• November 15, 2021

రోగాన్ని కూడా కామెడీకి వాడుకుంటున్నాడు.. కమెడియన్ నూకరాజుకు ఏమైంది?

రోగాన్ని కూడా కామెడీకి వాడుకుంటున్నాడు.. కమెడియన్ నూకరాజుకు ఏమైంది?

    కమెడియన్ నూకరాజు పటాస్ షో నుంచి ఫేమస్ అయ్యాడు. కానీ ఎక్కువగ స్కోప్ దక్కింది మాత్రం జబర్దస్త్ స్టేజ్ మీదే. ఆ తరువాత శ్రీదేవీ డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్ వంటి షోలతో నూకరాజు బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా ఇమిటేషన్ చేయడంలో నూకరాజు స్టైల్ వేరు. ఇక ఇమాన్యుయేల్‌ను అయితే దారుణంగా ఇమిటేట్ చేస్తాడు. నూకరాజు దెబ్బకు ఇమాన్యుయేల్ నోర్మూసుకుంటాడు. అలాంటి నూకరాజు ఓ రోగంతో బాధపడుతున్నాడు.

    అతని షుగర్ వ్యాధి ఉందట. దాని మీద కూడా జోకులు వేస్తున్నారు. తాను కూడా తన రోగం మీద జోగులు వేసుకుంటున్నాడు. అయితే ఒకసారి తనకు రోగం ఉందని, ఇంకోసారి రోగం పోయిందని చెబుతున్నాడు. అసలు ఇంతకి నూకరాజుకు ఆ రోగం ఉన్నట్టా? లేనట్టా అనేది తెలియడం లేదు. మొన్నటికి మొన్న శ్రీదేవీ డ్రామా కంపెనీలో తన రోగం గురించి ప్రస్థావన వచ్చింది.

    సునామీ సుధాకర్‌‌ను ఉద్దేశించి నూకరాజు డైలాగ్ చెబుతూ.. ఆమె కళ్లు షుగర్ పెషేంట్‌లు తినే నెరెడి పండ్లు అని అంటాడు. అప్పుడు చలాకీ చంటి.. మనిషిని పొగడమంటే నీ షుగుర్ గురించి చెప్తావేంటి అంటూ కౌంటర్ వేస్తాడు. అయితే జడ్జ్‌గా ఉన్న ఇంద్రజ మధ్యలోకి దూరుతుంది.. వాడు ఏది స్టార్ట్ చేసిన షుగర్‌తోనే చేస్తున్నాడని సెటైర్ వేస్తుంది. లేదు మేడమ్ నాకు పోయిందని.. నూకరాజు బదులిస్తాడు.

    అయితే తాజాగా మరోసారి తన షుగర్ రోగం గురించి చెబుతాడు. ఆడవాళ్లకు ఆదివారం సెలవు అంటూ వచ్చే వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ షోను చేస్తుంది. ఇందులో లాస్య ఈ స్లోగన్ను చెబుతుంది. ఆదివారం ఆడవాళ్లకు సెలవు కావాల్సిందే అని అంటుంది. అవును కావాల్సిందే అని నూకరాజు కూడా సందులో సడేమియాగా అంటాడు. అబ్బ ఎంత మంచి మాట అన్నావ్ రా.. నీ నోట్ల చెక్కర పొయ్యా అని అంటుంది. నోట్లో ఎందుకు ఒళ్లంతా చెక్కరే ఉంది కదా? అని నూకరాజు అంటాడు. అలా మొత్తానికి నూకరాజు రోగం కూడా కామెడీగా పనికొస్తుంది.

    Leave a Reply