- November 3, 2021
Guppedantha Manasu Episode 285 : వసును అవమానించిన రిషి

గుప్పెడంత మనసు సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతోందో ఓ సారి చూద్దాం. వసు కంటికి దెబ్బ తగలడం, చున్నీతో రిషి ఆవిరిపట్టడం మంగళవారం నాటి ఎపిసోడ్‌లో జరిగింది. అయితే నేటి ఎపిసోడ్‌లో దాన్ని తలుచుకుంటూ వసు తెగ సంబరపడుతుంది. తమ కాలేజ్ గురించి, మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఓ ఆర్టికల్ రాయమని మన భూమి పత్రిక వాళ్లు ఫోన్ చేశారట. ఆ ఆర్టికల్ఎవరి చేత రాయించాలని ఇ:ట్లో చర్చ జరిగింది. వసు రాస్తుంది అని మహేంద్ర అంటే.. దేవయాని ఓ పుల్ల వేస్తుంది. ఆమె తప్ప ఇంకొకరు లేరా? మనం ఆమె మీద బతికి ఉన్నామా? అంటూ రిషిని రెచ్చగొడుతుంది.
వసు పెళ్లి చేసుకుని పోతే మనం కాలేజ్‌ని మూసేస్తామా? లేదు కదా? అంటూ రిషి కూడా కొన్ని మాటలు అనేస్తాడు. వసు పెళ్లి జరుగుతుందనే కోపం ఉంది గానీ ప్రేమ మాత్రం బయటపెట్టడం లేదు అని మహేంద్ర తన కొడుకు గురించి లోలోపల అనుకుని నవ్వుకుంటాడు. వేరే వాళ్లతో ఆ ఆర్టికల్ రాయిద్దామని రిషి నిర్ణయిస్తాడు.
ఇక మరో వైపు వసు.. రిషి చేసిన పనిని తలుచుకుంటూ మురిసిపోతుంది. అయితే ఆ విషయాన్ని గమనించిన జగతి మేడం అసలు విషయం అడుగుతుంది. రిషికి ఇలాంటి చిన్న విషయాలు కూడా తెలుసా? నాకు ఎంతో సంతోషంగా ఉంది మేడం అంటూ వసు అంటుంది. రిషిని ఎందుకు అంత చులకనగా చూస్తావ్ అని వసుని జగతి అడిగింది. ఐశ్వర్యంలో పుట్టాడు కదా? ఇలాంటి చిన్న చిన్నవి కూడా తెలుస్తాయా? అని అనుకున్నాను మేడం అని వసు అంటుంది. ఎక్కువగా జ్ఞాపకాలు పెంచుకోకు.. అవన్నీ కోల్పోవాల్సి వస్తుంది అని స్వీట్ వార్నింగ్‌లాంటిది ఇచ్చింది జగతి.
ఇక సీన్ కట్ చేస్తే.. ధరణి, మహేంద్రలు మాట్లాడుకున్న సీన్ ఓపెన్ అవుతుంది. రిషి చాలా మారిపోయాడు. ఇది వరకు ఉన్నట్టు ఉండటం లేదు.. ఏదిఉన్నా నాతో చెప్పేవాడు. కానీ ఇప్పుడేం చెప్పడం లేదు అంటూ మహేంద్రతో ధరణి అంటుంది. వాడిని ఇప్పుడేం అడగకు.. వాడే చెబుతాడు.. అంటూ మహేంద్ర అంటాడు. నేను ఎప్పుడూ రిషిని ఏదీ అడగలేదు.. రిషి చెప్పింది మాత్రమే వింటాను అని ధరణి అంటుంది. వసు వచ్చాక రిషి చాలా మారిపోయాడు అని ధరణి అంటే.. అవును రిషికి కొత్త ప్రపంచాన్ని చూపించింది. పెద్దమ్మ దేవయాని మాత్రమే ప్రపంచం అనుకునే వాడికి ఇంకొక కొత్త ప్రపంచాన్ని చూపించింది వసు అంటూ మహేంద్ర అంటాడు.
ఇక ధరణి, మహేంద్రలు మాట్లాడుకోవడం చూసిన దేవయాణి తెగ కంగారు పడుతుంది. ఏం మాట్లాడుకుని ఉంటారు. ఏ గూడు పుఠాణి చేస్తుంటారు.. జగతి గురించి మాట్లాడుకున్నారా? నా గురించి మాట్లాడుకున్నారా? ఏది ఏమైనా ధరణి నా చేతుల్లోంచి జారిపోతోందని దేవయాణి అనుకుంటుంది.
పుష్ప, వసు కాలేజ్‌లో ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటారు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయంటూ పుష్ప తెగ కంగారు పడితే.. ఏ అనుమానాం ఉన్నా నన్ను అడుగు చెబుతాను అంటూ వసు భరోసానిస్తుంది. అలా వసు ఉంగరాన్ని పుష్ప చూస్తుంది. చూస్తాను ఇవ్వు అంటూ వాగ్వాదం చేసుకునే సరికి ఆ ఉంగరం కిందపడుతుంది. రిషి కాళ్ల దగ్గరకు అది వెళ్తుంది. అక్కడ ఆ ఉంగరం గురించి వసు గొప్పగా చెప్పడంతో రిషి హర్ట్ అవుతాడు. పుష్పను కాబిన్‌కు రమ్మంటాడు.
భయం వేస్తుందని వసును కూడా పుష్పను తోడుగా తీసుకెళ్తోంది. వసు వద్దన్నా కూడా పుష్ప వినదు. ఇక ఇద్దరూ లోపలకు వెళ్లడంతో రిషి అరిచేస్తాడు. నేను రమ్మంది కేవలం పుష్పనే. నువ్ ఎందుకు వచ్చావ్ అని అవమానిస్తాడు. మన భూమి కోసం రాయాల్సిన ఆర్టికల్ గురించి పుష్పకు చెబుతాడు. బాగా రాయమని అంటాడు. నన్ను రాయమంటారా? అని వసు ఎంట్రీ ఇస్తుంది. నిన్ను అడిగానా? రమ్మన ముందే లోపలకు వచ్చావ్.. ఇప్పుడు పుష్పకు చెబుతుంటే నువ్ రాస్తాను అని అంటున్నావ్.. చెప్పిన పని మాత్రం చేయండి అంటూ వసును ఇంకా బాధపెడతాడు.
ఇక చివరకు కంటి నొప్పి ఎలా ఉందని వసును అడగడంతో తెగ సంబరపడిపోతుంది. బాగుంది సర్ అని చెబుతూ.. చేత్తో కంటిని పట్టుకోవడంతో మళ్లీ ఉంగరం కనిపిస్తుంది. మళ్లీ రిషి డిస్టర్బ్ అవుతాడు. అమాయకురాలిని చేసి ఆ శిరీష్, జగతి మేడం ఆడుకుంటున్నారా? బలవంతంగా పెళ్లికి ఒప్పించారా? అయినా వసుకు తనకంటూ ఓ నిర్ణయం ఉండాలి కదా? పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంది కదా? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుందంటూ తనలో తానే అనుకుంటాడు. ఇక వెళ్లండి అంటూ పుష్ప, వసులకు రిషి చెబుతాడు. అలా ఎపిసోడ్ ముగిసిపోతుంది.