- November 9, 2021
Guppedantha Manasu Episdoe 290 : వసుపై ఆగ్రహించిన రిషి.. కారణం ప్రేమా? కోపమా?

గుప్పెడంత మనసు సీరియల్‌లో సోమవారం నాడు రిషి, వసుల ఫోన్ కాల్‌తో ముగిసింది. పోకిరి సీన్‌లా నువ్ ఇక్కడే ఎక్కడో ఉన్నావ్ అది నాకు తెలుస్తోంది అని ఇలియానా అన్నట్టుగా వసు కూడా గెస్ చేసింది. రిషి తన రెస్టారెంట్ దగ్గరే ఉన్నాడని చెప్పింది. కానీ రిషి మాత్రం లేనని అబద్దం చెప్పేందుకు ప్రయత్నం చేశాడు. చాలా దూరంలో ఉన్నాను అంటాడు. కానీ రిషిని వసు చూస్తుంది. ఇలా దొరికిపోయానేంటి? అని రిషి అనుకుంటాడు.
కాఫీ తాగుదాం రండి సర్ అని రిషిని వసు అడుగుతుంది. ఇంట్రెస్ట్ లేదని అంటాడు రిషి. ఇంత దగ్గరకు వచ్చారు కదా? రండి సర్ అని వసు అంటుంది. ఒక్కోసారి ఎంత దగ్గరకు వచ్చినా కూడా వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అని రిషి తన ధోరణిలో తానే మాట్లాడుతాడు. అలానే కాఫీ తాగకుండా వెళ్లిపోతాడు. మొత్తానికి వసు మాత్రం బాధపడుతుంది. అదే ఆలోచనలతో త్వరగా ఇంటికి వెళ్తుంది. ఏమైంది వసు.. రెస్టారెంట్‌కు వెళ్లలేదా? అని జగతి అడుగుతుంది.
వసు డల్‌గా ఉండటం చూసి రిషి ఏమైనా అన్నాడా? అని అడుగుతుంది. నేను బాధలో ఉంటే అది రిషి వల్లనేనా? మేడం అని అంటుంది. మనసు అనే దాన్ని స్టోరూంలా చేయకు.. బయటపెట్టేసేయ్.. ఎక్కువగా మోయకు.. బాధపడకు అని వసుకు సలహా ఇస్తుంది. ఎక్కువగా దేనీ మీదా ఆశలు పెంచుకోవద్దు.. చివరకు నిరాశే మిగులుతుంది అని జగతి అంటుంది. నా ప్రమేయం లేకుండా జరిగే వాటికి నేను ఎక్కువగా బాధపడటం మానేస్తాను అని వసు అంటుంది.
ఇక డైనింగ్ టేబుల్ వద్ద మహేంద్ర, దేవయాణి ఇలా అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. అదే సమయంలో జగతి ఫోన్ చేస్తుంటుంది. తినేటప్పుడు ఆత్మీయులు ఫోన్ చేస్తారట అని దేవయాణి సెటైర్ వేస్తుంది. అక్కడ కాసేపు వదిన, మరిది మధ్య వాగ్వాదం జరగుతుంది. ఇక జగతిని ఇక్కడకు తీసుకురావడమే తరువాయి అని మహేంద్ర అంటాడు. రాదు.. రాలేదు.. రానివ్వను అని దేవయాణి అంటుంది. రిషి ఒప్పుకోడు అనేదే మీ ధైర్యం కదా? కురిసే వర్షాన్ని, కలిసే బంధాన్ని ఎవ్వరూ ఆపలేరు అంటూ మహేంద్ర డైలాగ్ కొట్టేస్తాడు. ప్రతీ రోజూ అమావాస్యే ఉండాలని కోరుకోవడం కూడా తప్పే.. వెన్నెల తప్పకుండా వస్తుందని మహేంద్ర చురకలు అంటిస్తాడు.
రిషి గురించి ఆలోచనలతో వసు సతమతమవుతుంది. ఎందుకు అలా ఉంటున్నాడు.. నేనేం తప్పు చేశాను.. అడుగుతాను. మెసెజ్ చేస్తాను. తిడితే తిట్టనివ్వు అని మెసెజ్ పెడుతుంది. నా మీద ఎందుకంతా కోపం అని మెసెజ్ చేస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయకు అని రిప్లై ఇస్తాడు రిషి. అలా అంటాడేంటి? అని ఎందుకంత కోపంగా ఉన్నారు.. నేను ఏం తప్పు చేశాను అని మళ్లీ మెసెజ్ చేస్తుంది. దీంతో రిషి.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో రిషి చాలా కోపంగా ఉన్నాడంటూ వసుకు అర్థమవుతుంది.
కాలేజ్‌లో ఒక అమ్మాయి తన పెళ్లి ఫిక్స్ అయిందని చెబుతూ స్వీట్ ఇస్తుంది. కానీ ఆ అమ్మాయిలోనూ వసు కనిపిస్తుంది. దీంతో చిరాకు పడతాడు. కానీ అంతలోపే అది వసు కాదని తెలుసుకుంటాడు. ఎందుకు ఇలా వసు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అంటూ రిషి మథన పడతాడు. తనలోనే తాను వసు గురించి అనుకుంటూ ఉంటే.. ఎదురుగా వస్తుంటుంది. చేతిలో పట్టుకున్న కాగితాలు ఎగిరిపడిపోతాయి. అందులో కొన్ని రిషి దగ్గరకు వస్తాయి.
ఊరికి వెళ్లలేదా? అని రిషి అడిగితే.. రాత్రి రిప్లై ఇవ్వలేదు సార్ అని వసు అంటుంది. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు.. ఊరికి వెళ్లాలని పర్మిషన్ తీసుకున్నావ్ వెళ్లలేదా? అని అంటాడు. పెళ్లికి ఇంకా టైం ఉంది సర్ అంటూ వసు అడుగుతుంది. ఈ పేపర్స్ మిషన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినవి సర్ అని అంటుంది. నేను అడిగానా? అంటూ రిషి కౌంటర్ వేస్తాడు. చెప్పడం నా ధర్మం సర్ అని వసు అంటుంది. అన్నీ నాకు చెబుతున్నట్టు అని సెటైర్ వేస్తాడు. పుష్పను నా కేబిన్‌కు రమ్మని చెప్పు అంటూ రిషి వెళ్లిపోతాడు.
పూర్తిగా చెప్పడు.. చెప్పేది వినడు..ఈ సర్ ఏంటో అర్థం కాడు. అర్థం చేసుకోరు అని వసు అనుకుంటుంది. ఇక పుష్ప కాబిన్‌లోకి రావడంతో ఆర్టికల్ గురించి ప్రశంసలు కురిపిస్తాడు. కానీ ఆ ఆర్టికల్ నేను రాయలేదు సర్.. వసు రాసింది అని పుష్ప అంటుంది. దీంతో రిషి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. రేపటి ఎపిసోడ్‌లో వసు మీద రిషి అంత ఎత్తున లేచేలా ఉన్నాడు. అయితే అది నిజంగానే కోపం చేస్తున్నాడా? లేదా పెళ్లి చేసుకుని వెళ్లిపోతోందనే బాధతో అరిచాడా? ప్రేమతో అరిచాడా? అన్నది చూడాలి.