• November 18, 2021

పాపం అరియానా!.. ఆర్జీవీ ఎపిసోడ్‌పై ఇంకా సాధిస్తున్న అవినాష్

పాపం అరియానా!.. ఆర్జీవీ ఎపిసోడ్‌పై ఇంకా సాధిస్తున్న అవినాష్

    అరియానా ఆ మధ్య ఆర్జీవీతో చేసిన చెత్త ఇంటర్వ్యూ, చెత్త ముచ్చట్ల గురించి అందరికీ తెలిసిందే. అరియానా, ఆర్జీవీ కలిసి వర్కవుట్లు చేశారు. జిమ్ ఏరియాలోనే ముచ్చట్లు పెట్టుకున్నారు. అరియానా మీద, ఆమె బాడీ పార్టుల మీద ఆర్జీవీ చేసిన కామెంట్లు ఎంతలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక శృంగారం గురించి పెట్టిన ముచ్చట్లు నానా హల్చల్ చేశాయి. అయితే ఆర్జీవీ, అరియానాల పేర్లు ఆ సమయంలో బాగానే మార్మోగిపోయాయి.

    అలా ఆర్జీవీతో అరియానా చేసిన ఇంటర్వ్యూ అవినాష్‌కు నచ్చలేదు. దీంతో అలాంటివి చేయోద్దు అని అవినాష్ సూచించాడట. కానీ నా ఇష్టం నువ్వెవరు అని అరియానా అరిచేసిందిట. దీంతో ఓ రెండు నెలలు ఇద్దరూ మాట్లాడుకోలేదట. అందుకే మధ్యలో కామెడీ స్టార్స్ షోలో అరియానా కనిపించలేదు. గొడవ కాస్త తగ్గిన తరువాత మళ్లీ కామెడీ స్టార్స్ షోలో అరియానా వచ్చింది. అదే ఎపిసోడ్‌లో అరియానాను రోస్ట్ చేసి పడేశాడు. ఆర్జీవీలా ఇమిటేట్ చేస్తూ ఆ ఇంటర్వ్యూ వచ్చిన ట్రోల్స్, తనకు ఉన్న కసి అంతా కూడా తీర్చుకున్నాడు.

    ఆ స్కిట్‌లో అవినాష్ ఎంత చేసినా కూడా అరియానా ఏమీ అనలేదు. ఇక చాలా? అయిపోయిందా? కోపం చల్లారిందా? అని అనేసింది. అయితే తాజాగా మరోసారి అరియానా మీద అవినాష్ తన కోపాన్ని పరోక్షంగా చూపించేశాడు. అరియానా, అవినాష్, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయిలు వావ్ షోకు గెస్టుగా వచ్చారు. అందులో ఆర్జీవీలా అవినాష్ ఇమిటేట్ చేశాడు.

    సాయి కుమార్ గారు ఎలా ఉన్నారు.. అని ఆర్జీవీ స్టైల్లో అడిగాడు అవినాష్. బాగున్నాను అని సాయి కుమార్ అంటాడు. బాగున్నారు కాబట్టే ఇక్కడకు వచ్చారు అని అంటాడు. వావ్ అని అవినాష్ అంటాడు. మీ షో గురించి కాదు నేను చెప్పింది. అరియానాను చూసి వావ్ అని అన్నాను అని అవినాష్ అంటాడు. నీకేం కావాలో నాకు తెలుసు.. నాకేం కావాలో నీకు తెలుసు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడు అవినాష్.

    పబ్లిసిటీ కదా? అని అరియానా టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అరియానా నీ కాళ్లు బాగున్నాయ్.. అని అవినాష్ అంటాడు. అందుకే సర్ ఈ సారి మొత్తం కవర్ చేసుకుని వచ్చాను అని తొడల కామెంట్ గురించి పరోక్షంగా లేవనెత్తాడు. ఇక అవినాష్ బ్యాక్ సైడ్ చూస్తాడు. అరియానా తన బ్యాక్‌పై చేతులు వేసుకుంటుంది. అవినాష్ నిన్ను చంపేస్తాను అని అంటుంది. నీ బ్యాక్ సైడ్ హెయిర్ స్టైల్ బాగుందని అంటున్నాను అని కవర్ చేశాడు అవినాష్. అంటే నాటి ఇంటర్వ్యూ.. ఆ ట్రోల్స్, ఆ కామెంట్లను అవినాష్ ఇంకా మరిచిపోకుండా ఇలా అరియానాను సాధిస్తున్నాడు.

    Leave a Reply