడిగితే.. నీ ఇష్టం పెద్దమ్మా అని వెళ్లిపోతాడు.

    ధరణిని పిలిచి ఓ లెమన్ టీ రెడీ చేసి నాకు ఇవ్వు.. నేను రిషికి ఇస్తాను అని అంటుంది. ఇక అంతకు ముందే ఈ ఇద్దరి మధ్య ఓ చర్చ కూడా నడుస్తుంది. రాత్రి మహేంద్రతో ఏం మాట్లాడావ్ అని ధరణిని దేవయాణి అడుగుతుంది. వసుధారకు, రిషికి గొడవ జరిగిందేమో అనిపించింది.. అదే అడిగాను.. కానీ మావయ్య గారికి కూడా తెలీదంటూ అని ధరణి చెప్పింది. ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు నాకు స్వీట్ చేసి పెట్టు అని అంటుంది.

    రేపటి ఎపిసోడ్‌లో రిషికి మరింత కాలబోతోంది. వసు, శిరీష్ ఇద్దరూ కలిసి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వచ్చారు. కానీ రిషి మాత్రం ఆ పత్రిక తీసుకునేందుకు కూడా ఇష్టపడడు. వసు పైకి వెళ్లగా.. రిషి బాక్సింగ్ రింగ్‌తో కుస్తీ పడుతూ ఉంటాడు. ఎంతో మంది వస్తారు.. ఇంకెంతో మంది వెళ్తుంటారు.. మనతో ఎప్పుడూ ఎవరు ఉండరు కదా? అంటూ రిషి ఏదేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడుతుంటాడు. మొత్తానికి రిషి మాత్రం తన భ్రమల్లోనే బతుకుతున్నాడు.

    Leave a Reply