- November 7, 2021
అవసరంలో ప్రాణాలను కూడా లెక్కచేయవు.. యాంకర్ రష్మీ ఎమోషనల్

యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రష్మీ చేసే మంచి పనులకు అందరూ అబ్బురపడతారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా సాయం చేసేందుకు ముందుకు వస్తుంది. మరీ ముఖ్యంగా మూగ జీవులకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా విలవిల్లాడుతుంది. అలాంటి రష్మీ పెట్స్ కోసం ఎక్కువగా పరితపిస్తుంది. ఎవరైనా మూగ జీవాలను హింసిస్తున్నారని తెలిస్తే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటుంది. తాజాగా రష్మీ ఓ మూగజీవి గొప్పదనాన్ని చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.
అసలే విశ్వాసానికి మారు పేరు కుక్క. కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదని అంటారు. అలాంటి కుక్కలపై రష్మీకి ఎనలేని ప్రేమ ఉంది. వీధి కుక్కల కోసం రష్మీ గత లాక్డౌన్లో ఎంతలా పాటు పడిందో అందరికీ తెలిసిందే. లాక్డౌన్ వల్ల కుక్కలకు కూడా ఆహారం దొరకలేదు. అందుకే బకెట్ పట్టుకుని వీధుల్లోకి వెళ్లి కుక్కలకు ఫుడ్ పెట్టేసింది. తాజాగా కుక్క విశ్వాసానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఓ మనిషి ఫుట్ పాత్ మీద పడుకున్నాడు.
ఆ మనిషి వద్దే ఓ కుక్క ఉంది. అలా పడుకున్న మనిషి ఎవరో ఒక వ్యక్తి వచ్చి కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ కుక్క మాత్రం కొట్టనివ్వకుండా అడ్డు పడింది. అతన్ని పరిగెత్తించింది. ఆ వీడియోను రష్మీ షేర్ చేస్తూ కుక్కల గురించి చెప్పుకొచ్చింది. మీరు ఒక్క బిస్కెట్ దానికి తినిపించినా చాలు అది ఎంతో విశ్వాసంగా ఉంటుంది.. మీకు అవసరం అయినప్పుడు దాని ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడుతుంది అంటూ రష్మీ తనకు మూగ జీవాల మీదున్న ప్రేమను అలా తెలిపింది.