- November 5, 2021
అనారోగ్యం పాలైన వర్షిణి.. దెబ్బకు యాంకర్ మొహం మారిపోయింది!

యాంకర్ వర్షిణి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ స్పీడులో దూసుకుపోతోంది. ఎన్నిరకాల అవాంతరాలు వచ్చినా, కాలం కలిసి రాకపోయినా కూడా వర్షిణి మాత్రం వెలుగుతూనే ఉంది. ఒకప్పుడు ఓటీటీలో దుమ్ములేపేసింది. పెళ్లి గోళ అంటూ హల్చల్ చేసింది. ఆ తరువాత బుల్లితెర మీదకు వచ్చింది. అక్కడా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకుంది. మొదట్లో కాస్త తడబడ్డా కూడా నిలబడింది. వర్షిణి డ్యాన్సుల మీద లెక్కలేనన్ని జోకులు వచ్చాయి. ఆమె వేసే స్టెప్పులు, పిచ్చి గెంతుల మీద మీమ్స్, ట్రోల్స్ జరిగాయి. ఆది కూడా ఆమె స్టెప్పులను ఎగతాళి చేసేవాడు.
కానీ చివరకు వర్షిణి తన సత్తా ఏంటో చూపించింది. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. డ్యాన్స్ కసిగా నేర్చుకుంది. అందరి నోళ్లు మూయించింది. అలా బుల్లితెరపై వర్షిణి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఢీ షో నుంచి వర్షిణిని తప్పించారు. తప్పించలేదు.. వర్షిణియే తప్పుకుందని కొందరు అంటారు. అయితే వర్షిణికి కామెడీ స్టార్స్ షోలో అవకాశం వచ్చింది. సింగిల్ హ్యాండ్‌తో వర్షిణి ఆ షోను నడిపించింది. అయితే తరువాత వర్షిణి మళ్లీ అక్కడి నుంచి జంప్ అయింది.
వర్షిణి స్థానంలో శ్రీముఖి వచ్చి సెటిల్ అయింది. సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తుండటంతో.. కామెడీ స్టార్స్‌ను వర్షిణి వదిలి పెట్టేసింది. సుమంత్ మళ్లీ మొదలైంది చిత్రంలో వర్షిణి పుల్ లెంగ్త్ రోల్. మొన్నీ మధ్యే వదిలిన టీజర్‌లో వర్షిణి ఫుల్ హైలెట్ అయింది. ఇక సమంత శాకుంతలం సినిమాలోనూ వర్షిణిది పెద్ద పాత్రేనట. అయితే తాజాగా వర్షిణి ఆరోగ్యం బాగా లేదట. దగ్గు, జలుబు చేసిందట. త్వరగా వెళ్లిపో అంటూ వాటిని బతిమిలాడింది. ఈ క్రమంలో వర్షిణి వెరైటీ ఎఫెక్ట్‌లతో ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో వర్షిణి మొహం దారుణంగా మారింది.