• November 6, 2021

దయచేసి అలాంటి పనులు చేయకండి.. వేడుకున్న యాంకర్ రష్మీ

దయచేసి అలాంటి పనులు చేయకండి.. వేడుకున్న యాంకర్ రష్మీ

    యాంకర్ రష్మీకి సోషల్ మీడియాలో ఉన్న అభిమాన గణం గురించి అందరికీ తెలిసిందే. తెరపై రష్మీ అందాలకు అభిమానులు ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఆమె మంచి మనసుకు అభిమానులు ఉంటారు. ఆమె మనస్తత్వం, ఆమె సేవా కార్యక్రమాలు, మూగ జంతువుల మీదున్న ప్రేమను చూసి అందరూ ముచ్చటపడుతుంటారు. అలా రష్మీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ చేసే మంచి పనులకు అందరూ అండగా నిలుస్తుంటారు.

    ఏవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారని తెలిసినా, మూగ జీవాలకు కష్టం కలిగిందని తెలిసినా రష్మీ వెంటనే స్పందిస్తుంటుంది. ఎవరికైనా ఆర్థిక సాయం కావాలన్నా కూడా తన వంతుగా చేతనైనా సాయం చేస్తుంది. తన స్థాయికి మించిన సాయం అయితే.. తన ఫాలోవర్లను అభ్యర్థిస్తుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రూపాయి ఇచ్చినా చాలు అంటూ వేడుకుంటుంది. ఆమధ్య ఇలానే ఓ సారి ఓ వ్యక్తికి ఆపరేషన్ చేయాల్సి వస్తే.. అందరినీ వేడుకుంది.

    అలాంటి రష్మీ మీద నెటిజన్లు అభిమానం కురిపిస్తుంటారు. రష్మీ మీద ప్రేమను చూపించేందుకు రకరకాల వీడియోలను క్రియేట్ చేస్తారు. రష్మీ కోసం మంచి ఎడిట్స్ చేస్తుంటారు. అలా తన మీద అభిమానులు చూపించే ప్రేమకు రష్మీ ముగ్దురాలైపోయింది. తాజాగా తన అభిమానులను అలా చేయొద్దని కోరుకుంది. మీ ప్రేమ నాకు అర్థమైంది.. మీరు అలా చేయడం బాగానే ఉంది. కానీ అలాంటివి చేయకండి. దాని కోసం మీ చదువు, పని, కుటుంబాన్ని పక్కన పెట్టకండి సమయాన్ని వృథా చేయకండి అని వేడుకుంది.

    Leave a Reply