• November 5, 2021

కార్తీకదీపం మోనిత మెడలో తాళి.. ఆశ్చర్యపరిచిన శోభా శెట్టి

కార్తీకదీపం మోనిత మెడలో తాళి.. ఆశ్చర్యపరిచిన శోభా శెట్టి

    కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది శోభా శెట్టి. అంతకు ముందు కన్నడలో సీరియల్స్, సినిమాలు చేసి బాగానే ఫేమస్ అయింది. ఇక తెలుగులో అష్టాచమ్మా సీరియల్‌తో శోభా శెట్టి పరిచయం అయింది. అయితే గుర్తింపు, పేరు, ఫేమస్, క్రేజ్ వచ్చింది మాత్రం కార్తీకదీపం సీరియల్తోనే. మోనిత పాత్రలో శోభా శెట్టి నటిస్తున్న తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.

    సీరియల్ చూస్తున్న ప్రతీ ఒక్కరూ మోనితను గొంతు పిసికి చంపేయాలన్నంతగా కసిగా ఉంటారు. అంతలా ఆమెను ఆడిపోసుకుంటారు. అలా జనాల మీద మోనిత అంతటి ప్రభావం చూపిస్తోందంటే.. ఆమె ఎంతలా ఆ పాత్రను రక్తి కట్టిస్తుందో ఊహించుకోవచ్చు అలాంటి శోభా శెట్టి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. కార్తీక దీపం సీరియల్‌లో కార్తీక్ చేత తాళి కట్టించుకునేందుకు మోనిత ప్రయాసలు పడుతూనే ఉంటుంది.

    రియల్ లైఫ్‌లోనూ ఇంకా శోభా శెట్టికి పెళ్లి కానట్టు తెలుస్తోంది. కానీ తాజాగా ఆమె మెడలో తాళి కనిపించింది. దీపావళి సందర్భంగా స్పెషల్ దిగిన ఫోటోలను శోభా శెట్టి షేర్ చేసింది. అందులో ఆమె మెడలో తాళి కనిపించింది. మరి అది ఏదైనా ఇతర సీరియల్ షూటింగ్‌లో భాగంగా ధరించిందా? లేదా ఇంకేమైనా విశేషం ఉందా? అన్నది తెలియడం లేదు.

    Leave a Reply