అషూ రెడ్డి ఆర్జీవీల ట్రాక్ గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అషూ ఆర్జీవీలు కలిసి చేసిన ఇంటర్వ్యూ, అందులో ఇద్దరూ మాట్లాడుకున్న తీరే, శృంగారం గురించి, వయసు గురించి, శరీరంలోని పార్ట్‌ల గురించి, అషూ బ్యాక్ గురించి, తొడల గురించి ఇలా రకరకాలుగా పచ్చి పచ్చిగా మాట్లాడుకున్నారు. అలాంటి అషూ రెడ్డి ఇప్పుడు ఆర్జీవీ అంటే భయపడుతోందా? అనే అనుమానం కలుగుతోంది. ఆర్జీవీకి ఫోన్ చేయమంటే దెబ్బకు భయపడి వెనక్కి వెళ్లింది.
తాజాగా అషూ రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్, కుమార్ సాయి, అరియానా కలిసి సుమ క్యాష్ షోలో గెస్టులుగా వచ్చారు. ఈ శనివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇందులో సుమ పదే పదే బోల్డ్ బోల్డ్ అంటూ అరియానా, అషూ రెడ్డిలను ఆడుకుంది. అందులో అరియానా ఫోన్ ఇవ్వాలని అడిగింది. వాట్సప్ చాట్ చూపిస్తే మీరు బోల్డ్ అని అంది. అయితే అరియానా వాట్సప్ చాట్‌లు చూసి సుమ షాకైంది.
ఎవరైతే ఇప్పుడు ఆర్జీవీకి ఫోన్ చేసి మాట్లాడతారో వారే బోల్డ్ అని అంటుంది సుమ. దీంతో అషూ రెడ్డి దెబ్బకు వెనకడుగు వేస్తుంది. అషూ రెడ్డి మాట్లాడితే ఓ బీప్ సౌండ్ వేస్తారు. దానికి అర్థం ఏంటో తెలియలేదు. ఆమె ఏ పదం వాడి ఉంటుందో అర్థం కావడం లేదు. కానీ కాఫికి పిలుస్తాడు.. ఇప్పుడు నాకు అది అవసరమా? అంటూ అర్జీవీ గురించి అషూ చెప్పేసింది. అంటే కాస్త చనువు ఇస్తే ఆర్జీవీ అన్నీ అడిగేస్తాడు అనేట్టుగా అషూ రెడ్డి కామెంట్లున్నాయి.